పడినచోటే లేచింది.. ఇస్రో సక్సెస్ అయింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) శ్రీహరికోట నుంచి ప్రయోగించిన చిన్న ఉపగ్రహ వాహకనౌక ఎస్ఎస్ఎల్‌వీ-డీ2 ప్రయోగం విజయవంతమైంది. ఉదయం 9.18గంటలకు ఏపీలోని తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SHAR) నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. ఇవాళ తెల్లవారుజామున 2.48 గంటలకు ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమవగా... ఉదయం 9.18గంటకు ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ2(స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్-డీ2) నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం 15 నిమిషాల్లోపే పూర్తయింది. ఇస్రోకు చెందిన 156.3కిలోల బరువు కలిగిన ఈవోఎస్-07 ఉపగ్రహంతో పాటు అమెరికా అంటారిస్ సంస్థకు చెందిన 11.5 కిలోల జానుస్-1, చెన్నై స్పేస్ కిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులు రూపొందించిన 8.7 కిలోల ఆజాదీశాట్-2ను భూసమీప కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ విజయంతో భారత్ కొత్త రికార్డు నెలకొల్పింది. అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపిన దేశంగా భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది.
#WATCH | Andhra Pradesh: ISRO launches Small Satellite Launch Vehicle-SSLV-D2- from Satish Dhawan Space Centre at Sriharikota to put three satellites EOS-07, Janus-1 & AzaadiSAT-2 satellites into a 450 km circular orbit pic.twitter.com/kab5kequYF
— ANI (@ANI) February 10, 2023
లాస్ట్ టైమ్ ఫెయిల్..ఈసారి సూపర్ హిట్:
గతేడాది ఆగస్టు 7న ప్రయోగత్మకంగా నిర్మించి ప్రయోగించిన మొదటి ఎస్ఎస్ఎల్‌వీ రాకెట్ సాంకేతిక సమస్య వలన సరైన కక్షలోనికి ఉపగ్రహాలను ప్రవేశపెట్టలేకపోయింది ఇస్రో. అయితే, లోపాలను సరిదిద్దిన తర్వాత ఎస్ఎస్‌ఎల్‌వీ-డీ2 రాకెట్‌ను రూపొందించారు శాస్ర్తవేత్తలు.. అడ్వాన్స్ టెక్నాలజీతో ఉన్న ఈ రాకెట్ ద్వారా మనదేశానికి సంబందించిన భూపరిశీలన ఉపగ్రహం ఈవోఎస్-02 తోపాటు మరో రెండు చిన్న ఉపాగ్రహాలను భూమధ్య రేఖకి 450 కిలోమీటర్లు ఎత్తులోని భూ వృతకార కక్షలోనికి ప్రవేశపెట్టారు. చిన్న శాటిలైట్ లాంచ్ మార్కెట్‌కు అనుగుణంగా కొత్తగా అభివృద్ధి చేసిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్‌వీ)ని ప్రపంచానికి పరిచయం చేసింది ఇస్రో.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: ISRO