నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే (Nellore Rural MLA) కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotam reddy sridhar reddy)కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. నిన్న భద్రతను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో.. ఈ అంశంపై తాజాగా ఆయన స్పందించారు. తనకు ఇప్పటి వరకు 2 ప్లస్ 2 సెక్యురిటీ (Security) ఉండగా ప్రభుత్వం.. ఇద్దరు గన్‌మేన్లను తొలగించి.. 1ప్లస్ 1కి మార్చిందని తెలిపిన ఆయన.. ఆ మిగిలిన ఇద్దరు గన్‌మేన్లు కూడా తనకు అక్కర్లేదనీ.. తానే తిరస్కరిస్తున్నానని తెలిపారు. తనకు భద్రతా సమస్యలు ఉన్నప్పుడు మరింత భద్రతను పెంచాల్సిన ప్రభుత్వం.. అందుకు విరుద్ధంగా ఉన్న భద్రతను కూడా తగ్గించడమేంటని ఆయన ప్రశ్నించారు. ఇద్దరు గన్‌మేన్లను తొలగించి ప్రభుత్వం తనకు ఓ గిఫ్ట్ ఇచ్చిందన్న ఆయన... తాను మిగిలిన ఇద్దర్ని కూడా తొలగించి.. రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానని అన్నారు. తన మద్దతుదారులు, ప్రజలే తనకు రక్షణగా ఉంటారని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన వాణిని కొనసాగిస్తానన్న ఆయన.. తగ్గేదేలేదని మూడుసార్లు అన్నారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి కొన్ని రోజులుగా తన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) చేశాంటూ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. అంతేకాదు పార్టీలోని నాయకులు తనను అవమానించారని, అనుమానించాని చెబుతూ... ప్రెస్‌మీట్ పెట్టి మరీ వైసీపీపై తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈ కారణంగా నెల్లూరు పాలిటిక్స్ హీటెక్కాయి. కోటంరెడ్డి వ్యాఖ్యల్ని తరచూ ఖండిస్తున్నారు వైసీపీ నేతలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.