మళ్లీ తెరపైకి శ్రీదేవి వివాదం... స్పందించిన NCW...

కాస్త ఆలస్యంగానైనా... జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. శ్రీదేవి కంప్లైంట్‌పై రిపోర్ట్ ఇమ్మని ఆదేశించింది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 13, 2019, 1:54 PM IST
మళ్లీ తెరపైకి శ్రీదేవి వివాదం... స్పందించిన NCW...
ఎమ్మెల్యే శ్రీదేవి (File)
Krishna Kumar N | news18-telugu
Updated: September 13, 2019, 1:54 PM IST
Amaravati : వైసీపీ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మరోసారి తెరపైకి వచ్చారు. తనపై కొందరు కుల పరమైన, లింగ వివక్ష చూపుతూ కామెంట్లు చేశారని ఆమె ఆరోపించారు. దీనిపై జాతీయ మహిళా కమిషన్ (NCW) స్పందించింది. ఆమె ఇచ్చిన కంప్లైంట్‌పై దర్యాప్తు జరిపి... తమకు రిపోర్ట్ ఇవ్వాలని AP GGP గౌతమ్ సవాంగ్‌ని ఆదేశించింది. గుంటూరు జిల్లా... అనంతవరంలో వినాయక చవితి రోజున పూజలు చేస్తుంటే... తనపై వివక్ష చూపించిన కొందరు వ్యక్తులు... ఇష్టమొచ్చినట్లు అసభ్యకరంగా మాట్లాడారని ఆమె గురువారం జాతీయ మహిళా కమిషన్‌ను కలిసి కంప్లైంట్ ఇచ్చారు. ఇతర కేసుల్లో బిజీగా ఉన్న NCW... ఇవాళ స్పందించింది. ఆమెను అలా ఎలా తిడతారంటూ ఫైర్ అయిన మహిళా కమిషన్... డీజీపీని రిపోర్ట్ ఇమ్మని కోరడం సంచలనమైంది.

First published: September 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...