Polaa Sudha, News18, Nellore
పెట్రోల్ ( Petrol ), డీజిల్ ( Diesel ) ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు (Electrical Vehicles) కొనేవారి సంఖ్య పెరుగుతోంది. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థలు దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తెచ్చాయి. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా ( Nellore District ) లోనూ వీటి వినియోగం పెరిగింది. నెల్లూరు నగరం (Nellore City)లో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్ళకు డిమాండ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు కూడా ఈవీ వాహనాలపైనే ఆసక్తి చూపుతున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాలు కార్బన్ ఉద్గారాల విడుదలను తగ్గించడంతో పాటు పర్యావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లదు. పెట్రోల్ బాధల నుంచి కూడా విముక్తి పొందినట్లవుతుందని ఈవీ బైక్‌ల కొనుగోళ్ళ కోసం ఇంట్రెస్ట్ చూపుతున్నారు.
నెల్లూరు నగరంలోని రీవోల్ట్ హబ్ పేరుతో వెలిసిన ఎలక్ట్రికల్ వెహికల్స్ కు మంచి డిమాండ్ ఉంది.
భారతదేశపు మొట్టమొదటి AI- ఎనేబుల్డ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌తో రివోల్ట్ ముందుకు వచ్చింది. విప్లవాత్మక మార్పులతో, మెరుగైన ఫీచర్లతో వాహన ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చేసింది. ఈవీ బైక్‌ల వల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఈ బైక్ గురించిన వివరాలను, రీవోల్ట్ అందిస్తోన్న ఎలక్ట్రిక్ వాహనాల వల్ల కలిగే ఉపయోగాలను మేనేజర్ రవి వివరించారు.
ఇదీ చదవండి : వయోలిన్‌తో రాగాలు.. డ్రమ్స్ తో డ్యాన్స్.. ఈ చిన్నారుల టాలెంట్ చూస్తే ఔరా అనాల్సిందే
ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రభుత్వం జీఎస్టీ మినహాయింపు ఇస్తుంది. గతంలో 12 శాతం ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు. లోన్ తీసుకొని EVని కొనుగోలు చేస్తే దాని వడ్డీపై పన్ను మినహాయింపు ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ లేదు. గ్రీన్ ట్యాక్స్ అంటే ప్రతి 15 ఏళ్లకు ఒకసారి వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేసుకోవాలి. అందుకు కొంత పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు అలాంటి పన్ను ఉండదు. మెయిన్టెనెన్స్ ఖర్చు కూడా తక్కువే. ఎలక్ట్రిక్ బైక్‌లకు ఇన్సూరెన్స్ కూడా అందుబాటులో ఉంది. బ్యాటరీతో నడుస్తుంది కాబట్టి ఈవీ బైక్‌కి పొల్యూషన్ సర్టిఫికెట్ కూడా అవసరం లేదు.
ఇదీ చదవండి : అక్టోబర్ 15 నుంచి పేద ప్రజలకు మరో శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్
ఎలక్ట్రిక్ వాహనం వల్ల ప్రయోజనాలు ఎన్నో ఉన్నా.. ఈ బైక్ వాడకం కొంత కలవరానికి గురి చేస్తోంది. ఎందుకంటే ఈవీ వాహనాలు ఇటీవల కాలిపోవడం, బ్యాటరీ పేలిపోవడం తరచూ చూస్తున్నాం. ఇలాంటి ఘటనలు గుజరాత్, పూణె, చెన్నై, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో చూసే ఉన్నాం.
ఇదీ చదవండి : చంద్రబాబుకు మరో టెన్షన్.. ముదిరిన చిరంజీవి vs బాలకృష్ణ పోరు.. టీడీపీ కీలక అదేశాలు
బ్యాటరీ ఎక్కువగా చార్జింగ్ పెట్టడం, పెట్టిన తర్వాత స్విచ్ ఆఫ్ చేయకపోవడం, ఎండలో ఎక్కువగా ఉండడం వల్ల బ్యాటరీ హీటెక్కడం.. ఇలాంటి వాటి వల్ల ఈవీ బైక్ లు ప్రమాదానికి గురవుతున్నాయి. కాలి బూడిదవుతున్నాయి. ఈ ప్రమాదాల బారిన పడి కొంతమంది ప్రాణాలు కూడా పోయాయి. ఎలక్ట్రిక్ స్కూటర్స్‌లో బ్యాటరీ మేనేజ్ మెంట్ సిస్టమ్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇదీ చదవండి : సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు.. అన్న కోసం ఏం చేశానో క్లారిటీ ఇచ్చిన షర్మిల
ఈవీ వెహికల్స్‌లో ఉండే బ్యాటరీ ఓల్టేజ్‌లో భారీ హెచ్చు తగ్గుల కారణంగా లిథియం ఐయాన్ బ్యాటరీలు పేలే ప్రమాదం ఉందని వాహనరంగ నిపుణుల అభిప్రాయం. అలాగే ఎర్త్ లేకుండా బ్యాటరీ చార్జింగ్ చేస్తే.. వైరింగ్ లోపాల వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశముందని తెలుస్తోంది. ఉత్పత్తిదారులు బ్యాటరీలకు టెస్టింగ్ నిర్వహించకపోవడం కూడా ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఉత్పత్తిదారులు బ్యాటరీలకు టెస్టింగ్ నిర్వహించకుండానే మార్కెట్‌లోకి పంపుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తుసన్నాయి. ఈవీ బైక్స్ ఉత్పత్తిదారులు కూడా.. డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఈ విషయాన్ని ఎవరూ పట్టింకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ఇదీ చదవండి 128 వెరైటీ వంటకాలు.. కొత్త అల్లుడికి గోదారోళ్లను మించి మర్యాద.. నోరెళ్లబెట్టాల్సిందే
ఈ విషయంలో కాస్త అప్రమత్తత, జాగ్రతలు తీసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంది. ఈవీ బైక్‌లు ఇలా ప్రమాదాల బారిన పడి పేలిపోవడం, కాలిపోవడం పట్ల కేంద్రప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. నిపుణుల కమిటీని కూడా నియమించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, E vehicles, Local News, Nellore Dist