YSRCP ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramnarayana Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు ప్రాణహాని ఉంది. నన్ను ఈ భూమి మీద లేకుండా చేయాలని కొందరు కుట్ర పన్నుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కొద్దిసేపటి క్రితం కోటంరెడ్డి ఆడియో లీక్ రగిల్చిన వేడి చల్లారక ముందే ఆనం ఈ బాంబ్ పేల్చారు. ఈ ఇద్దరి వ్యవహారం ఇప్పుడు నెల్లూరు రాజకీయాల్లో సంచలనంగా మారింది.
'నాకు ప్రాణహాని ఉంది. నా సెక్యూరిటీ తగ్గించారు. 2 ఏళ్ల నుంచి నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. నా రెండు ఫోన్లు ట్యాప్ చేశారు. నా PA ఫోన్ కూడా ట్యాప్ చేశారు. నేను యాప్ లతో ఫోన్ మాట్లాడాల్సి వస్తుంది. ఈ వేధింపులు..సాధింపులు కొత్తేమి కాదు. నన్ను ఈ భూమి మీద లేకుండా చేయాలని చూస్తున్నారు. నాకు ఎలాంటి నేర చరిత్ర లేదు. హత్యా రాజకీయాలు చేయలేదు. నేను సీబీఐ కేసుల్లో హైదరాబాద్ చుట్టూ తిరగడం లేదని' ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramnarayana Reddy) వ్యాఖ్యానించారు.
అయితే మా ఎమ్మెల్యేల ఫోన్లు మేమే ఎందుకు ట్యాప్ చేస్తామని మాజీ మంత్రి, నెల్లూరు కోర్డినేటర్ బాలినేని ప్రశ్నించారు. ఫోన్ ట్యాప్ అయ్యాయని ఇప్పుడు చెబుతున్నారు. ట్యాప్ అయినప్పుడు సీఎంకు లేదా సీఎంవో ఆఫీస్ లో చెప్పుండాల్సింది. మనసులో ఏదో పెట్టుకొని ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఇక శ్రీధర్ రెడ్డి ఇలా చేయడం సరికాదు. కాంగ్రెస్ లో ఆయనకు ఎలాంటి పదవులు ఇవ్వలేదు. సీఎం జగన్ ఆయనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారని బాలినేని చెప్పుకొచ్చారు. నెల్లూరు జిల్లాలో మంత్రి పదవులు ఆశించే నాయకులూ ఉన్నారు. ఎవరెవరు టీడీపీతో టచ్ లో ఉన్నారో డేటా అంతా సీఎం దగ్గర ఉంది. టీడీపిలోకి వెళితే మంత్రి పదవి అవకాశం ఉంటుందని అనుకుంటున్నారని అన్నారు. ఆనం వ్యవహారంతో వేంకటగిరి ఇంఛార్జి బాధ్యతలు మరొకరికి ఇవ్వాల్సి వచ్చిందన్నారు.
కాగా గత కొంతకాలంగా నెల్లూరు జిల్లా నాయకులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆనంపై సర్కార్ చర్యలు తీసుకుంది. ఆనంను నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించగా..ఇక గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా పాల్గొనోద్దని స్పష్టం చేసింది. అయితే వీరు టీడీపీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anam Ramanarayana Reddy, Andhrapradesh, Ap, AP News, Ycp