Accident: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ను వరస ప్రమాదాలు (Accidents) భయపెడుతున్నాయి. తాజాగా నెల్లూరు (Neoore)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో రైలు పట్టాలు దాటుతూ ప్రమాదవశాత్తు రైలు ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళల ఉన్నారు. నగరం లోని ఆత్మకూర్ బస్టాండ్ రైల్వే బ్రిడ్జి పై రైలు పట్టాలు దాటుతుండగా.. స్పీడ్ గా వచ్చిన ట్రైన్ ఢీ కొట్టింది. ధర్మవరం నర్సాపూర్ ఎక్సైప్రైస్ (Narsapur Express) ట్రైన్ చెన్నై నుండి నెల్లూరు మీదుగా నరసాపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి 10.50 నిమిషాల సమయంలో రైలు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
సమాచారం అందుకొన్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ఎలా జరిగింది..? మృతులు ఎవరన్న దానిపై విచారణ చేస్తున్నారు. ప్రమాదమా లేక ఆత్మహత్యకు పాల్పడ్డారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
ఈ సంఘటనలో ఇద్దరు పురుషులు రైలు పట్టాలపైనే మృతి చెందగా.. మహిళ పట్టాల పై నుంచి కిందపడి చనిపోయారు. ముగ్గురూ 45 నుంచి 50 ఏళ్లలోపు వారే ఉంటారు. వారి చేతుల్లో సంచులు ఉన్నాయి. కొందరు ప్రత్యక్ష సాక్షులు మాత్రం పురుషులు రైలు పట్టాల పక్కన ఉండగా.. మహిళ పట్టాలపై ఉన్నారని.. ఆమెను తప్పించబోయి.. వారు కూడా మృత్యువాత పడ్డారని చెబుతున్నారు.
ఇదీ చదవండి : ఛీఛీ.. నల్లకోట్లలోనూ నకిలీలా.. ఫేక్ సర్టిఫికేట్లతో న్యాయ వ్యవస్థకు కలంకం
మహిళను స్పీడ్ గా వస్తున్న ట్రైన్ ఢీ కొనడంతో.. వెంటనే ఆమె మృతదేహం రైల్వే బ్రిడ్జీ పైనుంచి రోడ్డుపై పడింది. ఆ సమయంలో బ్రిడ్జి కింద వెళ్తున్న వాహనదారులు ఒక్కసారిగా భయపడ్డారు. వెంటనే కొంతమంది వెళ్లి ట్రాక్ ను పరిశీలించారు. ట్రాక్ పై ఇద్దరు పురుషుల మృతదేహాలు ఉండటాన్ని గుర్తించారు. రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటినా ఘటనా స్థలికి చేరుకున్న రైల్వే, స్థానిక పోలీసులు ట్రాక్ పై చెల్లా చెదరుగా పడిన మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: మాట్లాడే దేవుడ్ని చూశారా..? ఈ సాయి బాబా ప్రవచనాలు కూడా చెబుతారు.. కావాలంటే మీరూ చూడండి
రైల్వే, స్థానిక పోలీసులు మృతుల వివరాలను సేకరిస్తున్నారు. అయితే ఇది ప్రమాదమా..? లేక ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ట్రాక్ పై నడిచి వెళ్తున్న సమయంలో నిజంగానే రైలు రాకను గమనించలేదా? లేకపోతే ముగ్గురు కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Nellore Dist, Road accident