హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Heavy Rains: నెల్లూరులో కుంభవృష్టి.. భయపెడుతున్న మరో అల్పపీడనం.. 18 నుంచి భారీ వానలు.. ఏ జిల్లాలపై ప్రభావం?

Heavy Rains: నెల్లూరులో కుంభవృష్టి.. భయపెడుతున్న మరో అల్పపీడనం.. 18 నుంచి భారీ వానలు.. ఏ జిల్లాలపై ప్రభావం?

నెల్లూరులో కుండపోత వాన (Twitter)

నెల్లూరులో కుండపోత వాన (Twitter)

Heavy Rains: ఆంధ్రప్రదేశ్ ను భారీ వర్షాలు వదలడం లేదు.. వింటర్ సీజన్ ఎంటరీ ఇచ్చినా..? ఎక్కడో ఒక చోటు కుండపోత కురుస్తూనే ఉంది. ప్రస్తుతం నెల్లూరులో కుంభవృష్టి కురుస్తోంది. ఇప్పుడు మరో అల్పపీడనం భయపెడుతోంది. ఈ నెల 18వ తేదీ నుంచి మోస్తరు నుంచి భారీ వానలు కొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏఏ జిల్లాలపై ప్రభావం ఉంది అంటే..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nellore, India

Heavy Rains: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను భారీ వానలు (Heavy rains) ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆకాశానికి చిల్లు పడినట్లు నెల్లూరు జిల్లా (Nellore District) వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. శనివారానికి ముందు మూడు రోజుల పాటు సాధారణ స్థాయిలో వర్సాలు పడ్డాయి. కానీ శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు ఎడతెరపి లేకుండా కుంభవృష్టిగా పడింది. అసలు గ్యాప్ ఇవ్వకుండా వానలు కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని కావలి, కొండాపురం, గుడ్లూరు, ఉలవపాడు, కందుకూరు మండలాల్లో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే నెల్లూరులో వర్షాలు ముంచెత్తుతుంటే..? మరోవైపు మంగళవారం నాటికి తూర్పు ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే ఈ వర్షాలు ఇప్పట్లో ఆగే అవకాశాలు కనిపించడం లేదని వాతావరణ శాఖ ప్రకటించడం భయపెడుతోంది.

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నెల్లూరు నగరం జలమయమైంది. ఆత్మకూరు బస్టాండ్, రామలింగాపురం, మాగుంట లేఅవుట్‌లోని అండర్‌ బ్రిడ్జిల్లోకి నీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మాగుంట లే అవుట్‌ అండర్‌ బ్రిడ్జిని బ్యారికేడ్లు పెట్టి మూసేశారు. ఉమ్మారెడ్డిగుంటలోని పలు పల్లపు ప్రాంతాల ఇళ్లలోకి నీరు చేరింది. కావలి చుట్టు పక్కల గ్రామాల్లో ఇదే పరిస్థితి.. కుండపోత వానతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మన్సూర్‌నగర్, మనుమసిద్ధినగర్, జనార్దన్‌రెడ్డి కాలనీ, ఆర్టీసీ కాలనీ, టీచర్స్‌ కాలనీ ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. గాంధీబొమ్మ, రాయాజీవీధి, పొగతోట తదితర ప్రాంతాల్లో రోడ్లపై పెద్ద ఎత్తున వర్షపునీరు డ్రైయినేజీతో కలిసి ప్రవహిస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో.. ప్రజలు ఇబ్బందులు పడకుండా సహాయక చర్యలు చేపట్టేందుకు జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. 9492691428, 9154636795, 9494070212 కాల్‌ సెంటర్‌ ఫోన్‌ నంబర్లు అందుబాటులో ఉన్నాయి.

భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అగ్నిమాపక, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ తదితరశాఖల సమన్వయంతో అవసరమైన చర్యలు చేపట్టింది. ఎస్పీ సీహెచ్‌ విజయారావు ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది భద్రతా చర్యలు చేపట్టారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని తీర ప్రాంతాల్లో ప్రచారం చేయడంతో పాటు సముద్రం వద్ద పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. వర్ష ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాలతో పాటు లోతట్టు, శివారు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఇదీ చదవండి : సినిమా, రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నఈ పిల్లాడు ఎవరో గుర్తు పట్టారా? ఇప్పుడు కీలక నేత కూడా?

అత్యధికంగా కావలి మండలంలో 227.5 మి.మీ., అత్యల్పంగా చేజర్ల మండలంలో 24.8 మి.మీ. వర్షం కురిసింది. జలదంకి మండలంలో 191.0, బోగోలు 154.8, లింగసముద్రం 150.2, ఉలవపాడు 149.4, నెల్లూరురూరల్‌ 141.2, గుడ్లూరు 137.8, వెంకటాచలం 137, కందుకూరు 134 విడవలూరు 124. ముత్తుకూరు 122.2, కొండాపురం 120.8, దగదర్తి 117.4, నెల్లూరు అర్బన్‌ 111.6, తోటపల్లి గూడూరు 109.8, కొడవలూరు 109.4, పొదలకూరు 107.2, మనుబోలు 104.2, కలిగిరి 99.2, ఉదయగిరి 99.0, బుచ్చిరెడ్డిపాళెం 98.6 అనుమసముద్రం పేట 95.0 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.

ఇదీ చదవండి : శాస్త్రోక్తంగా శ్రీవారి స్నపన తిరుమంజనం.. నేడు కార్తీక మహా దీపోత్సవం.. ఈ సారి ఎక్కడంటే?

గత నాలుగైదు రోజులుగా రాయలసీమ, దక్షిణ కోస్తాంద్ర ప్రాంతాల్లో కురుస్తున్న వానలు.. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టాయని అనుకునేలోపు మరోసారి రాష్ట్రాన్ని వానలు ముంచెత్తనున్నాయి. రెండు రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే మరో అల్పపీడన ప్రభావం కారణంగా ఏపీలో మళ్లీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గత కొద్దిరోజులుగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల 13న ఆగ్నేయ అరేబియా సముద్రంలో విలీనమైంది. అలాగే ఈ నెల 16వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది. దీని ప్రభావంతో 18 నుంచి రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న రెండు రోజుల్లో దక్షిణ కోస్తాంద్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Heavy Rains, Nellore Dist

ఉత్తమ కథలు