హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nellore: వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న పురమందిరం..! దీని హిస్టరీ తెలిస్తే షాకవ్వాల్సిందే..!

Nellore: వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న పురమందిరం..! దీని హిస్టరీ తెలిస్తే షాకవ్వాల్సిందే..!

నెల్లూరు

నెల్లూరు టౌన్ హాల్ కు ఘనమైన చరిత్ర

Nellore town hall: నెల్లూరుకి త‌ల‌మానికం... సింహ‌పురికి మ‌ణిహారం...రావు బ‌హ‌దూర్ రేబాల ల‌క్ష్మీనర‌సారెడ్డి పుర‌మందిరం. శతాబ్ధం దాటినా నేటికీ చెక్కు చెద‌ర‌కుండా విరాజిల్లుతోందీ పుర‌మందిరం. ఎంతో ఘ‌న‌చ‌రిత్ర దీని సొంతం.

 • News18 Telugu
 • Last Updated :
 • Nellore, India

  Polaa Sudha, News18, Nellore

  నెల్లూరు (Nellore) కి త‌ల‌మానికం... సింహ‌పురికి మ‌ణిహారం.. రావు బ‌హ‌దూర్ రేబాల ల‌క్ష్మీనర‌సారెడ్డి పుర‌మందిరం. శతాబ్ధం దాటినా నేటికీ చెక్కు చెద‌ర‌కుండా విరాజిల్లుతోందీ పుర‌మందిరం. ఎంతో ఘ‌న‌చ‌రిత్ర దీని సొంతం. స్వాతంత్య్ర స‌మ‌రంలో పాల్గొనేందుకు జిల్లావాసుల‌కు పిలుపునిచ్చింది. సాంస్కృతిక ప్రద‌ర్శన‌ల‌కు నిల‌యంగా నిలిచింది. క‌ళామ‌త‌ల్లి సేవ‌లో త‌రించింది. ఎంతోమంది ప్రముఖ‌ల‌ను తెలుగుజాతికి, దేశానికి అందించే వేదిక‌గా నిలిచిందీ పుర‌మందిరం. నేటి త‌రానికి టౌన్‌హాలుగా సుప‌రిచిత‌మైన రావు బ‌హ‌దూర్ రేబాల ల‌క్ష్మీన‌ర‌సారెడ్డి పుర‌మందిరం విశేషాలు ఎన్నో.. ఎన్నెన్నో. నెల్లూరు రేబాల ల‌క్ష్మీన‌ర‌సారెడ్డి పుర‌మందిరం 1915లో ప్రారంభ‌మైంది. 1911లో దీనికి శంకుస్థాప‌న జ‌రగ్గా…. నాలుగేళ్ళ పాటు నిర్మాణం అనంత‌రం 9-4-1915లో ప్రారంభ‌మైంది. అప్పటి మ‌ద్రాస్ గ‌వ‌ర్నర్ శివ‌స్వామి అయ్యర్ చేతుల పుర‌మందిరం ప్రాణం పోసుకుంది.

  ఆనాటి నుంచి నేటి వ‌ర‌కు ఈ పుర‌మందిరంలో జ‌ర‌గ‌ని కార్యక్రమం లేదు. దీన్ని సంద‌ర్శించ‌ని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు. స్వాతంత్య్ర సంగ్రామం, స‌త్యాగ్రహం జ‌రుగుతున్న ఆనాటి కాలంలో మ‌హాత్ముడు దేశ‌ప‌ర్యట‌న‌లో భాగంగా నెల్లూరు సంద‌ర్శించారు. ఈ పుర‌మందిరం నుంచే నెల్లూరు జిల్లావాసుల‌కు సందేశ‌మిచ్చారు. అంత‌టి ప్రాభ‌వం ఈ పుర‌మందిరం సొంతం.

  ఇది చదవండి: దసరా వస్తే చాలు అందరి చూపు అటువైపే.. తలలు పగిలి రక్తం కారాల్సిందే..!

  ప్రముఖుల ప్రసంగాలకు నిలువెత్తు సాక్ష్యం..!

  నెల్లూరు జిల్లా రాజ‌కీయ ఉద్దండులైన‌ పుచ్చల‌ప‌ల్లి సుంద‌ర‌య్య, పొట్టి శ్రీరాములు, రేబాల ల‌క్ష్మీన‌ర‌సారెడ్డి, బెజవాడ గోపాల‌రెడ్డి, పొణ‌కా క‌న‌క‌మ్మ, ఏనుగ వెంక‌ట‌న‌ర‌సారెడ్డి, గూడూరు శేషారెడ్డి, దువ్వూరి బ‌ల‌రామిరెడ్డి, తూములూరు అనంత పద్మనాభయ్య, నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి త‌దిత‌రులు నెల్లూరు పుర‌మందిరం నుంచి త‌మ వాణి వినిపించిన వారే. తెలుగు చిత్రసీమ‌ను ఏలిన పి.పుల్లయ్య, ఆచార్య ఆత్రేయ‌, రాజ‌నాల, ర‌మ‌ణారెడ్డి, వై.వి. రావు, ఎస్పీ బాలు, ఎస్పీ శైల‌జ‌, వాణిశ్రీ, అశ్వని, నెల్లూరు కాంతారావు వంటి ప్రముఖ క‌ళాకారులు ఈ వేదిక‌పై అల‌రించిన వారే.

