Disha App: ఇటీవల దేశ వ్యాప్తంగా మహిళలపై దాడులు (Rape attempts on Women) పెరిగిపోతున్నాయి. కామాంధులు చిన్న పిల్లల నుంచి.. వయసు పైబడిన వారిని కూడా వదలడం లేదు.. అమ్మాయి అయితే చాలు అగాయిత్యాలకు తెగబడుతున్నారు. బలవంతంగా మానభంగం (Gang Rape) చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అయితే ఒంటరి మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. ఇంట్లోకి చొరబడి అత్యాచారం చేసిన ఘటనలు చాలానే చూస్తున్నాం.. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలనే లక్ష్యంతో.. మహిళల రక్షణ కోసం దేశంలోనే మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (Andhra Pradesh Government) దిశా యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఆ దిశా యాప్ ఫలితాలను ఇస్తోంది. తాజాగా ఓ మహిళను కామాంధుడి చెర నుంచి కాపాడింది దిశ యాప్ (Disha App). ఏపీలోని నెల్లూరు జిల్లా (Nellore District ) కావలి మండలం ఓ రిసార్ట్‌లో ముగ్గురు వ్యక్తులు ఓ మహిళపై అత్యాచారానికి యత్నించారు. ఆ మహిళ వెంటనే దిశ యాప్‌లో సమాచారం అందించటంతో, కావలి పోలీసులు స్పందించారు. సకాలంలో అక్కడకు చేరుకొని మహిళను రక్షించారు.
దిశ యాప్ చేతిలో ఉండడంతో ఆ మహిళ వెంటనే ఓ క్లిక్ తో పోలీసులకు సమాచారం అందించింది. క్షణాల్లోనే స్పందించిన కావలి పోలీసులు.. లోకేషేషన్ ఆధారంగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కమ మహిళను బలవంతంగా అత్యాచారం చేయబోయిన ప్రసాద్, వెంకటేశ్వర్లు, శంకరయ్యను అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు.
ఓ మహిళ అక్కడ ఉండంతో.. వెంకటేశ్వర్లు, శంకరయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఆమెను తమతో పాటు అక్కడ ఉండాలని ఒప్పించే ప్రయత్నం చేశారు. దానికి ఆ అమ్మాయి ఏ మాత్రం ఒప్పుకోలేదు. అంతా కలిసి అమ్మాయిని కొట్టి మిస్ బిహెవ్ చేశారు. ఆ అమ్మాయి వెంటనే దిశ యాప్‌కి సమాచారం ఇచ్చింది. వెంటనే పోలీసులు అమ్మాయిని కాపాడి వారిని అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు.
ఈ ఘటనే కాదు.. ఇటీవల ఏపీలోని మహిళలకు దిశ యాప్ అండగా నిలుస్తోంది. లైంగిక దాడులకు, అకృత్యాలకు గురైన మహిళలకు సత్వరం న్యాయం చెయ్యడానికి ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారి ప్రత్యేకంగా ‘దిశా’చట్టాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగానే ఈ దిశా ప్రత్యేక పోలీస్ స్టేషన్ లు ఏర్పాటు చేశారు. వాటిని విస్తరిస్తున్నారు. మహిళలకు సంబంధించిన ఏ నేరాన్నైనా దిశా ప్రత్యేక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయోచ్చు. ఈ ప్రత్యేక దిశా స్టేషన్లో రోజు మొత్తం 24 గంటలు పాటు కంట్రోల్ రూము ప్రజలకు అందుబాటులో ఉంటుంది.
అంతేకాకూండా ప్రభుత్వం మహిళలకోసం “దిశా ప్రత్యేక యాప్” ని కూడా రూపొందించింది. ఈ యాప్ ద్వారా కూడా మహిళలు అందుబాటులో ఉన్న అన్నిసేవలు వినియోగించుకోవచ్చు. ఈ దిశా యాప్ పై కాలేజీ మహిళా ఉద్యోగులు, విద్యార్దునలుతో పాటు మహిళలందరికీ అవగాహన కల్పిస్తున్నారు. మహిళ ఏదైనా అనుమానం వచ్చినా.. కష్టాల్లో ఉన్నాను అనిపించినా.. జస్ట్ దియా యాప్ ఓపెన్ చేసి ఓ క్లిక్ చేస్తే చాలు.. పోలీసులకు సమాచారం అందుతుంది..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP disha act, AP News, Crime news, Nellore Dist