హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YCP Politics: అధికారులపై ఇటీవల తీవ్ర విమర్శలు చేసిన ఎమ్మెల్యే.. సీఎంవో నుంచి పిలుపు.. సీఎంతో భేటీపై ఉత్కంఠ

YCP Politics: అధికారులపై ఇటీవల తీవ్ర విమర్శలు చేసిన ఎమ్మెల్యే.. సీఎంవో నుంచి పిలుపు.. సీఎంతో భేటీపై ఉత్కంఠ

ఎమ్మెల్యే కోటం రెడ్డికి సీఎంఓ నుంచి పిలుపు

ఎమ్మెల్యే కోటం రెడ్డికి సీఎంఓ నుంచి పిలుపు

YCP Politics: ఆయనో అధికార పార్టీ నేత.. అయినా ప్రభుత్వం పైనే ఆయన విమర్శలు చేస్తుంటారు.. తాజాగా అధికారుల వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో రావాలి అంటూ సీఎంవో నుంచి ఆ ఎమ్మెల్యేకు ఆహ్వానం అందింది. దీంతో సూచనలు చేస్తారా..? వార్నింగ్ ఇస్తారా..? అంటూ ఆసక్తి పెరుగుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nellore, India

YCP Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం తీవ్ర ఆసహనంతో ఉన్నారు. పార్టీ అధికారంలో ఉన్నా.. లాభం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ( Kotam Reddy Sridhar Reddy ) బహిరంగంగానే అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా (Nellore District) అభివృద్ధిపై అధికారులతో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Minister Kakani Govardhan Reddy) సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో అధికారులు.. ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.. ఈ సమీక్షా సమావేశంలో అధికారుల తీరుపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు.. గత నాలుగేళ్లుగా నియోజకవర్గంలో పనులు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు మారుతున్నారు.. శాఖలు మారుతున్నాయి.. కలెక్టర్లు మారారు.. కానీ తన పనులు మాత్రం కావడం లేదని దుయ్యబట్టారు.. అక్కడితోనే ఆగలేదు వరదలు వచ్చినా ఎఫ్‌డీఆర్‌ పనులు చేపట్టలేదని.. దీంతో 150 ఎకరాల పంట కొట్టుకుపోయిందన్నారు.. దీనికి ఎవరు బాధ్యులు అంటూ నిలదీశారు.

తాజాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy)కి సీఎం కార్యాలయం నుంచి‌ పిలుపు వచ్చింది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy)తో ఎమ్మెల్యే సమావేశంకానున్నారు. ఇటీవల ప్రభుత్వ, అధికారుల తీరుపై ఆయన తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో సీఎం ను పిలుపు వచ్చిందని చర్చ జరుగుతోంది.

ఓ వైపు ప్రభుత్వం అద్భుతంగా పాలన చేస్తోందని.. అధికారులు చక్కగా పని చేస్తున్నారని సీఎం జగన్ సహా ప్రభుత్వ పెద్దలు కితాబు ఇస్తున్నారు. విపక్షాలు విమర్శలు చేస్తే.. గట్టిగా తిట్టండి అంటూ ఇటీవల అధికారులకు గట్టిగా చెప్పారు సీఎం.. ఇలా ప్రతిపక్షాలు విమర్శిస్తేనే తిరిగి కౌంటర్ ఇవ్వాలని అధినేత జగన్ చెబుతుంటే.. సొంత పార్టీ నేత.. సీనియర్ అయిన కోటంరెడ్డి మాత్రం అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఇదీ చదవండి : చంద్రబాబు గుంటూరు సభ తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు 30 లక్షల పరిహారం.. ప్రభుత్వం ఎంత ఇచ్చింది అంటే?

సీఎం ఆదేశించినా దర్గా అభివృద్ధి నిధులు ఇవ్వలేదంటూ ఐఏఎస్ అధికారి రావత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫించన్లు తొలగించడం సరికాదని, వీలైతే పెంచాలని కోటంరెడ్డి వ్యాఖ్యలు చేశారు. నిబంధనలు సడలించాలని‌ సూచించారు. ఈ క్రమంలో కోటంరెడ్డితో సీఎం భేటీపై వైసీపీ పార్టీ వర్గాల్లో చర్చ నెలకొంది. ఈ భేటీకి రీజనల్ కోఆర్డినేటర్ బాలినేనిని కూడా రావాల్సిందిగా అధినేత ఆదేశించారు. దీంతో ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, Cm jagan, Kotamreddy sridhar reddy, Nellore Dist

ఉత్తమ కథలు