  ఇది చదవండి: ఇంద్రకీలాద్రికి వెళ్లే భక్తులకు అక్కడ మరో ముఖ్యమైన మునేశ్వరుడు ఉన్నాడని తెలుసా..!

  పాటూరు రామయ్య, పెళ్ళి రమణయ్య, ఎం.వెంకయ్య నాయుడు, నేదురుమల్లి జనార్ధనరెడ్డి, నేదురుమల్లి రాజ్యలక్ష్మి, ఆనం వివేకానంద రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి వంటి రాజ‌కీయ నాయ‌కుల ప్రసంగాల‌కు నిల‌యం కూడా రేబాల ల‌క్ష్మీన‌ర‌సారెడ్డి పుర‌మందిర‌మే.

  ఇది చదవండి: కోర్కెలు తీర్చే కొంగు బంగారం కనకదుర్గ.. ఇంద్రకీలాద్రికి అంతటి విశిష్టత ఎందుకు..?

  నెల్లూరు పుర‌మందిరాన్ని ప్రస్తుతం టౌన్ హాలుగా పిలుస్తున్నారు. ముఖ్యంగా ప్రసంగాల‌కు, సాంస్కృతిక ప్రద‌ర్శన‌ల‌కు నిల‌యం. పౌరాణిక‌, సాంఘిక నాట‌కాలు, నాట్య ప్రద‌ర్శన‌లు, సంగీత విభావ‌రిలు, అభినంద‌న స‌భ‌ల‌కు, స‌న్మాన కార్యక్రమాల‌కు వేదిక‌గా నిలిచింది.

  ఇది చదవండి: అక్కడికి ఒక్కసారి వెళ్తే మీ ఇల్లు నందన వనమే..! అందుకే మహిళలు క్యూ కడతారు..!

  2015 నాటికి నెల్లూరు టౌన్ హాల్ వంద సంవ‌త్సరాలు పూర్తి చేసుకుంది. ఆ శుభ‌సంద‌ర్భాన గాన‌గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్రమ‌ణ్యంతో ప్రద‌ర్శన‌లు కూడా ఇవ్వడం విశేషం. అంత వైభవంగా వెలిగిన టౌన్‌హాల్‌ గ‌తంలో ఎన్నడూ లేని విధంగా టౌన్ హాల్ కొంత‌కాలం మూసివేయ‌బ‌డింది. 2020లో కోవిడ్-19 మ‌హ‌మ్మారి కార‌ణంగా ఈ పుర‌మందిరం కొంత‌కాలం మూత‌ప‌డింది. సుమారు ప‌ది నెల‌ల అనంత‌రం పునః ప్రారంభ‌మైంది.

  ఇది చదవండి: ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ లో అదరగొడుతున్న స్వీపర్.. పిల్లలు మాట్లాడుతుంటే విని నేర్చుకుంది

  క‌ళ‌ల‌కు, సాహిత్యానికి, నాట్యానికి, సంగీతానికి చిరునామాగా నెల్లూరు టౌన్ హాలు ఇప్పటికీ నిలిచే ఉంది. క‌ళ‌ల‌కు సంబంధించిన ఏ కార్యక్రమ‌మైనా ముందుగా అంద‌రికీ గుర్తొచ్చే పేరు కూడా పుర‌మందిర‌మే. చ‌రిత్రకు ఆన‌వాలుగా నిలిచిన ఈ టౌన్ హాలు గురించి నేటి త‌రానికి పెద్దగా తెలియ‌క‌పోవ‌చ్చు. కానీ తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

  తొలినాళ్ళలో ఎంత ప్రాభ‌వం ఉందో, ఎంత ప్రాచుర్యం పొందిందో, ఎంత వైభ‌వంగా వెలుగొందిందో..! 107 సంవ‌త్సరాలు గ‌డిచిన త‌ర్వాత కూడా.. అదే శోభ‌తో నేటికీ నిత్యనూత‌నంగా క‌ళ‌క‌ళ‌లాడుతోంది నెల్లూరు రేబాల ల‌క్ష్మీన‌ర‌సారెడ్డి పుర‌మందిరం.

  Nellore Town Hall map

  అడ్రస్‌: టౌన్‌హాల్‌, పొగతోట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్‌- 524001, ఎలా వెళ్లాలి: నెల్లూరు బస్టాండ్‌ నుంచి ఆటోలు అందుబాటులో ఉంటాయి.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Nellore

  ఉత్తమ కథలు