హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nellore: ప్రేమించాడు.. పెళ్లంటే మాయమయ్యాడు..! ప్రేయసి ఇచ్చిన ట్విస్ట్‌ మామూలుగా లేదు

Nellore: ప్రేమించాడు.. పెళ్లంటే మాయమయ్యాడు..! ప్రేయసి ఇచ్చిన ట్విస్ట్‌ మామూలుగా లేదు

ప్రియుడుకి

ప్రియుడుకి చుక్కలు చూపించిన ప్రియురాలు

Nellore: ఏడేళ్లు ప్రేమించి.. అవసరానికి డబ్బులు తీసుకుని... తీరా పెళ్లి చేసుకోమంటే.. మొఖం చాటేశాడు ప్రేమికుడు. దీంతో ఆ ప్రియురాలు.. తన ప్రియుడుకి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. చివరికి అనుకుంది సాధించింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Nellore, India

  Polaa Sudha, News18, Nellore.

  Nellore: ప్రేమించి మోసం చేసే ఘటనలు ఈ రోజుల్లో చాలా పెరిగాయి. అయితే అలా ప్రియుడి చేతిలో మోసపోయానని ప్రియురాలు.. లేదా ప్రియురాలు మోసం చేసిందని ప్రియుడు మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం.. మరికొందరు అయితే ఉన్మాధులుగా మారి ఎంతకైనా తెగిస్తున్నారు.  అలాంటి వారందరూ ఈమెను చూసి నేర్చుకోవాలి.. అనుకున్నది సాధించి.. సంతోషంగా జీవిస్తోంది. ఏమైందంటే..? ఏడేళ్లు ప్రేమించి.. అవసరానికి అన్ని విధాలా వాడుకున్నాడు. తీరా పెళ్లి చేసుకోమంటే.. మొఖం చాటేశాడు ఆ ప్రేమికుడు.  అయినా అతడే తనకు కావాలి అనుకుంది.. ఎట్టి పరిస్థితుల్లోనూ అతడినే పెళ్లి చేసుకోవాలి అనుకుంది. చివరికి ఏం చేసింది అంటే..?

  నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం అల్తుర్థి గ్రామనికి చెందిన గుత్తి కొండ హరి నారాయణ అనే యువకుడు .... చేజర్ల మండలం ఏటూరు గ్రామానికి చెందిన పోలిపోగు మాధవి ప్రేమించుకున్నారు. ఏడేళ్ల క్రితం వీరిద్దరి మధ్య చిగురించిన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. సినిమాలు, షికార్లు..ఇలా ఒకటేమిటి పెళ్లి చేసుకోబోతున్నామనే ధీమాతో చెట్టాపట్టాలేసుకుని ఊరంతా తిరిగారు.

  మాధవి ఉద్యోగం చేస్తుంది. హరి నారాయణ మాత్రం ఆవారాగా తిరిగేవాడు. అతని జల్సాలకు అవసరమైనప్పుడల్లా అడిగినంత డబ్బులు కూడా ఇస్తూ వచ్చింది. ఇదే అలవాటు పడిన హరి..మాధవిని మరింత ప్రేమమత్తులో దించాడు. ప్రియుడి మీద నమ్మకంతో మాధవి సర్వం సమర్పించుకుంది.

  ఇదీ చదవండి : కొడాలి నాని మౌనానికి అర్థం ఏంటి..? విమర్శలపై ఎందుకు స్పందించడం లేదు?

  ఇంక ఎన్నేళ్లు ఇలా ప్రేమపక్షుల్లా తిరుగుదాం…పెళ్లి పీటలెక్కుదామని మాధవి ప్రియుడిని అడిగింది. ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు, అలకలు మొదలయ్యాయి. ఆ గొడవలను అడ్డుగా పెట్టుకుని ప్రియుడు హరి నారాయణ పత్తా లేకుండా పోయాడు. దీంతో హరినారాయణ తనను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నాడని తెలుసుకుంది.

  ఇదీ చదవండి : నగదు తీసుకోవడానికి వేలి ముద్రలు వేస్తున్నారా..? అయితే బీకేర్ ఫుల్.. దీని గురించి తెలుసుకోవాల్సిందే

  దీంతో ప్రియుడిని నేరుగా కలిసి తేల్చుకోవలనుకుంది. బయట ఎక్కడా అతను దొరకకపోవడంతో నేరుగా అల్తుర్థి గ్రామానికి వచ్చి ప్రియుడి ఇంటి ముందు బైఠాయించి నిరసన చేపట్టింది. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయాలని ఆ యువతీ ఇంటిముందు అంతే కూర్చుంది. గ్రామస్తులంతా అక్కడకు వచ్చి యువతిని నిలదీశారు. ఆమె జరిగిందంతా వాళ్లకు చెప్పింది. ఈ విషయం ఆ నోట ఈ నోట తెలిసి నెల్లూరు దిశా ప్రొటెక్షన్ వెల్పేర్ ఫౌండేషన్ స్టేట్ సెక్రటరీ నిడిగుంట అరుణ ఆధ్వర్యంలో దళిత సంఘాల మహిళా నాయకురాళ్లు ఆ యువతికి బాసటగా నిలబడ్డారు.

  ఇదీ చదవండి : ఆస్ట్రేలియా టూ కాకినాడ ..! విద్యార్థులను వెతుక్కుంటూ ఖండాంతరాలు దాటొచ్చిన టీచరమ్మ..! ఎందుకో తెలుసా?

  ప్రియుడు హరినారాయణ కుటుంబసభ్యులతో మాట్లాడారు. కానీ, వాళ్లు మొదట్లో ససేమిరా అన్నారు..ఎట్టకేలకు హరినారాయణను పట్టుకొచ్చి..యువతితో గుడిలో తాళి కట్టించారు. మహిళా నాయకురాళ్ల సమక్షంలో దండలు మార్చుకున్నారు. తనకు న్యాయం చేసినందుకు…. దగ్గరుండి తమ పెళ్లి చేసిన అరుణ, మహిళానాయకులకు మాధవి కృతజ్ఞతలు తెలిపింది. ఎట్టకేలకు ఈ ప్రేమకథ సుఖాంతమైంది.

  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Local News, Nellore Dist

  ఉత్తమ కథలు