Home /News /andhra-pradesh /

NELLORE HERE ARE THE SPECIALTIES AND HISTORY BEHIND ROTTELA PANDUGA AT BARA SHAHEED DARGA IN NELLORE OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN TPT

Nellore: రొట్టెలు తింటే కోరికలు తీరుతాయా..? నెల్లూరు రొట్టెల పండుగ మహత్యం ఇదే.. చరిత్ర ఏం చెబుతోందంటే..!

నెల్లూరు బారాషహీద్ దర్గా

నెల్లూరు బారాషహీద్ దర్గా

రొట్టెలు తింటే కోరిన కోర్కెలు తీరుతాయా అంటే అవున‌నే అంటున్నారు అక్క‌డి భ‌క్తులు. కోరిక‌లు కోరుకుంటూ రొట్టెలు ప‌ట్టుకునే వారు కొంద‌రైతే... తీరిన కోరిక రొట్టె వ‌దిలే వారు మ‌రి కొంద‌రు... ఇదేదో ఒక ప్రాంతానికి ప‌రిమిత‌మైన రొట్టె కాదు... దేశ‌, విదేశాల నుంచి ల‌క్ష‌లాది మంది భ‌క్తులు రొట్టెలు ప‌ట్టుకునేందుకు అక్క‌డికి వ‌స్తారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nellore, India
  GT Hemanth Kumar, News18, Tirupati

  రొట్టెలు తింటే కోరిన కోర్కెలు తీరుతాయా అంటే అవున‌నే అంటున్నారు అక్క‌డి భ‌క్తులు. కోరిక‌లు కోరుకుంటూ రొట్టెలు ప‌ట్టుకునే వారు కొంద‌రైతే... తీరిన కోరిక రొట్టె వ‌దిలే వారు మ‌రి కొంద‌రు... ఇదేదో ఒక ప్రాంతానికి ప‌రిమిత‌మైన రొట్టె కాదు... దేశ‌, విదేశాల నుంచి ల‌క్ష‌లాది మంది భ‌క్తులు రొట్టెలు ప‌ట్టుకునేందుకు అక్క‌డికి వ‌స్తారు. భ‌క్తివిశ్వాల‌తో అమ‌ర‌వీరుల స‌మాధులను దర్శించుకొని రొట్టెలు మార్చుకుంటారు. మతసారస్యానికి, భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న రొట్టెల పండుగ నెల్లూరు (Nellore) లో జ‌రుగుతోంది. నేటి నుంచి 13వ తేదీ వ‌ర‌కు ఐదురోజుల పాటు జ‌రిగే ఈ పండుగ విశేషాలు ఓ సారి చూద్దాం. మ‌త‌సామ‌ర‌స్యానికి ప్ర‌తీక ఆ పండుగ‌.. ఒక్క ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) రాష్ట్రాల నుంచే కాకుండా దేశ‌, విదేశాల నుంచి ఆ మ‌తం, ఈ మ‌తం అని లేకుండా అంద‌రూ క‌లిసి వ‌చ్చి కోరిన కోర్కెల రొట్టెలు మార్చుకోవ‌డం శ‌తాబ్ధాల కాలం నుంచి ఆన‌వాయితీగా వ‌స్తోంది...

  నెల్లూరు న‌గ‌రంలో జ‌రిగే ఈ రొట్టెల పండుగ‌కు ఎంతో విశిష్టత ఉంది. ఇది ముస్లిముల పండుగే అయినా.. సర్వ మతాల వారు సమిష్టిగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇక్కడ రొట్టె మార్చుకున్నా... పట్టుకున్నా కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం.. అంతే కాకుండా ఈ పండుగ వెనుక ఓ చారిత్రాత్మక కథనం కూడా దాగి ఉంది.

  ఇది చదవండి: 800 ఏళ్లనాటి ఆలయం.. రాయల వైభవానికి ప్రతీక.. నేడు ఇలా..! గుప్తనిధులే కారణమా..?


  దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం మహ్మద్ ప్రవక్త అనుచరులు 12 మంది భక్తి భావాలను ప్రజలకు బోధిస్తూ... నెల్లూరు ప్రాంతానికి వచ్చారు. అప్పట్లో జరిగిన పవిత్ర యుద్ధంలో భాగంగా ఆ పన్నెండు మంది వీర మరణం పొందారు. జిల్లాలోని కొడవలూరు మండలం గండవరంలో వీరి తలలు తెగిపడగా.., అక్కడి నుంచి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరు చెరువు ఒడ్డుకు గుర్రాలు ఈ 12 మంది మొండాలను తీసుకువ‌చ్చి వేశాయ‌ని చ‌రిత్ర చెబుతోంది. ఆ మొండేలను నెల్లూరు స్వర్ణాల చెరువు వద్ద సమాధి చేశారు. దీంతో పవిత్ర యుద్ధంలో వీరమరణం పొందిన వీరికి బారాషహీద్ లుగా పేరు వచ్చింది. ఇదీ దర్గా స్థల చెప్పే చారిత్రక కథాంశం.

