YCP MLA: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఏపీలో ఎప్పుడు ఎన్నికలు అన్నది క్లారిటీ లేకపోయినా.. అన్ని పార్టీల్లో కనిపిస్తున్న వాతావరణం చూస్తే.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసిందా అనే ఫీలింగ్ కలుగుతోంది. ఎందుకంటే అన్ని పార్టీ అప్పుడే ప్రచారాన్ని మొదలుపెట్టేశాయి. ఇక అభ్యర్థలను కూడా ఫైనల్ చేస్తున్నాయి. ఇటు అధికార వైసీపీ (YCP) అయితే మరింత దూకుడుగా ఉంది. ముఖ్యంగా అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ఇప్పటికే అభ్యర్థులను ఫైనల్ చేశారని తెలుస్తోంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఆధారంగా ఆయన అభ్యర్థులను ఫైనల్ చేశారంటున్నారు. అయితే ఆ లిస్ట్ ను వచ్చే నెల లేదా ఫిబ్రవరిలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో భాగంగా చాలామంది సిట్టింగ్ లకు సీటు ఉండదని సంకేతాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా చాలామంది పార్టీ మారుతారనే ప్రచారం ఉంది. కొందరైతే ప్ర్తత్యర్థి పార్టీ కీలక నేతలతో టచ్ లో ఉన్నట్టు కూడా సమాచారం అందుతోంది.
ముఖ్యంగా నెల్లూరుకు చెందిన సీనియర్ నేత.. ఆనం రామనారాయణ రెడ్డి విషయంలోనూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన ప్లేస్ లో వెంకటగిరి నుంచి మరో అభ్యర్థికి అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఆ విషయంలో ఆయనకు క్లారిటీ ఉందని.. అందుకే ముందుగానే ప్రత్యర్థి పార్టీ నేతలతో టచ్ లోకి వెళ్లారని.. త్వరలోనే పార్టీ అవకాశం ఉందని.. సీటు విషయంలో హామీ తీసుకున్నారనే ఆయన అనుచరులే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న రూమార్లకు ఆనం రామనారాయణ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
తాను ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నానంటూ ఆనం రామనారాయణ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో పోటీ పై జగన్ నిర్ణయం తీసుకుంటారని, ముందుగా ఊహించుకుని ఇక్కడే పోటీ చేస్తా.. అని చెప్పడం సరి కాదన్నారు. ప్రస్తుతం వెంకటగిరి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా నాకు ఆ అర్హత ఉందని, ఇక్కడ నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయం.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ప్రకారం ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ ఐదు సంవత్సరాలూ చివరిరోజు వరకూ వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతానన్నారు. మీడియా కథనాల్లో వస్తున్నట్లు నాకు వేరే ఆలోచన అనేది ఉంటే, ముందే చెబుతానని క్లారిటీ ఇచ్చారు.
తన రాజకీయ భవిష్యత్తుపై అప్పటివరకు ఎవరికీ ఏ అనుమానాలు అక్కరలేదని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. శిలాఫలకాలపై నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పేరు వేయడం లేదనేది చిన్న విషయమని, నేదురుమల్లి పేరు వేయమని అధికారులను కలెక్టర్ ఆదేశిస్తే కచ్చితంగా వేస్తారన్నారు. అయితే పార్టీ మారితే ముందుగానే చెబుతాను అంటూ.. మరోసారి కన్ఫ్యూజ్ క్రియేట్ చేశారు ఆనం రామనారాయణ రెడ్డి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anam Ramanarayana Reddy, Andhra Pradesh, AP News, AP Politics, Ycp