హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Ganesh Navarathri: నెమలి పింఛాలతో కనువిందుచేస్తోన్న పార్వతీ తనయుడు..! సెల్ఫీలతో సందడి చేస్తోన్న భక్తులు..!

Ganesh Navarathri: నెమలి పింఛాలతో కనువిందుచేస్తోన్న పార్వతీ తనయుడు..! సెల్ఫీలతో సందడి చేస్తోన్న భక్తులు..!

నెల్లూరులో

నెల్లూరులో ఆకట్టుకుంటున్న నెమలి పింఛం వినాయకుడు

వినాయక చవితి (Vinayaka Chavithi) ప‌ర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరువాడ మండ‌పాల్లో వివిధ రూపాల్లో వినాయకుడు కొలువు తీరాడు. ఏ ఊర్లో చూసినా, ఏ గల్లీ చూసినా గణేష్ మండ‌పాలే కనువిందు చేస్తున్నాయి.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nellore, India

  Polaa Sudha, News18, Nellore

  వినాయక చవితి (Vinayaka Chavithi) ప‌ర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరువాడ మండ‌పాల్లో వివిధ రూపాల్లో వినాయకుడు కొలువు తీరాడు. ఏ ఊర్లో చూసినా, ఏ గల్లీ చూసినా గణేష్ మండ‌పాలే కనువిందు చేస్తున్నాయి. ఎవరికి తోచిన రీతిలో వారు.. పార్వతీ తనయుడిని నెల‌కొల్పారు. విఘ్నేశ్వరుడిని శ‌క్తిమేర కొలుస్తున్నారు. భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. నెల్లూరు ప్రాంతాల్లో వాడవాడలా భిన్నరూపంలో ఉండే గ‌ణ‌ప‌తిని మండ‌పంలో కొలువు దీర్చారు. అలాంటి వాటిలో నెమ‌లి పింఛాల‌తో త‌యారు చేసిన గ‌ణ‌నాధుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. నెల్లూరు (Nellore) స్టోన్ హౌజ్ పేట రేబాల‌వారివీధిలోని PTG రాజ్ ట‌వ‌ర్స్ వినాయక చవితి కమిటీ భిన్నరీతిలో ఉండే గ‌ణ‌నాధుడి విగ్రహాన్ని నెల‌కొల్పడం ప్రత్యేక ఆక‌ర్షణ‌గా నిలిచింది.

  నెమ‌లి ఈక‌ల‌తో త‌యారు చేసిన గ‌ణ‌ప‌య్య ప్రతిమ నేత్రానందాన్ని క‌లిగిస్తోంది. క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో ఉన్న ఈ వినాయకుడి స్వరూపం ముగ్ధమ‌నోహ‌రంగా ఉంది. ఈ గ‌ణ‌ప‌య్యను చూసేందుకు వందలాది మంది భ‌క్తులు ప్రతినిత్యం ఇక్కడికి త‌ర‌లి వ‌స్తున్నారు. మొత్తం ఆరు వేల నెమ‌లి ఈక‌లతో త‌యారుచేసిన గ‌ణ‌ప‌య్య ప్రతిమ‌ను మండ‌పంలో కొలువు దీర్చారు. ఇందుకోసం ఆరు రోజుల పాటు 20 మంది క‌ళాకారులు కృషిచేశారు. నెమ‌లి ఈక‌ల‌తో, ప్రత్యేక అలంకారంలో ద‌ర్శన‌మిస్తోన్న గ‌ణ‌ప‌తితో భ‌క్తులు సెల్ఫీలు దిగుతున్నారు. న‌గ‌రం నుంచే కాకుండా చుట్టు ప‌క్కల ప్రాంతాల వాళ్లు కూడా నెమ‌లి ఈక‌ల‌తో కొలువైన విఘ్ననాథుని గురించి తెలుసుకుని, ఇక్కడికి వ‌స్తుండ‌డం విశేషం.

  ఇది చదవండి: ఆ ఏకదంతుని దర్శించుకోవాలంటే ఏడు గడపలు దాటాల్సిందే..! పరవశించిపోతున్న భక్తులు  ఇక రేబాల‌వారి వీధిలోని PTG రాజ్ ట‌వ‌ర్స్ వినాయక చవితి కమిటీ ప్రతి ఏటా వినూత్నంగా, భిన్నంగా ఉండే గ‌ణ‌ప‌తిని ఏర్పాటు చేస్తూ వ‌స్తోంది. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా నెమ‌లి ఈక‌ల‌తో త‌యారుచేసిన ప్రకృతి గ‌ణ‌నాధుడి విగ్రహాన్ని త‌యారు చేయించింది. నెల్లూరు న‌గ‌రంలో ఏర్పాటుచేసిన అన్ని గ‌ణ‌ప‌తి విగ్రహాల్లో కెల్లా.. నెమ‌లి ఈక‌ల వినాయ‌కుడి విగ్రహం ఎంతో ప్రత్యేక‌త‌గా నిలిచింది.

  ఇది చదవండి: కంపు కొడుతున్న సాగర తీరం.. అధికారులు అలర్ట్‌ అవ్వకపోతే అంతే సంగతులు..!


  17 సంత్సరాల నుంచి PTG రాజ్ ట‌వ‌ర్స్ నందు వినాయ‌క విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు అపార్ట్‌మెంట్‌ వాసులు తెలిపారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్షణ‌కు ప్రాధాన్యత ఇస్తామ‌ని చెబుతున్నారు. ప్రతిరోజు సాయంత్రం మండపంలో కొలువుదీరిన బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ ఒక్క చోట మాత్రమే కాదు నెల్లూరు నగరంలో వినూత్నంగా ఏర్పాటుచేసిన గణనాథులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. రెండేళ్ల కరోనా ఆంక్షల తర్వాత జరుగుతున్న వేడుకలు కావడంతో దేశవ్యాప్తంగా గణనాథుని ఉత్సవాలు అంగ రంగ వైభవంగా జరుగుతున్నాయి.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Nellore, Vinayaka Chavithi 2022

  ఉత్తమ కథలు