Breaking News: వైసీపీ (YCP) లో రెబెల్స్ పెరుగుతున్నారా..? ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో అధిష్టానం చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందా..? తాజాగా సోషల్ మీడియా (Social Media) లో ఓ వార్త వైరల్ అవుతోంది.. నెల్లూరు జిల్లా (Nellore District) లోని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy ) పై వేటు పడింది అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతానికి ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించారు. త్వరలోనే పార్టీ సభ్యత్వంపైనా వేటు వేస్తారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక కారణం కూడా ఉంది. ఇటీవల తరచూ సొంత పార్టీపైనే ఆనం తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముందస్తు ఎన్నికలు జరిగితే.. ఎమ్మెల్యేలు అంతా ఇంటికే పరిమితం కావాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఆయనపై వేటు పడనుందనే ప్రచారం ఉంది.
తాజాగా వెంకటగిరి ఇంఛార్జ్ గా ఆనం రామనారాయణ రెడ్డిని తప్పించి.. అతడి స్థానంలో నేదురమల్లి రాం కుమార్ ను ఇంఛార్జ్ గా నియమించారు. అలాగే పర్చూరు ఇంఛార్జ్ గా ఆమంచిని నియమించారు.
ప్రస్తుతానికి పార్టీ ఇంఛార్జ్ పదవి నుంచి తప్పించినా.. పార్టీ సభ్యత్వం నుంచి కూడా వేటు వేస్తారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు ఆనం త్వరలోనే టీడీపీలో జాయిన్ అవుతున్నారనే ప్రచారం ఉంది.. ఆయనతో పాటు మొత్తం ఫ్యామిలీ అంతా టీడీపీ కండువా కప్పుకుంటారని వైసీపీ వర్గాలు చర్చ జరుగుతోంది. అయితే వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచి నేదురమల్లి రాం కుమార్ రెడ్డి పోటీ చే్స్తారనే మరో ప్రచారం ఉంది. అందుకే ఆనం సొంత పార్టీపై విమర్శలు చేస్తున్నారని టాక్ నడుస్తోంది..
కారణం ఏదైనా ఆనం వ్యాఖ్యలు పెను కలకలం రేపుతున్నాయి. తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. రాష్ట్రంలో ముందస్తుగానే ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఏడాదిలోపు ఎన్నికలు వస్తే తామంతా ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. సైదాపురం మండలంలో సచివాలయాల నిర్మాణాలు సరిగా జరగడంలేదని మండిపడ్డారు ఆనం.
ఇదీ చదవండి : రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు.. ఇప్పుడు ఏపీకి ఎందుకు వస్తున్నారంటూ కేసీఆర్ పై ఫైర్
కాంట్రాక్టర్లు ఎందుకు ముందుకు రావడం లేదో అర్థం కావడం లేదన్నారు. సొంత డబ్బులు పెట్టి సచివాలయాలు కడితే బిల్లులు రావని కాంట్రాక్టర్లు వెనకడుగు వేసే పరిస్థితి ఉందన్నారు. అధికారులను అడిగితే త్వరలో పూర్తి చేస్తామని చెబుతున్నారని.. అవి పూర్తి అయ్యే లోపు తమ పదవి కాలం అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anam Ramanarayana Reddy, Andhra Pradesh, AP News, Nellore, Ycp