Home /News /andhra-pradesh /

NELLORE COURT THEFT CASE CHASE THE DISTRICT POLICE 2 MAN ARRESTED AND RECOVERY FROM LAPTOP AND OTHERS NGS

NELLORE COURT CASE: కోర్టు చోరీ కేసులో నిందుతుల అరెస్ట్.. నిజమే చెప్పారా..? పోలీసుల వెర్షన్ ఏంటి..?

నెల్లూరు కోర్టు కేసు నిందితుల అరెస్ట్

నెల్లూరు కోర్టు కేసు నిందితుల అరెస్ట్

NELLORE COURT CASE: ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారిన కోర్టు చోరీ కేసులో నిందితులు అరెస్ట్ అయ్యారు.. ఈ కేసులో మంత్రి కేసుకు సంబంధించి పత్రాలు మాయం అవ్వడంతో చోరీ సంచలనంగా మారింది. దీనికి సంబంధించి నిందితులను పోలీసులు త్వరగానే అరెస్ట్ చేశారు.. మరి వారు చెప్పేదాంట్లో వాస్తవం ఎంత..?

ఇంకా చదవండి ...
    NELLORE COURT CASE: నిత్యం చోరీలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని బాగా హైలైట్ అవుతాయి.. కొన్ని సంచలనంగా మారుతాయి. అయితే ఇప్పటి వరకు  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో జరిగిన చోరీలు అన్నీ ఒక ఎత్తైతే..? నెల్లూరు కోర్టు (Nellore Court)లో చోరీ కేసు మరో ఎత్తు.. ఎందుకంటే కోర్టులో చోరీ జరగడం చాలా అరుదు.. అది కూడా రాష్ట్ర మంత్రికి కేసుకు సంబంధించిన కేసు పత్రాలు చోరీ అవ్వడం కలకలం రేపింది. అయితే ఇదంతా మంత్రి చేయించిన పనే అని విపక్షాలు ఆరోపించాయి.. ఆ కేసు నుంచి బయటపడేందుకు ఈ చోరీ డ్రామా అంటూ విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఈ కేసుకు సంబంధించి నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అసలు కోర్టులో చోరీకి ఎందుకు ప్రయత్నించారు.. సాధారణంగా దొంగలంటే నగలో.. నగదో అది కుదరకపోతే ఎలక్ట్రానిక్ గూడ్స్, ఇంటింకి సంబంధించిన వస్తువులు లాంటివి చోరీ చేస్తూంటారు. కానీ ఈ దొంగలు మాత్రం కోర్టులో.. అది కూడా కేసు పత్రాలు దొంగతనం చేయడం సంచలనంగా మారింది. అయితే ఈ దొంగతనం ఎందుకు చేయాల్సి వచ్చిందని వారు చెప్పిన సమాధానం చూసి అంతా అవ్వాక్కయ్యారు.

    ఈ కేసుకు సంబంధించిన వివరాలను నెల్లూరు ఎస్పీ విజయా రావు (Nellore sp Vijaya Rao) మీడియాకు వివరించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. నెల్లూరు నగరంలోని ఖుద్దూస్ నగర్‌కు చెందిన సయ్యద్ హయత్, పొర్లుకట్టకు చెందిన ఖాజా రసూల్ ఈ చోరీలకు పాల్పడ్డట్టు నిర్ధారించారు. అయితే నిందుతులు మొదట భారీ ప్లాన్ తో రెక్కీ నిర్వహించి చోరీకి సిద్ధమయ్యారని.. కోర్టు ప్రాంగణంలో నిర్మాణం జరుగుతున్న ప్రదేశం నుంచి ఇనుప సామగ్రి చోరీ చేసేందుకు వెళ్లారని.. అయితే ఆ సమయానికి అక్కడ ఉన్న కుక్కలు గట్టిగా అరస్తూ వెంబడించడంతో, వాటి నుంచి తప్పించుకునేందుకు కోర్టు తాళం పగలగొట్టి లోపలికి వెళ్లారని విరించారు.

    ఇదీ చదవండి : ఆ విషయంలో ఏపీ నెంబర్ వన్.. కేంద్రం నుంచి ప్రశంసలు

    అలా కోర్టులో ప్రవేశించిన వారికి బీరువా కనిపించడంతో, దానిలోని బ్యాగ్‌ను దొంగిలించారని.. బయటకు వచ్చిన తర్వాత బ్యాగ్‌లోని ల్యాప్‌టాప్, ఇతర వస్తువులు తీసుకుని అందులో ఉన్న పత్రాలను పడేసి, అక్కడ్నుంచి వెళ్లిపోయారని పోలీసులు చెబుతున్నారు. ఈ చోరీ విషయంలో రాజకీయ నాయకుల ప్రమేయం లేదని పోలీసులు వివరణ ఇచ్చారు. బెంచ్ క్లర్క్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామని, సీసీ టీవీ ఫుటేజీతోపాటు పూర్తి ఆధారాలతో కేసును చేధించామని ఎస్పీ అన్నారు. నిందితులపై గతంలో 14 కేసులున్నాయని, ఆత్మకూరు బస్టాండ్ వద్ద నిందితుల్ని పట్టుకున్నామని చెప్పారు. నిందితుల దగ్గరి నుంచి ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లు, 7 సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

    ఇదీ చదవండి : ఇంత నిర్లక్ష్యమా? వాటర్ బాటిల్ అడిగితే.. యాసిడ్ బాటిల్ ఇచ్చిన వ్యాపారి.. ఏం జరిగిందంటే?

    విపక్షాలు మాత్రం ఈ కేసుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మంత్రి కాకాణిని ఈ కేసును తప్పించే ప్రయత్నం జరుగుతోందని.. అందుకే ఇలాంటి కథలు చెబుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Crime news, Nellore

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు