నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలో అగ్నిప్రమాదం సంభవించింది. దగ్గరలోని స్టోర్ రూమ్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎన్నికల డాక్యుమెంట్స్, ఫర్నీచర్ దగ్ధమయ్యాయి. ఓవైపు మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తుండగా.. మరోవైపు ఈ అగ్నిప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ రెండో శనివారం సెలవు కావడంతో సిబ్బంది విధుల్లో లేరు. ఇక గతంలోనూ కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న సివిల్ సప్లై ఆఫీస్‌లోనూ అగ్నిప్రమాదం సంభవించింది. అప్పట్లో కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించిన ఫైల్స్ దగ్ధమవడం సంచలనం సృష్టించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.