ఏపీలో అధికార పార్టీ గుర్తుతో గెలిచిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే(Nellore Rural MLA)కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి(Kotamreddy Sridhar reddy) కొద్దిరోజులుగా వైసీపీ(YCP)లో తిరుగుబాటుతో వార్తల్లో నిలిచారు. అయితే ఆయన నెక్స్ట్ ఏ పార్టీలో చేరుతున్నారనే విషయంపై ఆసక్తికరమైన సమాచారం ఒకటి వినిపిస్తోంది. తన ఫోన్ ట్యాపింగ్ (Tapping)వ్యవహారంపై సొంత పార్టీ నేతలపై విమర్శలు, ప్రభుత్వ పాలనపై తన అసంతృుప్తిని వెళ్లగక్కారు శ్రీధర్‌రెడ్డి. వైసీపీని వీడేందుకు దాదాపు ఫిక్సైన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రాబోయే ఎన్నికల్లో కొత్తగా ఏర్పాటైన పార్టీలో చేరాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మొదట్నుంచి టీడీపీ(TDP)లో చేరబోతున్నారనే వార్త బాగా వినిపించినప్పటికి ఆయన మాత్రం జాతీయ రాజకీయాల్లో చక్రం చిప్పేందుకు బీఆర్ఎస్(BRS)గా మారిన కేసీఆర్(KCR) పార్టీలో చేరాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సన్నిహిత వర్గాల దగ్గర చెప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికలకు మరో ఏడాదికిపైగా సమయం ఉండటంతో ఈలోగా టీడీపీలో చేరితే ప్రభుత్వ నియంత పాలనని నిలదీయాలని చూస్తున్నారట. ఒకవేళ టీడీపీలో చేరని పక్షంలో బీఆర్ఎస్ తరపున రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని సన్నిహితులకు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చెప్పినట్లుగా తెలుస్తోంది.
తన ఫోన్ ట్యాంపిగ్ చేశారంటూ బహిరంగంగా ప్రభుత్వంపై, వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఏ పార్టీలో చేరబోతున్నారనే వార్త ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిగ్‌గా మారింది. అంతే కాదు టీడీపీలో చేరేందుకే ఆయన వైసీపీపై విమర్శలు చేస్తున్నారని అధికార పార్టీ నేతలు ఆరోపించారు. ఈ వార్తలకు ధీటుగా ఆయన బీఆర్ఎస్‌లో చేరాలని భావిస్తున్నట్లుగా సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తోంది. ఏపీలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న నాయకుల సంఖ్య పెరగడంతో పాటు తెలంగాణలో అధికార పార్టీ కావడంతో బీఆర్ఎస్ అయితేనే బెటర్ అన్నట్లుగా ఆలోచిస్తున్నారట.
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీరు ఇప్పుడు వైసీపీలో తలనొప్పిగా మారింది. తాను మాత్రమే కాదు మరో 30మంది వరకు పార్టీలో అసంతృప్తితో ఉన్నారని చెప్పడం చూస్తుంటే వాళ్లు కూడా బీఆర్ఎస్‌లో చేరుతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో టీడీపీ, వైసీపీని కాదని బీఆర్ఎస్‌లోచేరితే టికెట్ కన్ఫమ్‌తో పాటు గెలిస్తే తమ పెత్తనం చలాయించవచ్చనే ధోరణితో మరికొందరు ఆలోచిస్తున్నారట. ఏది ఏమైనా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాత్రం వైసీపీని వీడటం ఎంత వాస్తవమో..బీఆర్ఎస్‌లో చేరడం కూడా అంతే వాస్తవమనే టాక్ కూడా వినిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.