‘నీ రూంలో ఏసీ లేదుగా.. నా రూంకు రా’.. కూతురి వయసున్న స్టూడెంట్‌తో వెకిలి మాటలు.. ఆడియో వైరల్..

నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభాకర్

వైద్య రంగంలో అడుగుపెట్టే ఎంతోమంది ఔత్సాహికులకు ఆదర్శంగా నిలవాల్సిన స్థాయి అతనిది. ఆసుపత్రిలో ఏం చేయాలన్నా అతని అనుమతితోనే సాధ్యం అవుతుంది. ఆసుపత్రి వైద్యులకు దిశానిర్దేశం చేసేది కూడా ఆయనే. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉన్నత పదవి. ఐదు పదుల వయస్సులోనూ అతనికి కామవాంఛ తగ్గలేదు.

 • Share this:
  నెల్లూరు: వైద్య రంగంలో అడుగుపెట్టే ఎంతోమంది ఔత్సాహికులకు ఆదర్శంగా నిలవాల్సిన స్థాయి అతనిది. ఆసుపత్రిలో ఏం చేయాలన్నా అతని అనుమతితోనే సాధ్యం అవుతుంది. ఆసుపత్రి వైద్యులకు దిశానిర్దేశం చేసేది కూడా ఆయనే. ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉన్నత పదవి. ఐదు పదుల వయస్సులోనూ అతనికి కామవాంఛ తగ్గలేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో తనతో పనిచేసే తోటి డాక్టర్లతోను, ట్రైనింగ్ తీసుకుంటున్న ట్రైనీ వైద్య విద్యార్థినులతోనూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో హౌస్ సర్జన్ నుంచి ట్రైనింగ్ పొందుతున్న వైద్య విద్యార్థినులతో సహా అందరితోనూ ఉన్నతాధికారిది అదే తీరు.

  రోజూ తన గదికి రావాలని మహిళా డాక్టర్లను వేధింపులకు గురిచేస్తున్న నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ బాగోతం ఆడియో లీక్ కావడంతో బట్టబయలైంది. వేధింపులు ఎక్కువ కావడంతో వైద్య విద్యార్థినులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తరచూ ఫోన్ చేసి తన రూమ్‌కి రావాలంటూ వేధిస్తున్న సూపరింటెండెంట్ నీచ ప్రవర్తనతో ఆసుపత్రిలో డ్యూటీ చేయాలంటేనే భయపడుతున్నారు.

  నెల్లూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్‌ వెకిలి ప్రవర్తనతో విసిగిపోయిన ఓ వైద్య విద్యార్థిని అతనితో మాట్లాడిన ఆడియో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కామ వాంఛ తీర్చాలంటూ మహిళా హౌజ్ సర్జన్లు, డాక్టర్లతో పాటు మహిళా సిబ్బందిని సూపరింటెండెంట్ ప్రభాకర్ వేధిస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. కారులో ఒంటరిగా రావాలని, తనతో ఒంటరిగా గడపాలంటూ ప్రభాకర్ వారితో మాట్లాడిన వెకిలి మాటల గురించి బాధిత విద్యార్థిని అతనిని నిలదీసింది. ఆ హౌజ్ సర్జన్ ఆయనను ఫోన్లో ఏకి పారేసింది. ఈ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే కొంత కాలంగా ఈ వ్యవహారం నడుస్తున్నా, బయటికి చెప్పుకోడానికి హౌజ్ సర్జన్లు, డాక్టర్లు భయపడుతున్నారు. కరోనా సోకడంతో వైద్య విద్యార్థిని హైదరాబాద్‌లోని నివాసానికి వెళ్లిపోయింది. సూపరింటెండెంట్ నంబర్ బ్లాక్‌లో పెట్టినా వేరొక నంబర్ నుంచి కాల్ చేసి మరీ వేధింపులకు గురిచేశాడు. తనను ఎందుకు వేధిస్తున్నారంటూ అధికారిని సదరు విద్యార్థిని ప్రశ్నించింది.

  ఇది కూడా చదవండి: Visakhapatnam: పాప ఎంత అల్లారుముద్దుగా ఉందో కదా.. అదే నిజమైతే ఇలా చేయడానికి ఈ తల్లికి చేతులెలా వచ్చాయో..

  కూతురి వయసున్న తనతో ఇలా ప్రవర్తించడం పద్ధతి కాదని మండిపడింది. అయితే.. ఆ విద్యార్థిని అంతలా నిలదీసినా కనీసం అతను చేసిన తప్పుకు పశ్చాతాపం చెందకపోవడం సిగ్గుచేటు. ఈ వ్యవహారం తమ తల్లిదండ్రులకు తెలిస్తే, చదువు మాన్పించేస్తారని పలువురు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇదే అంశంపై జిల్లా జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ విచారణకు ఆదేశించారు. సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ ఆడియో వైరల్ కావడంతో అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
  Published by:Sambasiva Reddy
  First published: