హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

వెంకయ్యనాయుడు, పవన్ కల్యాణ్ చదువుకున్నది ఇక్కడే..! ఆ విద్యాలయం ఇప్పుడెలా ఉందంటే..!

వెంకయ్యనాయుడు, పవన్ కల్యాణ్ చదువుకున్నది ఇక్కడే..! ఆ విద్యాలయం ఇప్పుడెలా ఉందంటే..!

నెల్లూరు

నెల్లూరు వీఆర్ కాలేజీ

ఈ విద్యాసంస్థ ఎంతోమంది మేధావుల‌ను త‌యారు చేసి దేశానికి అందించింది. ఇక్కడ చ‌దువుకున్న వారెంద‌రో నెల్లూరు ఖ్యాతిని, వీఆర్ హైస్కూల్, కాలేజీ ఖ్యాతిని ప్రపంచ‌వ్యాప్తంగా ఇనుమ‌డింప చేశారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Nellore, India

  Polaa Sudha, News18, Nellore

  పేద‌ల‌కు విద్యను అందించిన భాండాగారం. ఎంతోమందిని ఉన్నత శిఖ‌రాల‌కు తీసుకెళ్ళేందుకు బీజం వేసిన జ్ఞాన‌ కేంద్రం. అదే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నెల్లూరు (Nellore) న‌గ‌రంలోని వెంక‌ట‌గిరి రాజా హైస్కూల్, క‌ళాశాల‌. అణ‌గారిన‌ వర్గాల పిల్లల చదువు కోసం, వారి జీవితాల్లో వెలుగులు నింప‌డం కోసం వెంకటగిరి రాజాలు, కొందరు దాతల సహకారంతో ఈ 1875లో విద్యాల‌యాల‌ను ఏర్పాటుచేశారు. దాదాపు 17 ఎకరాల్లో వీటిని నిర్మించి విద్య అందరికీ అందేలా చ‌ర్యలు తీసుకున్నారు. ఈ విద్యాసంస్థ ఎంతోమంది మేధావుల‌ను త‌యారు చేసి దేశానికి అందించింది. ఇక్కడ చ‌దువుకున్న వారెంద‌రో నెల్లూరు ఖ్యాతిని, వీఆర్ హైస్కూల్, కాలేజీ ఖ్యాతిని ప్రపంచ‌వ్యాప్తంగా ఇనుమ‌డింప చేశారు.

  ఎంతోమంది ప్రముఖులు చదువుకుంది ఇక్కడే..!

  అక్షర కుసుమాలు వెదజల్లిన విజ్ఞాన కేంద్రంగా వీఆర్ హైస్కూల్, కాలేజీ విరాజిల్లింది. వందేళ్ళకు పైగా ఎంతో ఘ‌న‌చ‌రిత్ర వీటి సొంతం. భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkiaha Naidu), ఆసియాలోనే గ్యాస్ట్రో ఎంట్రాలజీలో ఖ్యాతి గాంచిన డాక్టర్ కంచర్ల రవీందర్ నాథ్, భారత అణు శాస్త్రవేత్త సతీష్ రెడ్డి, జనసేన పార్టీ (Janasena Party) చీఫ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మెగా బ్రద‌ర్ నాగబాబు (Konidela Nagababu), ఆనం కుటుంబ సభ్యులు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇలా ఎందరో వీఆర్ హైస్కూల్, కళాశాలలో చదువుకున్న వారే. పేరు ప్రఖ్యాతులు గ‌డించిన వారే.

  ఇది చదవండి: విశాఖ బీచ్‌ రోడ్‌లో ఫేమస్‌ స్ట్రీట్‌ స్నాక్ ఏంటో తెలుసా..? ఎవ్వరికైనా నోరూరాల్సిందే..!

  ఎంతోమందిని మేధావులుగా తీర్చి దిద్దిన విద్యా సంస్థగా వెంక‌ట‌గిరి రాజా విద్యాల‌యాల‌కు పేరుంది. ఇక్కడ చ‌దువుకునేందుకు జిల్లా నుంచే కాకుండా ఇత‌ర ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది విద్యార్ధులు వ‌స్తుంటారు. ఎంతో ఘ‌న‌కీర్తిని సొంతం చేసుకున్న ఈ స్కూల్, కాలేజీ ప్రాభ‌వం కాస్త మ‌స‌క‌బారింది. ఆ చదువుల ఒడి ఇప్పుడు నిర్మానుష్యంగా మారుతోంది. నేటిత‌రం విద్యార్ధులు ఇక్కడ చ‌దువుకునేందుకు పెద్దగా ఆస‌క్తి చూపించ‌క‌పోవ‌డం, కాలేజీ నిర్వహ‌ణ‌ను స‌మర్ధవంతంగా చేయ‌క‌పోవ‌డ‌మే కార‌ణంగా క‌నిపిస్తోంది. సరైన విద్యా సదుపాయాలు క‌ల్పించ‌డంలో, నాణ్యమైన విద్యను అందించడంలో విఫలమైంద‌నే ఆరోప‌ణ కూడా వినిపిస్తోంది.

  ఇది చదవండి: ఏపీలో మహీష్పతి సామ్రాజ్యం.. అప్పటి ఆలయం ఇంకా ఉంది.. మీరూ చూస్తారా..?

  నెల్లూరు వీఆర్ విద్యాసంస్థ ఎందరికో ఉన్నత శిఖరాలను చేరుకునేందుకు పునాది వేసింది. అలాంటి ఘన చరిత్ర కలిగిన విద్యాసంస్థ ప్రాభ‌వం కోల్పోవ‌డంపై సింహ‌పురి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలేజీలో అక్రమాలు జ‌రిగాయంటూ ఆరోప‌ణ‌లు కూడా వ‌చ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎయిడ్‌తో నడుస్తున్న బోధన, బోధనేతర సిబ్బందిని బయటికి పంపిన నేపథ్యంలో, ఇక్కడ చ‌దువుకుని గొప్పవారైన వ్యక్తులు స్పందించి ఈ విద్యా సంస్థను రక్షించాలని కోరుతున్నారు. దీనికి స‌రైన చ‌ర్యలు తీసుకుంటే.. మ‌ళ్ళీ పూర్వ వైభ‌వాన్ని పొందుతుంద‌నే ఆశ‌తో ఉన్నారు నెల్లూరు వాసులు. ప్రభుత్వం, పాల‌కులు ఈ దిశ‌గా చ‌ర్యలు తీసుకోవాల‌ని కోరుతున్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Nellore, Pawan kalyan

  ఉత్తమ కథలు