NELLORE ANDHRA PRADESH CRIME NEWS FATHER KILLED HIS SON IN NELLORE DISTRICT NGS
AP Crime News: కొడుకు ఆనారోగ్యంతో మృతి చెందాడని హడావుడిగా అంత్యక్రియలు.. కానీ వాస్తవం ఏంటంటే?
ప్రతీకాత్మక చిత్రం
AP Crime News: కొడుకు ఆనారోగ్యంతో మరణించాడని.. స్థానికులకు.. బంధువులకు చెప్పి ఆ తండ్రి కన్నీరుమున్నీరయ్యారు. అంత్యక్రియులు కూడా చేసేందుకు సిద్ధమయ్యాడు.. కానీ పోలీసులు ఎంట్రీతో సీన్ మారింది.. కన్నీరు మున్నీరు అవుతున్న ఆ తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఏమైందో తెలుసా?
Father killed son: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో నేరాల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా మానవ సంబంధాలు దారుణంగా దెబ్బ తింటున్నాయి.. రక్త సంబంధానికి ఎవరూ విలువ ఇవ్వడం లేదు.. చిన్న చిన్న కారణాలు.. క్షణికావేశం.. తప్పు చేస్తున్నారనే కారణాలతో హత్యలకు కూడా వెనుకాడడం లేదు.. తాజాగా నెల్లూరు జిల్లా (Nellore)లో జరిగిన ఓ ఘటన అందిరికీ షాక్ ఇచ్చింది. ఓ తండ్రి (Father) కన్నీరు మున్నీరు అవుతూ.. చుట్టుపక్కల వారికి.. బంధువులకు తన కొడుకు అనారోగ్యంతో మృతి చెందాడని చెప్పారు.. తన కన్నకొడుకును పోగుట్టుకున్నాను అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. వెంటనే కొడుకు అంత్యక్రియలను త్వరగా చేయాలని హడావుడి చేశాడు.. అయితే స్థానికుల్లో కొందరికి తండ్రి ప్రవర్తనపై అనుమానం రావడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అంత్యక్రియులు ఆపమని చెప్పి.. ఏం జరిగిందని ఆరా తీశారు.. చివరికి విషయం తెలిసి షాక్ అయ్యారు.. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా..?
పోలీసులు, స్థానికులు చెప్పిన దాని ప్రకారం.. నెల్లూరు జనార్ధన్ రెడ్డి కాలనీలో దారుణం జరిగింది. ఓ తండ్రి తన కుమారుడిని హత్య చేసి అనారోగ్యంతో మృతి చెందాడని నమ్మించాడు. అంతేకాదు కుమారుడి మృతదేహాన్ని పూడ్చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా వెంటనే అంత్యక్రియలు కూడా చేసేశాడు. ఎందుకంటే..? స్థానికంగా నివాసముంటున్న శ్రీనివాసులు (Srinivasulu)కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది. కుమారుడు మల్లికార్జున (Mallikarjuna) లిఫ్ట్ మెకానిక్ (Lift Mechanic)గా పని చేస్తున్నాడు. అయితే మల్లికార్జున మద్యానికి బానిసై.. విచక్షణా రహితంగా ప్రవర్తించేవాడు. ఇంట్లో ప్రతి ఒక్కర్నీ వేధించేవాడు. దానికి తోడు ఫిట్స్ కూడా ఉండేది.. దీంతో మందలించాలి అంటే ఇంట్లోవారు భయపడే వారు.. కానీ మల్లికార్జున మాత్రం.. నిత్యం మద్యం తాగుతూ ఇంట్లో అందరిపై చేయి కూడా చేయి చేసుకునే వాడు.. ఈ క్రమంలో మధ్యాహ్నం పూటుగా మద్యం తాగొచ్చిన మల్లికార్జున తన తల్లితో గొడవ పెట్టుకొని దాడి చేసినట్టు ఆ కటుంబ సభ్యులు పోలీసులకు వివరించారు.
అయితే తల్లిపై దాడి చేస్తున్న సమయంలో తండ్రి అడ్డుకోబోయాడు.. కానీ తండ్రి అని భయం లేకుండా.. అతడిపైనా దాడి చేసి తీవ్రంగా గాయ పరిచాడు. తీవ్రగాయాలు అవ్వడంతో.. తండ్రి కూడా ఆవేశాన్ని ఆపుకోలేకపోయాడు. వెంటనే ఇంట్లో తనకి దొరికిన రొకలి బండతో.. తండ్రి కుమారుడి తలపై గట్టిగా కొట్టాడు. దీంతో మల్లికార్జున అక్కడికక్కడే మృతి చెందాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.