  ఇది చదవండి: ఇంద్రకీలాద్రి, సింహాచలం, శ్రీశైలం సహా ఈ ఆలయాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై వాటితోనే ప్రసాదాలు..


  ఆర్కాట్ న‌వాబుల ప‌రిపాల‌న స‌మ‌యంలో స్వ‌ర్ణాల చెరువులో ర‌జ‌కులు దుస్తులు ఉతికేవారు. ఓ రోజు ర‌జ‌క దంప‌తులు చెరువులో దుస్తుల‌ను ఉతికే స‌రికి రాత్రి అయింది. దీంతో ఆ దంప‌తులు ఇద్‌ురూ అక్క‌డే నిద్ర చేశారు. ర‌జ‌కుని భార్య‌కు అక్క‌డ స‌మాదులైన బారాష‌హీదులు క‌ల‌లో వ‌చ్చి ఆర్కాట్‌ న‌వాబు భార్య అనారోగ్యంతో బాధ‌ప‌డుతుంద‌ని, స‌మాధుల ప‌క్క‌న ఉన్న మ‌ట్టిని తీసుకెళ్లి ఆమె నుదుటిపై రాస్తే కోలుకుంటుంద‌ని చెప్పారు. ఈ విష‌యాన్ని ఆమె త‌న భర్త‌కి చెప్ప‌గా అత‌ను కొట్టిపారేశాడు. ఆ తెల్లారి దంప‌తులు ఇద్ద‌రూ గ్రామంలోకి వెళ్తుండ‌గా... ఆర్కాట్ న‌వాబు భార్య అనారోగ్యంతో ఉంద‌ని, ఆమెకు స‌రైన వైద్యం చేస్తే కోరిన కోర్కెలు తీరుస్తామ‌ని ఆర్కాట్ న‌వాబు దండోరా వేయించ‌డాన్ని ర‌జ‌కుడు గ‌మ‌నించాడు. త‌న భార్య క‌ల విష‌యాన్ని న‌వాబు ఆస్తానంలోని కొందరికి తెలిపారు. దాంతో రాజు త‌న అనుచ‌రుల‌ను చెరువు వ‌ద్ద‌కి పంపి మ‌ట్టి తెప్పించి త‌న భార్య నుదిటిపై పూయ‌గా... ఆమె ఆరోగ్యం కుదుట ప‌డింది. రాజు సంతోషం ప‌ట్ట‌లేక త‌న భార్య‌తో క‌లిసి స్వ‌ర్ణాల చెరువు స‌మీపంలోని స‌మాధుల వ‌ద్ద‌కి వ‌చ్చి బారాష‌హీద్ ల‌కు ప్రార్ధ‌న‌లు జ‌రిపారు. అనంతరం త‌మ‌తో తెచ్చుకున్న రొట్టెల‌లో కొన్ని తిని మిగిలిన వాటిని అక్క‌డి వారికి పంచారు. అలా రొట్టెల మార్పిడి జ‌రుగుతూ వ‌చ్చి అది క్ర‌మంగా రొట్టెల పండుగ‌గా మారింది.

  ఇది చదవండి: ఈ కోటలోని అడుగు పెడితే రాయలవారి కాలానికి వెళ్లినట్లే.. అక్కడున్న అద్భుతాలు, రహస్యాలెన్నో..!


