హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nellore: స్వాతంత్య్ర సమరయోధుల మధ్య వినాయకుడు.. దైవభక్తితో పాటు దేశ భక్తి..

Nellore: స్వాతంత్య్ర సమరయోధుల మధ్య వినాయకుడు.. దైవభక్తితో పాటు దేశ భక్తి..

దైవ

దైవ భక్తితో పాటు.. దేశ భక్తి

Nellore: గణేష్ నవరాత్రులు అంటే దేశ వ్యాప్తంగా సంబరాలే కనిపిస్తాయి. గణపతి బప్పా మోరియా అంటూ వీధి వీధి ఉప్పొంగుతుంది. ఈ వేడుకల్లో భాగంగా నెల్లూరులో దేశభక్తిని చాటుకునేలా గణేష్‌ మండపాన్ని తీర్చిదిద్దారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Nellore, India

  Polaa Sudha, News18, Nellore.

  Nellore:  దేశ వ్యాప్తంగా గ‌ణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.  దేశవ్యాప్తంగా ఊరూ వాడా ఎక్కడ చూసినా సంబ‌రాలే కనిపిస్తున్నాయి. భారీ విగ్రహాలు.. ఆకర్షణీయమైన సెట్టింగులు… పూల‌ డెక‌రేష‌న్లతో మండ‌పాల అలంకరణలు.. విభిన్న ఆకృతుల్లో గణనాథుడు పూజలందుకుంటూ భ‌క్తుల‌కు ద‌ర్శన‌మిస్తున్నాడు. ప్రతి ఏటా పర్యావరణ పరిరక్షణ గణనాథుని విగ్రహాలు కనిపిస్తూనే ఉంటాయి. ఈ ఏడాది మనకు స్వాతంత్స్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని చోట్ల దేశభక్తిని పెంపొందిచే గణేషులు కూడా కొలువుదీరారు. అలా కొలువుదీరిందే నెల్లూరు చిన్నబ‌జారులోని రాణాప్రతాప్ సెంట‌రుల్ ఉన్న విఘ్నేశ్వరుడు.

  ఆది శేషుడి ప‌డ‌గ నీడ‌లో కూర్చున్న పార్వతీ తనయుడిలా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం ఎత్తు 15 అడుగులు ఉండగా… గ‌ణ‌ప‌య్య కోసం త‌యారు చేసిన ల‌డ్డూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎందుకంటే శివ‌లింగం ఆకృతిలో ఆ ల‌డ్డూ ఉండ‌డ‌మే అందుకు కార‌ణం. ఈ మహా విఘ్నేశ్వరుడిని తిలకించేందుకు జనం భారీగా తరలివచ్చారు. గ‌ణ‌ప‌య్యతో క‌లిసి సెల్ఫీలు తీసుకునేందుకు ఆస‌క్తి చూపుతున్నారు.

  గ‌ణ‌ప‌య్యకు ఉదయం పూజతో మొద‌లై.. రాత్రి వర‌కు వివిధ కార్యక్రమాలతో అక్కడ సందడి నెల‌కొంటుంది. ఈ విగ్రహం మాత్రమే ప్రత్యేకం కాదు..ఇక్కడ మ‌రో విశేషం కూడా ఉంది. దేశ‌భ‌క్తిని పెంపొందించేలా, దేశ‌భ‌క్తులు, స్వాతంత్య్ర స‌మ‌ర యోధుల చిత్రప‌టాల‌ను ఇక్కడ ప్రద‌ర్శనలో ఉంచారు. నేటి త‌రానికి, భావిత‌రానికి సమరయోధుల చ‌రిత్ర తెలిసేలా ఈ ఫోటో ఎగ్జిబిష‌న్‌ను ఏర్పాటు చేశారు.

  ఇదీ చదవండి : కదిలే అంబారీపై లంబోదరుడు సవారీ.. ఈ గణపతి ప్రత్యేకత ఏంటో తెలుసా..?

  పొట్టి శ్రీరాములు, పింగ‌ళి వెంక‌య్య , రాణాప్రతాప్, పులితేవ‌న్, బిర్సా ముండా, ర‌వీంద్రనాధ్ ఠాగూర్, ఎన్జీ రంగా, ఝాన్సీ ల‌క్ష్మీబాయి, ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామ‌రాజు, బాల‌గంగాధ‌క్ తిలక్, భ‌గ‌త్ సింగ్, స‌ర్దార్ వ‌ల్లభాయ్ ప‌టేల్, స‌రోజినీ నాయుడు, సుంద‌ర‌శాస్త్రి సత్యమూర్తి, క‌ల్పనా ద‌త్తా, సుఖ్ దేవ్ థాప‌ర్, టంగుటూరి ప్రకాశం పంతులు, టికేంద్రజిత్ సింగ్, వీవీఎస్ అయ్యర్, ఛ‌త్రప‌తి శివాజీ, చ‌క్రవ‌ర్తి రాజ‌గోపాలాచారి, చంద్రశేఖ‌ర్ సీతారం తివారీ, చిత్తరంజ‌న్ దాస్, రాణి దుర్గావ‌తి, గొట్టిపాటి బ్రహ్మయ్య, జ‌తీంద్రనాధ్ దాస్, క‌మ‌లాదేవి ఛ‌టోపాధ్యాయ‌, క‌న‌క‌ల‌తా బారువా, కె.ఎం.మున్షీ, కొమ‌రం భీమ్, మంగ‌ల్ పాండే,.. ఇలా మొత్తం 60 మంది దేశ‌భ‌క్తుల ఫోటోల‌ను ఈ మండపంలో ప్రద‌ర్శించారు.

  ఇదీ చదవండి : అక్కాబావ ఫ్యామిలీ రెస్టారెంట్‌..! తక్కువ రేటుకే తిన్న వాళ్లకు తిన్నంత.. ఎక్కడో తెలుసా

  ఆజాదీకా అమృత్ మ‌హోత్సవాల్లో భాగంగానే ఇలా దేశ నాయ‌కుల ఫోటోలను, స్వాతంత్ర్య సమరయోధుల ఫొటోలను గ‌ణేష్ మండ‌పంలో ఏర్పాటు చేసిన‌ట్లు ఉత్సవ క‌మిటీ నిర్వాహ‌కులు తెలిపారు. ఇలా ఒక్కో చోట ఒక్కో థీమ్‌తో గణనాథుడిపై తమకున్న భక్తిని చాటుకుంటున్నారు. ప్రజల దృష్టి ఆకర్షించేలా ట్రెండింగ్‌లో ఉన్న క్యారెక్టర్స్‌ ఆధారంగా గణేషుని విగ్రహాలను మండపాలలో ఏర్పాటు చేస్తున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Ganesh Chaturthi​ 2022, Local News, Nellore

  ఉత్తమ కథలు