Home /News /andhra-pradesh /

NELLORE 5 ACRE GRAVEYARD KABJA IN NELLORE DISTRICT AS LOCALS MADE ALLEGATIONS ON YCP MLA FULL DETAILS HERE PRN PSN NJ

Nellore: శ్మశానాల కబ్జా వెనక ఆ ఎమ్మెల్యే హస్తముందా..? కబ్జారాయుళ్లు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం..!

భూ

భూ వివాదంలో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి

Nellore: స్థలం క‌న‌బ‌డితే చాలు... క‌బ్జారాయుళ్ళు క‌న్నేస్తారు…ఎంతకైనా తెగించి ఆ స్థలాన్ని కాజేయాలని చూస్తారు. ఎంత‌లా అంటే శ్మశాన‌వాటికకు చెందిన స్థలాన్ని కూడా కాజేందుకు వెన‌కాడరు. అలాంటి ఘ‌ట‌నే ఒకటి నెల్లూరు జిల్లాలో చర్చనీయాంశమైంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nellore, India
    Polaa Sudha, News18, Nellore స్థలం క‌న‌బ‌డితే చాలు.. క‌బ్జారాయుళ్ళు క‌న్నేస్తారు…ఎంతకైనా తెగించి ఆ స్థలాన్ని కాజేయాలని చూస్తారు. ఎంత‌లా అంటే శ్మశాన‌వాటికకు చెందిన స్థలాన్ని కూడా కాజేందుకు వెన‌కాడరు. అలాంటి ఘ‌ట‌నే ఒకటి నెల్లూరు జిల్లాలో చర్చనీయాంశమైంది. ప్రభుత్వం శ్మశానం కోసం కేటాయించిన భూమిలో కొంద‌రు అక్రమార్కులు పాగా వేసేందుకు ప్రయ‌త్నించారు…అది కూడా ఎమ్మెల్యే పేరు చెప్పి మరి బెదిరింపులకు తెగబడ్డారు. అయితే స్థానిక గ్రామ‌స్తులు వీరిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు జిల్లా (Nellore District) విడ‌వ‌లూరు మండ‌లం తుమ్మగుంట గ్రామంలో ప్రభుత్వ భూమిని కొంత‌మంది ఆక్రమించారు. అయితే కోవూరు ఎమ్మెల్యే ప్రస‌న్నకుమార్ రెడ్డి చొర‌వ‌తో క‌బ్జాదారుల చేతిలో నుంచి ఆ స్థలానికి విముక్తి ల‌భించింది. ఆ స్థలాన్ని మూడు గ్రామాల‌కు ఉప‌యోగ‌ప‌డేలా ఎమ్మెల్యే చ‌ర్యలు కూడా తీసుకున్నారు. ఇక్కడ శ్మశాన వాటిక‌ను ఏర్పాటు చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. దీంతో ఆ మూడు గ్రామ‌ల ప్రజ‌లు హ‌ర్షం వ్యక్తం చేశారు. ఇక సమస్య ఏమి లేదు అనుకున్నారు. కానీ, ఇంతలో.. ఇప్పుడు మళ్లీ క‌బ్జారాయుళ్ళ ఈ ఐదు ఎక‌రాల భూమిని సొంతం చేసుకునేందుకు ప్రయ‌త్నాలు మొద‌లుపెట్టారు. ఆ ఖాళీ ప్రదేశాన్ని కొందరు వ్యక్తులు చదును చేసేందుకు వ‌చ్చారు. వ‌చ్చిందే త‌డ‌వుగా ప‌ని కూడా మొద‌లుపెట్టారు.

    ఇది చదవండి: భర్తకు దగ్గరుండి రెండో పెళ్లి చేసిన భార్య.. ముగ్గురూ కలిసి కాపురం..! మరో ట్విస్ట్ ఏంటంటే..!

    స‌మాచారం అందుకున్న గ్రామ‌స్తులు అక్కడికి చేరుకుని వారిని నిల‌దీశారు. అయితే వారు చెప్పిన సమాధానం విని గ్రామస్తులు ఖంగుతిన్నారు. వాళ్లు ఎమ్మెల్యే పేరు చెప్పి బెదిరింపుల‌కు దిగడంతో.. ఇరువ‌ర్గాల మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. దీనిపై స్థానికులు మాట్లాడుతూ గ‌తంలో శ్మశానం కోసం మూడు గ్రామాల వారికి ఉప‌యోగ‌ప‌డేలా ఎమ్మెల్యే స్థలాన్ని కేటాయించార‌ని.. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే పేరు చెప్పి బెదిరింపుల‌కు దిగుతున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరకు శ్మశానాన్ని కూడా వదలక పోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే దీనిపై స్పందించి శ్మశాన స్థలాన్ని కాపాడాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే కూడా ఈ విష‌యంలో చొరవ తీసుకోవాల‌ని గ్రామస్తులు కోరుతున్నారు. లేదంటే అందరం కలిసి ఆందోళన చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Local News, Nellore

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు