Polaa Sudha, News18, Nellore.
Nellore: టెక్నాలజీ (Technology) రోజురోజుకీ ఎంత పెరుగుతుందో.. అదే స్థాయిలో క్రైమ్ రేటు మాత్రం పెరిగిపోతోంది. టెక్నాలజీ అరచేతిలోకి వచ్చాక ఫైనాన్షియల్ క్రైమ్స్ (Financial Crimes) ఇటీవల మితిమీరిపోయాయి. ఒకప్పుడు నిరక్ష్యరాస్యులు మాత్రమే ఫింగర్ ఫ్రింట్స్ (Finger Prints) వేసేవారు కానీ.. ఇప్పుడు పెరిగిన టెక్నాలజీ ఆధారంగా..? వెలిముద్రలు తప్పని సరి అయ్యాయి. ఆధార్ తో లింకు ఉన్న దేనికైనా ఫింగర్ ప్రింట్స్ తప్పని సరి.. పథకాలు పొందాలన్నా..? వేలి ముద్రలు తప్పని సరి.. ఇక ఏటీఎం కార్డు కానీ.. కనీసం ఫోన్ కూడా లేకుండానే నగదు విత్ డ్రా చేసుకోవచ్చు.. దానికి మన ఫింగర్ ప్రింట్స్ సరిపోతాయి. కానీ ఆ వేలి ముద్రలు కూడా సురక్షితం కాదని తెలుస్తోంది తాజా సంఘటనలు చూస్తుంటే..?
ఇటీవల బ్యాంక్ ఖాతాదారులు సైబర్ నేరగాళ్ళ చేతికి చిక్కి, ఆర్ధికంగా నష్టపోతున్న ఘటనలు కొకొల్లలు. ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లాలోనూ ఇలాంటి సైబర్ క్రైమ్స్ ఎక్కువవ్వడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.
నెల్లూరు జిల్లాలో సైబర్ నేరగాళ్లు రోజురోజుకీ పెట్రేగిపోతున్నారు. బ్యాంకుల్లో నగదు దాచుకున్న ఖాతాదారుల అకౌంట్ల నుంచి సొమ్మును అందిన కాడికి స్వాహా చేసేస్తున్నారు. బ్యాంకు ఖాతాదారుల వేలిముద్రలు చోరీ చేసి.. వారి ఖాతాల్లో నగదును దోచేస్తున్నారు.
ఇదీ చదవండి : ఆస్ట్రేలియా టూ కాకినాడ ..! విద్యార్థులను వెతుక్కుంటూ ఖండాంతరాలు దాటొచ్చిన టీచరమ్మ..! ఎందుకో తెలుసా?
ఇందుకోసం సైబర్ నేరగాళ్లు హైటెక్నాలజీని వినియోగిస్తున్నారు. దీంతో ఎంతోమంది ఖాతాదారుల అకౌంట్లు గుల్లవుతున్నాయి. ఒకరకంగా ఇది ఆందోళన కలిగించే అంశం. ఇలాంటి క్రైమ్స్ ఇటీవలకాలంలో ఎక్కువైపోయాయి. సైబర్ నేరగాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు. ఏం చేస్తారో తెలియదు. ఎప్పుడు ఎవరి ఖాతాను మాయం చేస్తారో అంతకంటే తెలియదు. దీంతో వారి బారిన పడిన ఖాతాదారులంతా బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బ్యాంకు సిబ్బంది మాత్రం తమకు తెలియదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ చెబుతున్నారు. మరోమార్గం లేక పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నారు.
ఇదీ చదవండి: కొడాలి నాని మౌనానికి అర్థం ఏంటి..? విమర్శలపై ఎందుకు స్పందించడం లేదు?
ఏటీఎం కార్డుతో పని లేకుండా ఖాతాదారులు నగదు జమ, విత్ డ్రాలు చేసుకోవడానికి ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టంను బ్యాంకులు అందుబాటులోకి తెచ్చాయి. ప్రైవేటు వ్యక్తులకు కస్టమర్ సర్వీసు పాయింట్‌లు పెట్టుకునే అవకాశం కల్పించారు. వాటి నిర్వాహకులకు ప్రత్యేక ఎలక్ట్రానిక్ పరికరాలు అందించారు. దీని ద్వారా ఖాతాదారులు ఆయా కేంద్రాలకు వెళ్లి వేలిముద్ర వేసి.. వారి ఖాతా నుంచి నిర్ణీత మొత్తం తీసుకోవచ్చు. బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానమై వారికి మాత్రమే ఈ వెసులుబాటు ఉంది. ఈ సేవలకు గాను సీఎస్‌పీ నిర్వాహకుడికి బ్యాంకు అధికారులు కొంత కమీషన్ ఇస్తారు.
సీఎస్‌పీ వ్యవస్థలోని లోపాలను పసిగట్టిన సైబర్ నేరగాళ్ళు.. వేలిముద్రల ఆధారంగా నగదు చెల్లించడాన్ని తమకు అనుకూలంగా మలచుకున్నారు. ఖాతాదారుల వేలిముద్రలు చోరీ చేసి.. నకిలీ రబ్బర్ వేలిముద్రను తయారు చేసి.. నేరాలకు పాల్పడుతున్నారు. ఆన్‌లైన్ బ్యాకింగ్ ద్వారా నగదు బదిలీకి ఓటీపీ, డబుల్ అథెంటికేషన్ ఉంటుంది. ఏఈపీఎస్‌లో అలా ఉండదు. అదే కేటుగాళ్ళకు వరంలా మారింది. ఇలాంటి నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని బ్యాంకు అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు.
ఎక్కడ పడితే అక్కడ, ఎవరు అడిగితే వారికి వేలిముద్రలు ఇవ్వొద్దని, ఓటీపీ నెంబర్లు, బ్యాంక్ పాస్ వర్డ్, పిన్ నెంబర్స్ చెప్పొద్దని చెబుతున్నారు. మొబైల్‌కి వచ్చే నగదు మెసేజ్‌లు, లాటరీ అంటూ వచ్చే మెసేజ్‌లకు స్పందించొద్దని సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime news, CYBER CRIME, Local News, Nellore Dist