CID Notice: మాజీ మంత్రి నారాయణ (AP Former Minister Narayana) కు వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే అమరావతి భూములు (Amaravati Lands) కేసు.. అటు పది పరీక్షల లీకేజీ (10th Papare Leakge) వ్యవహారం విషయంలో షాక్లు తగులుతున్నాయి. తాజాగా కుటుంబసభ్యులకు సీఐడీ నోటీసు (CID Notice) లు జారీ చేసింది. మార్చి 6న విచారణకు ఆదేశాలు ఇచ్చింది. సీఆర్‌డీఏ (CRDA) ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ మార్పు కేసులో సీఐడీ దూకుడు పెంచింది. సీఆర్‌పీసీ 41A కింద నోటీసులు ఇచ్చింది. మార్చి 6వ తేదీ విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. నారాయణ, ఆయన భార్య రమాదేవితో పాటు.. నారాయణ సంస్థల ఉద్యోగి ప్రమీలకు నోటీసులు ఇష్యూ చేసింది.
రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిడెట్ ఎంపీ కేపీవీ అంజనీకుమార్, సీఆర్‌పీసీ 160 కింద సింధూర, షారిణితో పాటు మరో నలుగురికి నోటీసులు ఇచ్చింది. నారాయణ కుమార్తెలు 7 లేదా 8వ తేదీ విచారణకు రావాలన్న నోటీసుల్లో స్పష్టం చేసింది.
హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. రాజధాని మాస్టర్ ప్లాన్ అవకతవకల పైనే సోదాలు చేస్తున్నట్లు ప్రకటించారు. కూకట్‌పల్లి, గచ్చిబౌలి, కొండాపూర్‌లో ఉన్న నారాయణ కుటుంబీకుల నివాసాలపై సీఐడీ అధికారులు సోదాలు జరిపారు. ఇప్పటి వరకు నారాయణపై ఏపీ సీఐడీ అధికారులు పలు కేసులు పెట్టారు.
ఇదీ చదవండి : వైసీపీకి వరుస షాక్ లు.. ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబ సభ్యుల ఇళ్లల్లో ఐటీ సోదాలు.. కారణం ఇదే
ఆ కేసుకు తోడు నారాయణపై పదోతరగతి పరీక్షాపత్రం లీకేజీ కేసు కూడా ఉంది. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు (Leakage of class 10 question papers Case)లో నారాయణ (Narayana) దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీం విచారించింది. ఈ కేసుకు సంబంధించి సెషన్స్ కోర్టు (Sessions Court)లో విచారణ చేపట్టాలని ధర్మాసనం ఆదేశించింది. మెరిట్ ఆధారంగానే విచారణ కొనసాగించాలని సుప్రీం స్పష్టం చేసింది. సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై వారం రోజుల్లో హైకోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కల్పిస్తున్నామని... అప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదీ చదవండి : చంద్రబాబు , పవన్ లకు జగన్ సవాల్.. దమ్ముంటే 175 నియోజకవర్గాల్లో పోటీ చేయండి..?
గతేడాది చిత్తూరు జిల్లాలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన నారాయణకు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేయగా... దాన్ని సవాల్ చేస్తూ పోలీసులు హైకోర్టులో పిటిషన్ వేశారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు నారాయణకు బెయిల్ రద్దు చేస్తూ రిమాండ్‌కు పంపాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై నారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం నారాయణ బెయిల్‌పై బయట ఉన్నారు. ఇలా రెండు కేసులతో ఆయన ఉక్కిరిబిక్కిర అవుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravati, Andhra Pradesh, AP News, Narayana