Home /News /andhra-pradesh /

NELLORE DISTRICT YSRCP MLA PRASANNA KUMAR REDDY WARNING TO COLLECTOR AND SUPERINDENT OF POLICE AK

కలెక్టర్, ఎస్పీకి వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్...

వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి(ఫైల్ ఫోటో)

వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి(ఫైల్ ఫోటో)

కలెక్టర్, ఎస్పీలకు రాజకీయాలు చేయాలని ఉంటే... పార్టీల్లో చేరి రాజకీయాలు చేయాలని వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సూచించారు.

    నెల్లూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుచ్చిరెడ్డిపాలెంలో లాక్ డౌన్ సందర్భంగా బాధితులకు నిత్యావసరాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు నోటీసులు జారీ చేయడంపై ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. అధికారులకు నోటీసులు జారీ చేయడం ఏంటని ఆయన జిల్లా కలెక్టర్, ఎస్పీలను ప్రశ్నించారు. అధికారులపై యాక్షన్ తీసుకుంటారని అంటున్నారని... యాక్షన్ తీసుకుంటే తానేంటో చూపిస్తానని ఆయన వార్నింగ్ ఇచ్చారు. పేదలను ఆదుకుంటే ఈ రకంగా చేయడం ఏమిటని ఆయన వ్యాఖ్యానించారు.

    కలెక్టర్, ఎస్పీలకు రాజకీయాలు చేయాలని ఉంటే... పార్టీల్లో చేరి రాజకీయాలు చేయాలని సూచించారు. అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు రూల్స్ బాగా తెలుసని... వారి దగ్గర రూల్స్ తెలుసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. మీరు ఆఫీసుల్లో 50 మందితో కలిసి సమీక్షలు చేస్తే కరోనా రాదా అని ప్రశ్నించారు. దీనిపై కలెక్టర్‌కు మరోసారి లేఖ రాస్తున్నానని... విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళతానని అన్నారు. జిల్లా మంత్రులు దీనిపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Nellore Dist, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు