హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

KotamReddy Sridhar Reddy: పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు.. వారసత్వంగా ఎదగలేదు..? పోరాటాలు చేసి ఈ స్థాయికి చేరా

KotamReddy Sridhar Reddy: పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు.. వారసత్వంగా ఎదగలేదు..? పోరాటాలు చేసి ఈ స్థాయికి చేరా

ఎమ్మెల్యే కోటం రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఎమ్మెల్యే కోటం రెడ్డి సంచలన వ్యాఖ్యలు

KotamReddy Sridhar Reddy: అధికార వైసీపీ లో రెబల్ సంఖ్య పెరుగుతోంది. రోజుకో నేత అధిష్టానంపై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు నేతల మధ్య విబేధాలు సైతం తారా స్థాయికి చేరుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nellore, India

KotamReddy Sridhar Reddy:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ (YCP) వర్గ పోరు పీక్ కు చేరింది. నేతల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. మరోవైపు అధిష్టానంపై కొందరు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక నెల్లూరు జిల్లా (Nellore District)లో అయితే పరిస్థితి మరింత దారుణంగా మారింది.. గత ఎన్నికల్లో జిల్లా మొత్తాన్ని క్లీన్ స్వీప్ చేసిన వైసీపీలో ఇప్పుడు వర్గ పోరుతో పార్టీ ఇబ్బందులు పడుతోంది. ఇక తాజాగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) వ్యవహారం రాజకీయంగా కలకలం రేపుతోంది. నెల్లూరు జిల్లాలోని ఈయన పేరు తెలియని (Nellore District) వారు ఉండరు. నిత్యం వార్తల్లోనూ ఆయన నిలుస్తూనే ఉంటారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయాలన్నా.. వ్యంగ్యగా మాట్లాడాలన్నా.. ఆయనే తర్వాతే. నియోజకవర్గ ప్రజల సమస్యలను తన సమస్యగా భావించి పరిష్కరించే వ్యక్తిగానూ కోటంరెడ్డికి పేరుంది. మంత్రి పదవి రాలేదన్న బాధతో చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి..

ఆ తరువాత నుంచి ఆయన అధిష్టానం పైనా.. అధికారులపైనా.. జిల్లా నేతలపైనా తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలోని రాజకీయాలపై శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనకు రాజకీయ వారసత్వం లేకున్నా పోరాటాలతో ఎదిగానని స్పష్టం చేశారు.

తనను రాజకీయంగా ఎదగనీయకుండా జిల్లాలోని పెద్ద రాజకీయ కుటుంబాలు అడ్డుకున్నాయని పరోక్షంగా ఆనం, మేకపాటి కుటుంబాలపై విమర్శలు గుప్పించారు. రాజకీయంగా అవకాశాలు వచ్చినా ఈ పెద్ద కుటుంబాలు అనేకసార్లు తన గొంతును కోశాయని ఆవేదన వ్యక్తం చేశారు. పదవులన్నీ వీళ్లే అనుభవిస్తున్నారని.. ఇకనుంచి ఈ ధోరణి కొనసాగనివ్వం అన్నారు.

ఇదీ చదవండి : పొత్తులపై క్లారిటీ అప్పుడే.. పవన్ వారాహి యాత్రపై నాగబాబు క్లారిటీ..

ఇకపై ఓట్లు, సీట్లు, మంత్రి పదవులు తమకేనని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు తాను రాజకీయాల్లో ఖరాఖండిగా ఉంటానని తెలిపారు. తాను సామాన్యుడిగా జెండా మోసి ఈ స్థాయికి వచ్చానని.. తాను రాజకీయ కుటుంబం నుంచి రాలేదన్నారు. తనవాళ్ల కోసం ఎవరితోనైనా ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. సామాన్యుడిగా జెండా మోసి ఈ స్థాయికి వచ్చానని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల కోసం తాను జైలుకు కూడా వెళ్లిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు.

ఇదీ చదవండి : విశాఖలో జీ-20 సదస్సుకి సర్వం సిద్ధం.. ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వానిదే

తనను నమ్ముకున్న వాళ్లకు అన్యాయం చేసే ప్రసక్తే లేదన్నారు. కాగా రాజకీయాలపై కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే అదే జిల్లా నుంచి ఆనం రామనారాయణ రెడ్డి వ్యవహారం రాజకీయంగా రచ్చ రచ్చ అవుతోంది. ఆ జాబితాలోనే చేరారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి.

First published:

Tags: Andhra Pradesh, AP News, Kotamreddy sridhar reddy, Nellore Dist, Ycp

ఉత్తమ కథలు