హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nellore: జైలుకెళ్లినా బుద్ధిరాలేదు..! అక్కడ మరో ఇద్దరితో కలిశాడు..! బయటకొచ్చాక మళ్లీ మొదలెట్టారు..!

Nellore: జైలుకెళ్లినా బుద్ధిరాలేదు..! అక్కడ మరో ఇద్దరితో కలిశాడు..! బయటకొచ్చాక మళ్లీ మొదలెట్టారు..!

Nellore: కొందరు అవసరం కోసం దొంగతనం చేస్తే.. మరికొందరు దొంగతనాలనే వృత్తిగా మార్చుకుంటూ ఉంటారు. అలాంటివాళ్లు జైలుకు వెళ్లొచ్చిన మారరు. కాదుకదా.. అక్కడ పరిచయమైన వారితో కలిసి మరింత రెచ్చిపోతుంటారు.

Nellore: కొందరు అవసరం కోసం దొంగతనం చేస్తే.. మరికొందరు దొంగతనాలనే వృత్తిగా మార్చుకుంటూ ఉంటారు. అలాంటివాళ్లు జైలుకు వెళ్లొచ్చిన మారరు. కాదుకదా.. అక్కడ పరిచయమైన వారితో కలిసి మరింత రెచ్చిపోతుంటారు.

Nellore: కొందరు అవసరం కోసం దొంగతనం చేస్తే.. మరికొందరు దొంగతనాలనే వృత్తిగా మార్చుకుంటూ ఉంటారు. అలాంటివాళ్లు జైలుకు వెళ్లొచ్చిన మారరు. కాదుకదా.. అక్కడ పరిచయమైన వారితో కలిసి మరింత రెచ్చిపోతుంటారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Nellore, India

  Polaa Sudha, News18, Nellore

  కొందరు అవసరం కోసం దొంగతనం చేస్తే.. మరికొందరు దొంగతనాలనే వృత్తిగా మార్చుకుంటూ ఉంటారు. అలాంటివాళ్లు జైలుకు వెళ్లొచ్చిన మారరు. కాదుకదా.. అక్కడ పరిచయమైన వారితో కలిసి మరింత రెచ్చిపోతుంటారు. నెల్లూరు (Nellore) పొగతోటలో డాక్టర్ సుధాకర్ రావు నివాసంలో చోరీ చేసిన దొంగ‌ల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితుల‌ను అరెస్ట్ చేయ‌గా మ‌రో ఇద్దరు ప‌రారీలో ఉన్నారు. డీఎస్పీ కార్యాల‌యంలో అడిష‌న‌ల్ ఎస్పీ క్రైమ్స్ చౌడేశ్వరీ కేసు వివ‌రాల‌ను, నిందితుల వివ‌రాల‌ను మీడియాకు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.., చోరీలో ప‌ట్టుబ‌డ్డ ముద్దాయి బూసి మ‌నోజ్ అని, అత‌డు పాత నేర‌స్తుడే అని తెలుస్తోంది. కావ‌లికి చెందిన ఇతనిపై కేసులు కూడా ఉన్నాయ‌ని తెలిపారు.

  జైలు శిక్ష అనుభ‌విస్తున్న స‌మ‌యంలో ఇద్దరు నేర‌స్తులు ప‌రిచ‌యం అయ్యార‌ని, వారితో క‌లిసి జైలు నుంచి విడుద‌ల అయిన త‌ర్వాత పొగ‌తోట‌లో డాక్టర్ సుధాక‌ర్ రావు నివాసంలో చోరీకి పాల్పడినట్లు చౌడేశ్వరీ తెలిపారు. బంగారు ఆభ‌ర‌ణాలు, వెండి సామాగ్రి, న‌గ‌దును దోచుకెళ్ళార‌ని తెలిపారు. త‌న‌ వాటా బంగారాన్ని మ‌నోజ్, కావలికి చెందిన వింజమూరు సుబ్బారావు, నిమ్మకాయల మనోహర్‌, మోర్ల శ్రీను, పసుపులేటి కిషోర్‌లకు విక్రయించాడ‌ని, వారిని కూడా అదుపులోకి తీసుకున్నామ‌ని చెప్పారు. వారి నుంచి 33 శాతం బంగారు ఆభరణాలు, 3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామ‌న్నారు. మిగిలిన ఇద్దరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయ‌ని తెలిపారు. త్వరలోనే వారిని కూడా అరెస్ట్ చేస్తామ‌న్నారు.

  ఇది చదవండి: కాకినాడలో జైభీమ్‌ సినిమా సీన్‌ రిపీట్‌..! పోలీసులే చేశారా..?

  గ‌త‌నెల 10వ తేదీన డాక్టర్ సుధాకర్‌రావు నివాసంలో దొంగ‌త‌నం జ‌రిగింది. ఒకే భవనంలో కింద హాస్పిటల్, పైన డాక్టర్ కుటుంబం నివాసం ఉంటుంది. ఆయనకు భార్య సుగుణ, ఇద్దరు కుమార్తెలున్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహమైంది. కుమార్తె పిల్లలకు అనారోగ్యంగా ఉండటంతో .. చూసి వ‌చ్చేందుకు భార్యతో స‌హా ఆయ‌న హైద‌రాబాద్ వెళ్ళారు. ఇదే అద‌నుగా భావించిన దుండ‌గులు దొంగతనానికి ప్లాన్‌ చేశారు. ముందు రెక్కీ చేశారు. ప‌క్కా ప్రణాళిక‌తో రాత్రివేళ ఇంట్లోకి చొర‌ప‌డ్డారు. 124 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల నగదు, వెండి సామాగ్రిని దోచుకెళ్ళారు.

  ఇది చదవండి: దసరా వస్తే చాలు అందరి చూపు అటువైపే.. తలలు పగిలి రక్తం కారాల్సిందే..!

  ఇంట్లో దొంగ‌త‌నం జ‌రిగింద‌ని తెలియ‌డంతో ఆయ‌న హుటాహుటిన నెల్లూరుకు చేరుకుని చిన్న బజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీమ్‌తో వ‌చ్చి ఆధారాలు సేక‌రించారు. సీసీ ఫుటేజీని ప‌రిశీలించారు. సీసీ పుటేజీ ఆధారంగా చోరీకి వ‌చ్చిన నిందితుల‌ను గుర్తించి, చివ‌రికి వారిని కావ‌లిలో అరెస్ట్ చేశారు. నెల్లూరుకి త‌ర‌లించి చోరీ కేసులో రిక‌వ‌రీ చేసిన సొత్తును, నిందితుల‌ను మీడియా స‌మావేశంలో హాజ‌రు ప‌రిచారు. కేసును స‌త్వరం ఛేదించిన పోలీసుల‌ను అడిష‌న‌ల్ ఎస్పీ క్రైమ్స్ చౌడేశ్వరీ అభినందించారు. ఈ సమావేశంలో నగర ఇన్‌ఛార్జి డీఎస్పీ అబ్దుల్‌ సుభాన్‌, చిన్నబజారు ఇన్‌స్పెక్టర్‌ సురేంద్ర బాబు, ఎస్సై హనీఫ్‌, ఏఎస్సై శ్రీహరి త‌దిత‌రులు పాల్గొన్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Nellore