హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Anil Kumar Yadav: నెల్లూరు నుంచే పోటీ చేస్తా..? బతికినా, చచ్చినా సింహం లాగా.. మాజీ మంత్రి అనిల్ సంచలన వ్యాఖ్యలు..

Anil Kumar Yadav: నెల్లూరు నుంచే పోటీ చేస్తా..? బతికినా, చచ్చినా సింహం లాగా.. మాజీ మంత్రి అనిల్ సంచలన వ్యాఖ్యలు..

మాజీ అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

మాజీ అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

Anil Kumar Yadav: మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పార్టీ మారుతారా..? నెల్లూరు నుంచి కాకా వేరే నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారా..? నెల్లూరు రాజకీయాల్లో అనిల్ సింగిల్ అయ్యారా..? ఈ సారి అనిల్ కు టికెట్ రాదా..? ఇలా గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న చర్చ ఇది. తాజాగా వాటిపై స్పందించిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nellore, India

Anil Kumar Yadav: వైసీపీ ఫైర్ బ్రాండ్ ల్లో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) ఒకరు. జగన్ ను ఒక్క మాట అన్నా సహించరు ప్రత్యర్థులపై ఓ రేంజ్ లో విరుచుకుపడతారు..? కానీ మంత్రి   తరువాత ఆయనలో దూకుడు తగ్గింది.. పార్టీలో ఇతర నేతలంతా అనిల్ కు వ్యతిరేకంగా జతకడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అనిల్ పై పలు రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆయన త్వరలోనే పార్టీ మారుతారాని.. లేదా నెల్లూరు సిటీని వీడి ఇతర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని.. అసలు అనిల్ కు ఈ సారి జగన్ టికెట్ ఇవ్వడం లేదని..  నెల్లూరు (Nellore) లో ఒకప్పటి ఆయన అనుచరులు, ద్వితీయ శ్రేణి నాయకులు అంతా ఏకమై.. మాజీ మంత్రిని ఒంటరి చేశారని.. ఇలా వివిధ రకాల ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తనపై వస్తున్న రూమర్లపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చారు.

తనకు టిక్కెట్ రాదనుకునే వాళ్లు శునకానందం పొందండి. 2024లో తాను పోటీ చేసిన తర్వాత మీ అందరూ నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోంది అన్నారు. అంతేకాదు నెల్లూరు నగరం నుంచి పోటీ చేస్తా ఎవరాపుతారంటూ ప్రశ్నించారు. కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన అనిల్ కుమార్ యాదవ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికి భయపడి ఎక్కడకు వెళ్లను అన్నారు. తాను సీఎం జగన్‌ ముందు తప్ప ఏ ఒక్కరి ముందు తలవంచను అని స్పష్టం చేశారు.

తాను బతికినా, చచ్చినా సింహం లాగానే ఉంటాను అన్నారు, తల వంచకుండా బ్రతికితేనే మనకు క్యారెక్టర్ ఉంటుందని కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు. ఎంత మంది తనకు వ్యతిరేకంగా పనిచేసినా తాను దిగజారి బతకను అన్న అనిల్‌.. తనను ఇబ్బంది పెడుతున్నారని వెళ్లి ఎవరి కాళ్లు మొక్కను అని అని వర్గ పోరు ఉన్న మాట వాస్తవం అని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. తనకు తప్పు చేయాల్సిన అవసరం లేదని.. ఎవరిని లాగి కింద పడేయాల్సిన పని లేదని అనిల్ అన్నారు. తనపై సొంత పార్టీ నేతలే ఫోన్లు చేసి.. విమర్శలు చేస్తూ చిల్లర దండుకుంటున్నారని గత ఆగస్ట్‌లో ఆరోపించారు అనిల్.

ఇదీ చదవండి : బీజేపీలో ముదిరిన ముసలం.. 120 మంది రాజీనామా..? పొత్తుపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు

పార్టీలోనే కొంతమంది, ప్యాకేజీ మాట్లాడుకొని విమర్శలు చేస్తున్నారన్నారు. ఉదయం మీడియా ఎదుట ఆరోపణలు చేయడం.. సాయంత్రం డబ్బులు తీసుకోవడమే వారి పని అంటూ మండిపడ్డారు.

First published:

Tags: Andhra Pradesh, Anil kumar yadav, AP News, Nellore Dist

ఉత్తమ కథలు