హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nellore: రాజరాజేశ్వరీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో అద్భుత ఘట్టం.. చూటడానికి రెండు కళ్లు చాలవు.!

Nellore: రాజరాజేశ్వరీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో అద్భుత ఘట్టం.. చూటడానికి రెండు కళ్లు చాలవు.!

నెల్లూరులో

నెల్లూరులో ఘనంగా దసరా నవరాత్రి ఉత్సవాలు

నెల్లూరు (Nellore) రాజరాజేశ్వరి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Nellore, India

  Polaa Sudha, News18, Nellore

  నెల్లూరు (Nellore) రాజరాజేశ్వరి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు దసరా ఉత్సవాలు (Dussera Festival) జరగనున్నాయి. ఇందుకోసం సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. రాష్ట్రస్థాయిలో గుర్తింపు వచ్చేలా వైభవోపేతంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాల్లో అష్టాదశ శక్తిపీఠాల అలంకారాలు ప్రత్యేకంగా నిలవనున్నాయి. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నెల్లూరు నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. దర్గామిట్టలో వెలసిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 48వ శరన్నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా జరగనున్నాయి. ఉత్సవాల నిర్వహణపై పలుదఫాలు సమీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై పలు నిర్ణయాలు తీసుకున్నారు.

  రాజరాజేశ్వరీ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారిని దర్శించుకునే తొలి ప్రాధాన్యత సాధారణ భక్తులకు కల్పించే చర్యలు తీసుకున్నారు. మొత్తం మూడు క్యూ లైన్లు ఏర్పాటు చేయగా, ఒక క్యూ లైన్ కేవలం మహిళల కోసం, రెండో క్యూ లైన్ రూ.30, మూడో క్యూ లైన్ రూ. 100ధర నిర్ణయించారు. వీఐపీలకు ప్రత్యేక సమయాన్ని కేటాయించారు. మద్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల సమయంలో వీఐపీలు అమ్మవారి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.

  ఇది చదవండి: ఇకపై జేబులో డబ్బులు లేకపోయినా ఎంచక్కా బస్సు ఎక్కేయొచ్చు..!

  మరో ముఖ్యమైన ఘట్టం ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో భక్తులను కనువిందుచేయనుంది. అష్టాదశ శక్తిపీఠాల అలంకారాలు ఈ సారి ఆలయంలో తాత్కాలికంగా ప్రతిష్టించనుండడం విశేషం. అష్టాదశ శక్తిపీఠాల తాత్కాలిక ప్రతిష్ట కోసం ఆలయ నమూనా సిద్ధం చేశారు. ఇందులో భాగంగా అష్టాదశ శక్తిపీఠాల నుంచి తీసుకొచ్చిన చీర-సారె, పసుపు-కుంకుమ, అక్షితలు-నెయ్యి, తీర్ధప్రసాదాలతో ఈరోజు శోభాయాత్ర నిర్వహించారు. నెల్లూరు నగరంలోని టీటీడీ కళ్యాణ మండపం నుంచి రాజరాజేశ్వరీ దేవస్థానం వరకు ఈ యాత్ర సాగింది. దీంతో ఆ ప్రాంతమంతా భక్త జన సందోహంతో నిండిపోయింది.

  ఇది చదవండి: గోదావరి అందాలు చూసేందుకు ఇదే సరైన సమయం.. ఒక్కసారి వెళ్తే మైమరచిపోతారు..!

  అంతకుముందు శక్తిపీఠాల పవిత్ర సామాగ్రికి వేద పండితులు విశేష పూజలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా రూపొందించిన పుష్ప పల్లకిలో ఆశీనులైన అమ్మవారి పాదాల చెంత పవిత్ర సామాగ్రిని ఉంచి శోభాయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా భవాని భక్తులు కోలాటాలు, మంగళ వాయిద్యాలు, సన్నాయి మేళాలు, నాట్య కళాకారుల ప్రదర్శనలతో కన్నుల పండుగగా యాత్ర సాగింది.

  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దంపతులతో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, సన్నపరెడ్డి పెంచల రెడ్డి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థాన శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వాన కమిటీ చైర్మన్ అలహరి విజయ్ కుమార్ తో పాటు పలువురు ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Local News, Nellore

  ఉత్తమ కథలు