Anil Kumar Yadav: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) ప్రస్తుతం చర్చంతా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల (MLA Quota MLC Elections) చుట్టూనే జరుగుతోంది. ముఖ్యంగా ఆ నలుగురు ఎమ్మెల్యేల వ్యవహారం రచ్చ రచ్చ అవుతోంది. అధికార వైసీపీ వెర్సస్ రెబల్ (YCP vs Rebels)నేతలు అన్నట్టు పొలిటికల్ సీన్ మారింది. మరోవైపు రాజకీయం మొత్తం నెల్లూరు (Nellore) పైనా.. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) సామాజిక వర్గంపైనే ఫోకస్ పడుతోంది. అందుకు కారణం.. బహిష్కరణకు గురైన నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు నెల్లూరు జిల్లాకు చెందిన వారే.. అంతేకాదు ముగ్గురు సీఎం సామాజికి వర్గానికి చెందిన రెడ్డి నేతలే.. దీంతో ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే చాలాకాలం నుంచి తెలుగు దేశం పార్టీ సహా.. విపక్షాలన్నీ ఇదే ఆరోపణ చేస్తూ వస్తున్నాయి. రాయలసీమకు చెందిన కీలక రెడ్లు అంతా జగన్ కు వ్యతిరేకం అయ్యారని.. అందుకే వచ్చే ఎన్నికల్లో సీమలో జగన్ కు కష్టమే అంటూ సోషల్ మీడియాలోనూ విపరీతంగా చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా నెల్లూరు జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు రెబల్స్ గా మారారు.. ఇప్పుడు మరో ఎమ్మెల్యే వ్యవహారంపైనా చర్చ జరుగుతోంది. దీంతో ప్రస్తుతం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు వర్సెస్ వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలుగా మారింది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా మాజీ మంత్రి.. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రెబల్ ఎమ్మెల్యేలపై అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి ఓటమి తప్పదని ఎమ్మెల్యే అనిల్ జోస్యం చెప్పారు. ఇది రాసిపెట్టుకోండి అన్నారు. ఒకవేళ అలాకాకుండా..? వచ్చే ఎన్నికల్లో ఆ ముగ్గురు గెలిచి అసెంబ్లీకి వస్తే తాను రాజకీయాలు వదిలేస్తానని అన్నారు.
ఇదీ చదవండి : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు? సీఎం జగన్ ముందు ఆప్షన్లు ఇవే..?
అయితే ఒకవేళ తాను గెలిచి అసెంబ్లీకి వస్తే.. మీరు రాజకీయాల నుంచి వెళ్లిపోతారా? అని రెబల్ ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు. 2024 ఎన్నికల్లో ఎవరు అసెంబ్లీకి వస్తారో తేల్చుకుందాం. ఈసారి అనిల్ ను శాసనసభకు రానీయమంటూ కొందరు మంగమ్మ శపథాలు చేస్తున్నారు. ఇటీవల పసుపు కండువా కప్పుకున్న కొందరు జిల్లాలో పదికి పది స్థానాలు సాధిస్తామని చెబుతున్నారు. తనను ఒక్కడిని ఓడించండి చాలు అంటూ ఛాలెంజ్ చేశారు.
ఇదీ చదవండి : అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే రాపాక.. ఫోన్ స్విచ్ ఆఫ్.. ఈసీ వేటు వేస్తుందా..?
పది స్థానాల సంగతి అలా ఉంచితే.. వెళ్లిన ముగ్గురు ముందు గెలవండి.. వచ్చే ఎన్నికల్లో జగన్ బొమ్మతోనే తాను ఎన్నికల్లో పోటీ చేస్తా.. గెలుస్తా. దమ్ముంటే ఆపి చూడండి అన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు వెళ్లడం వల్ల జిల్లాలో వైసీపీకి ఊడిందేమీ లేదన్నారు. కార్యకర్తలు, ప్రజలు జగన్ వెంటే ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ జగన్ కు ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Anil kumar yadav, AP News, AP Politics, Ycp