హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Independence Day Special: ఆ స్వీట్ స్టాల్ కు ఓ చరిత్ర ఉంది.. ఏంటో తెలిస్తే ఔరా అనాల్సిందే

Independence Day Special: ఆ స్వీట్ స్టాల్ కు ఓ చరిత్ర ఉంది.. ఏంటో తెలిస్తే ఔరా అనాల్సిందే

ఈ స్వీట్ స్టాల్ కు ఉన్న చరిత్ర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

ఈ స్వీట్ స్టాల్ కు ఉన్న చరిత్ర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Independence Day Special: ప్రస్తుతం ఎన్నో స్వీట్ స్టాల్స్ ఉంటాయి.. కానీ ఈ స్వీట్ స్టాల్ చాలా ప్రత్యేకమైంది.. దీని వెనుక పెద్ద చరిత్రే ఉంది.. ప్రముఖులు ఈ నగరం వస్తే.. అక్కడ దొరికే మలైకాజా రుచి చూడకుండా వెళ్లరు.. ఏంటి అంత ప్రత్యేకత అనుకుంటున్నారా..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nellore, India

GT Hemanth Kumar, Tirupathi, News18.

Independence Day Special:  ప్రాంతాన్ని బట్టి మనం తినే ఆహారపు అలవాట్లలలో వ్యత్యాసాలు ఉంటాయి. కొందరు కారమైన పదార్థాలు ఇష్టపడితే..  మరి కొందరు తీపి పదార్థాలు ఎంతో ఇష్టంగా తింటుంటారు. హైదరాబాద్  ధమ్ బిరియాని (Hyderabad Dum Biriyani), కాకినాడ ఖాజా (Kakinada Kaja), ఆత్రేయ పురం పూతరేకులు (Atreyapuram Putarekulu), పుల్లారెడ్డి స్వీట్స్ (Pullareddy Sweets) ఇలా ఎన్నో ఆహార పదార్థాలు నోరూరించి లాలాజలం ఊరేలా చేస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో స్ట్రీట్ ఫుడ్ నుంచి.. ఫైవ్ స్టార్ హోటల్స్ (Five Star Hotels) వారలు ఎన్నో రకాల వంటకాలు ఉన్నాయి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (Nellore District) లో మనకు ముందుగా గుర్తుకు వెచ్చేది.. చేపల పులుసు, అక్కడ దొరికే రకరకాల సీ ఫుడ్స్ (Sea Foods) సువాసన చూస్తే చాలు నేరుగా ఆ స్టాల్స్ దగ్గరకు వెళ్లి సముద్రంలో దొరికే అన్ని రకాల వంటకాలు ఆరగించేస్తాం.

అయితే స్వాతంత్ర కాలం నాటి నుంచి నేటి వరకు ఆ స్వీట్స్ ఎంతో ఫేమస్. అక్కడ స్వాతంత్ర పోరాటానికి స్ఫూర్తిగా నిలుస్తున్న జై హింద్ స్వీట్ లో దొరికే మలైకాజా నోరు ఊరిస్తుంది. రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు మెచ్చిన జై హింద్ స్వీట్ స్లాట్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ మలై కాజా నుంచి వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి మరీ తింటారు..

నెల్లూరు నగరంలోని సముద్ర తీరా ప్రాంతం ఆహ్లాదకరమైన వాతావరణం కలిగిన పట్టణం. ఇక్కడ సముద్రపు వంటకాలు (Sea Foods) ఎంత ఫేమస్సో.. అంతకంటే జై హింద్ మలైకాజా అంతే ఫేమస్. నెల్లూరు (Nellore)కు వెళితే అక్కడ ప్రజలు మనకు నోరు తీపి చేసేది ఆ మలైకాజాతోనే. అసలు ఆ జై హింద్ నేతి మిఠాయిలు ఎందుకు అంతా ప్రాచుర్యం పొందాయో తెలుసా..?

ఇదీ చదవండి : ఉప్పుతో గ్లోబుపై భారత మాత చిత్రం.. ఉప్పొంగిన దేశ భక్తి

ఆ చిరిత్ర ఏంటో తెలుస్తే శబాష్ అంటారు. స్వాంతత్ర్య ఉద్యమం ఉవ్వెతున్న ఎగసిపడుతున్న కాలం అది. 1945లో ఉత్తరప్రదేశ్ (Uttarapradesh)లోని బుందేల్ఖండ్ ప్రాంతానికి చెందిన కుమాల్ సింగ్ కుటుంబం ఉపాధి కోసం నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు. స్వతంత్ర కాంక్ష తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో..  కుమార్ సింగ్ మిఠాయి వ్యాపారం ప్రారంభించాడు. దేశ భక్తి అణువణువునా ఉన్న సమయంలో బ్రిటిష్ వారి ఎదురు నిలబడి... జైహింద్ అనే పేరు పెట్టుకున్నారు.

ఇదీ చదవండి : చివరి క్షణం వరకు వీడని స్నేహబంధం.. ఆగివున్న లారీని ఢీ కొట్టిన కారు.. నలుగురు స్నేహితుల మృతి

దమ్ రోటిహల్వా, బొంబాయి హాల్వా, బాదుషా లాంటి మిఠాయిలు విక్రయించే వారు. కానీ వాటన్నికంటే బాగా ప్రాచుర్యం పొందిందే మలై కాజా. ఈ మలైకాజా రుచికి సామాన్యులనే కాదు.. ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులకు ఇష్టమైన మిఠాయిగా ప్రసిద్ధిగాంచింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu), ఎన్టీఆర్ (NTR), ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ( SP balasubramaniam), బ్రహ్మానందం (Brahmanandam) వంటి ప్రముఖులు ఫిదా అయ్యారు. నెల్లూరు వస్తే.. తప్పక ఈ కాజాను రుచి చూడాల్సిందే అంటుంటారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Independence Day, Nellore Dist