సమాజంలో తరచు వింత ఘటనలు జారుతూనే ఉంటాయి. కొన్ని మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని మనకు భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇలాంటి ఘటనలు తరచు ఏదొక మూలన జరుగుతూనే ఉంటాయి. కొన్ని ఘటనలు ప్రకృతి వల్ల సంభవిస్తే మరికొన్ని... మానవ తప్పిదాల వల్ల సంభవిస్తూ ఉంటాయి. ఇంటిలోనుంచి అదృశ్యమైన వ్యక్తి చెరువులో మృతి చెందినట్లు గుర్తించారు గ్రామస్థులు. ఇక మృత దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు నిర్వహించిన గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. అంత్యక్రియలు నిర్వహించిన మరుసటి రోజు గ్రామస్థులు షాక్ కు గురైన ఘటన చోటు చేసుకుంది. చనిపోయాడన్న అనే వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వస్తున్న ఘటన చూసి బిత్తర పోయారు గ్రామస్థులు. ఒక్కసారిగా కంగుతిన్న గ్రామస్థులు మృతి చెందిన వ్యక్తి ఇంటి వద్దకు చేరుకున్నాడు. అసలు ఏమైందో తెలిసి గ్రామస్థులకు ఫ్యూజులు ఎగిరిపోయాయి.
వివరాల్లోకి వెళితే... నెల్లూరు జిల్లా (Nellore District) మనుబోలు మండలం వడ్లపూడిలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. సర్పంచ్ రమాదేవి రెండవ కుమారుడు సతీష్ నాలుగు రోజులు కిందట అదృశ్యం అయ్యాడు. వెంకటాచలం మండలం కనుపూరు చెరువులో మృతదేహాం కనిపించడంతో, సతీష్ దే అనుకున్నారు తల్లిదండ్రులు. గుర్తుతెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. సతీష్ తిరిగిరావడంతో గ్రామస్థులు హడలిపోయారు. చనిపోయాడనుకున్న కుమారుడు తిరిగి రావడంతో తల్లిదండ్రులు ఆనందం లో ఉన్నారు.
వడ్లపూడి గ్రామంలో సర్పంచ్ రమాదేవి రెండో కుమారుడు సతీష్(30)కు మతి స్థిమితం సరిలేదు. నాలుగు రోజుల క్రితం నుండి కనిపించకుండాపోయాడు, శనివారం వెంకటాచలం మండలం కనుపూరు చెరువులో ఒక వ్యక్తి మృతదేహం లభ్యం కావడంతో చుట్టుపక్కల వారు, పోలీసులు సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న తల్లి తండ్రులు మృతదేహాన్ని తమ బిడ్డది గా నిర్ధారించారు. దీంతో మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసిన తర్వాత స్వగ్రామమైన వడ్లపూడిలో శనివారం రాత్రి దహన సంస్కారాలు పూర్తి చేసేశారు. ఐతే తర్వాతి రోజు మధ్యాహ్నం మతిస్థిమితం లేని యువకుడు గ్రామంలో కనిపించాడు. దీంతో అతని కుటుంబ సభ్యుల తో పాటు గ్రామస్థులు ఆశ్చర్యానికి లోనయ్యారు.
ఇదంతా ఒక ఎత్తయితే మరి కనుపూరు చెరువులో దొరికిన మృతదేహం ఎవరిది?ఎవరైనా చంపి పడేశారా..? లేక ప్రమాదవశాత్తూ చెరువులో పడి మరణించాడా..? అసలు ఆ మృతదేహం ఎవరిదనే విషయం తెలియాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Nellore