BY Poll: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో మరో ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. మేకపాటి గౌతమ్ రెడ్డి (Mekapati Goutham Reddy) ఆకస్మిక మరణంతో నెల్లూరు జిల్లా (Nellore District)లోని ఆత్మకూరు సీటు ఖాళీ అయ్యింది. అయితే ఆయనతో విపక్షాలకు కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వివాదాస్పదుడిగా, సౌమ్యుడిగా గుర్తింపు ఉంది. అన్ని పార్టీల్లోనూ సన్నిహితులు ఉన్నారు. అది కూడా చాలా యంగ్ ఏజ్ లో ఆయన తుది శ్వాస విడిచారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు పోటీ చేస్తే.. టీడీపీ (TDP), జనసేన (Janasena) పార్టీలు ఉప ఎన్నికకు దూరంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఆ రెండు పార్టీలు పోటీకి నో చెప్పినా ఇక్కడ ఉప ఎన్నిక తప్పలేదు. దీంతో ఖాళీగా ఉన్న ఆత్మకూరు నియోజకవర్గంపై కసరత్తు మొదలుపెట్టారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీనిలో భాగంగా రేపు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి (MP Mekapati Rajarammohan Reddy)తో భేటీ కానున్నారు. ముఖ్యంగా ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నికపై వీరిద్దరూ చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల బరిలో పార్టీ అభ్యర్థిగా గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి (Vikram Reddy) పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సీటును గౌతమ్ రెడ్డి భార్యకు కాకుండా ఆయన సోదరుడికి అవకాశం ఇద్దామని మేకపాటి కుటుంబసభ్యులు ఇటీవలే నిర్ణయించినట్లు సమాచారం. మరోవైపు మేకపాటి ప్రతిపాదనకు సీఎం జగన్ ఇప్పటికే సూచనప్రాయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం.
విక్రమ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే ముందు సీఎం కాస్త కసరత్తు కూడా చేశారు. అతడి కుటుంబ సభ్యులు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలతో పలు దఫాలుగా సంప్రదింపులు జరిపారు. వారి అభిప్రాయం తీసుకున్న తరువాతే.. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆత్మకూరు నుంచి వైసీపీ తరఫున మేకపాటి విక్రమ్ రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్టుగా అంతా భావిస్తున్నారు.
మేకపాటి విక్రమ్ రెడ్డి స్వయాన దివంగత మంత్రి గౌతంరెడ్డి సోదరుడు.. ఊటీలోని గుడ్ షెఫర్డ్ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఐఐటీ చెన్నైలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. అమెరికాలో కన్‌స్ట్రక్షన్ మేనేజ్మెంట్ లో ఎం.ఎస్ చేశారు. గౌతమ్ రెడ్డి రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత.. వారి కుటుంబ సంస్థ కేఎంసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇక, గౌతమ్ రెడ్డిలాగే విక్రమ్ రెడ్డికి కూడా మృదువుగా మాట్లాడతారనే పేరు ఉంది.
ఏపీలో ఉన్న రాజకీయ సంప్రదాయం ప్రకరాం. ఎవరైనా పదవిలో ఉండి చనిపోతే.. దాని ద్వారా వచ్చే ఉప ఎన్నికల్లో వారి బంధువులు ఎన్నికల్లో పోటీ చేస్తే.. ఏకగ్రీవంగా ఎన్నికల జరిగేలా చూడడం ఆనవాయితీ.. ఇతర పక్షాలు సైతం అందుకు సహకరిస్తాయి. అయితే ఈ సారి ఆత్మకూరులో ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం కనిపించడం లేదు. అనూహ్యంగా మేకపాటికి పోటీదారు బయటకొచ్చారు.
ఇదీ చదవండి : సీఎం సొంత జిల్లాలో సచివాలయానికి తాళాలు... ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..
ఆయన మేకపాటి రాజమోహన్ రెడ్డికి స్వయానా మేనల్లుడు. పేరు బిజివేముల రవీంద్రా రెడ్డి. అయితే ఆయన ఇప్పటి వరకూ ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో తెలియదు కానీ.. తాను మాత్రం బీజేపీ నేతను అని చెప్పుకుంటున్నారు. మేకపాటి కుటుంబ సభ్యులపై ఆత్మకూరు ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కుదిరితే బీజేపీ టికెట్ పై పోటీ చేస్తాను, లేకపోతే ఇండిపెండెంట్ గా అయినా బరిలో దిగుతానన్నారు.మరోవైపు ఆత్మకూరులో త్వరలో జరిగే ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, Nellore Dist, Ycp