  మొహ‌ర్రం త‌ర్వాత మూడోరోజు ఒక్క‌రోజే ఇక్క‌డ రొట్టెల పండుగ జ‌రిగేది. రాను రాను దీనికి ప్రాచుర్యం రావ‌డంతో మొహ‌ర్రం రోజు నుంచి మూడు రోజులు పండుగ జ‌రిపేవారు. అదికాస్త ఐదురోజుల‌కు మారింది. వివిద ర‌కాల రొట్టెలు ఇక్క‌డ మార్చుకుంటారు. విద్య‌, వివాహం, సంతానం, ఆరోగ్యం, ధ‌న‌, గృహం వంటి రొట్టెలు వ‌ద‌ల‌డం, ప‌ట్టుకోవ‌డం జరుగుతుంది. ముందుగా ఈ ఏడాది ఓ కోరిక కోరుకుని రొట్టె ప‌ట్టుకునే వారు ఆ కోరిక తీరాక ఆ రొట్టెను తిరిగి వ‌ద‌లాలి. అలా ఈ ఏడాది తీసుకున్న రొట్టెను మ‌రో ఏడాది కోరిక తీరాక వ‌దులుతారు. ముందుగా బారాష‌హీదుల‌ను ద‌ర్శించుకున్న త‌ర్వాత స్వ‌ర్ణాల చెరువులోకి వెళ్లి మోకాలి లోతు నీళ్ల‌ల్లో త‌ల‌పై నీళ్లు చ‌ల్లుకుని రొట్టెలు మార్చుకోవ‌డం ఆనవాయితీగా వ‌స్తుంది. ఈ పండుగ కోసం దేశ‌, విదేశాల నుంచి ల‌క్ష‌లాది మంది భ‌క్తులు వ‌స్తారు. ముఖ్యంగా క‌ర్నాట‌క‌, కేర‌ళ‌, త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర నుంచి అత్య‌దికంగా భ‌క్తులు వ‌స్తారు. రొట్టెల పండుగ కోసం ఎదురు చూసి ముందుగా విదేశాలనుంచి ఇక్క‌డ‌కి రావ‌డం ఆనవాయితీ. ఆ పండుగను 2014లో రాష్ట్ర పండుగ‌గా అప్ప‌టి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. పండుగ నిర్వ‌హ‌ణ‌కు నిధులు ఇస్తుంది.

  ఇది చదవండి: యాపిల్ తో పోటీపడుతున్న జామకాయ.. ఒక్కసారి పంటవేస్తే అంత లాభమా..?


  క‌రోనా ప్ర‌భావంతో రెండేళ్ల‌గా రొట్టెల పండుగ జ‌రుగ‌లేదు. వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక తొలిసారి జ‌రుగుతున్న ఈ రొట్టెల పండుగ‌ని విశిష్టంగా తీసుకుంది ప్ర‌భుత్వం. 9వ తేదీ నుంచి 13వ తేదీ వ‌ర‌కు రొట్టెల పండుగ జ‌రుగుతుంది. అందులో 9న ష‌హాద‌త్ సొంద‌ల్ మాలీ, 10వ తేదీ అర్థ‌రాత్రి గంధ మ‌హోత్సవం జ‌రుగుతుంది. 11న అధికారికంగా రొట్టెలు మార్చుకుంటారు. 12న త‌హ‌లీల్ ఫాతిహా పేరుతో వేడుక‌లు నిర్వ‌హిస్తారు. 13వ తేదీన ముగింపు కార్య‌క్ర‌మం ఉంటుంది. దీంతో ఈ ఏడాది రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి నేత్ర‌త్వంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఇక్క‌డికి వ‌చ్చే భ‌క్తులు స్వ‌ర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకోవ‌డంతో పాటు ఆహ్లాద‌భ‌రిత వాతావ‌ర‌ణంలో సేద‌తీరుతారు. తినుబండారాలు, ఆట‌వ‌స్తువులు ఏర్పాటు చేశారు. చెరువులో బోట్ షికార్ అందుబాటులోకి తెచ్చారు. ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌చ్చే వారి కోసం పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌ముఖులు వ‌స్తున్నారు. నెల్లూరు కార్పొరేష‌న్, పోలీసు, వ‌క్ఫ్ బోర్డు స‌మ‌న్వ‌యంతో క‌మిటీ స‌భ్యులు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు.


  ఇది చదవండి: ఈ యాప్ చేతిలో ఉంటే చాలు.. ఎవరికీ, దేనికి భయపడక్కర్లేదు.. 


  విద్య‌, ఆరోగ్యం, ఐశ్వ‌ర్యం, గ్రుహం, వివాహం, సంతానం వంటి రొట్టెలతో పాటు ప‌లు నూత‌న రొట్టెల‌ను తీసుకువ‌చ్చారు. విదేశీయాన రొట్టె, రాజ‌కీయ రొట్టె, సీఎం రొట్టె అంటూ కొన్ని రొట్టెలు వ‌చ్చాయి. గ‌తంతో స‌మైఖ్యాంద్ర రొట్టె, అమ‌రావ‌తీ రొట్టె అంటూ మార్చుకున్నారు. ఈ ఏడాది జ‌రిగే రొట్టెల పండుగ కోసం దేశ‌, విదేశాల నుంచి భ‌క్తులు ఇప్ప‌టికే బారాష‌హీద్ ద‌ర్గా ప్రాంగ‌ణంకి రావ‌డంతో ఇక్క‌డ కోలాహ‌లం నెల‌కొంది. ఇసుకేస్తే రాల‌ద‌న్నంత రీతిలో భ‌క్తులు పొటెత్తుతున్నారు. మ‌రి మ‌నం కూడా కోర్కెల రొట్టె కోసం సింహ‌పురిలోని స్వ‌ర్ణాల చెరువుకు వెళ్తాం ప‌దండి.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Nellore

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు