ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు జాతీయ మహిళా కమిషన్ నోటీసలు జారీ చేసింది. రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించడాన్ని నిరసిస్తూ కొందరు మహిళా రైతులు ఆందోళన చేపట్టారు. అయితే, నిరసన తెలుపుతున్న మహిళా రైతులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, వారిని కొట్టడంతో పాటు దుర్భాషలాడారంటూ జాతీయ మహిళా కమిషన్ దృష్టికి వచ్చింది. దీన్ని కమిషన్ సుమోటోగా తీసుకుంది. దీంతోపాటు పలు టీవీ ఛానళ్లలో వచ్చిన వార్తలు కూడా పోలీసుల దురుసు ప్రవర్తనను తెలియజేస్తున్నాయని కమిషన్ అభిప్రాయపడింది. ఈ ఘటనను ఖండించిన జాతీయ మహిళా కమిషన్... ఈ ఘటనకు సంబంధించి పోలీసుల ప్రవర్తనపై సమగ్రమైన నివేదిక ఇవ్వాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.
ఏపీ డీజీపీకి నోటీసులు పంపినట్టు జాతీయ మహిళా కమిషన్ జారీ చేసిన ప్రకటన
‘ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు నోటీసులు జారీ చేశాం. సమగ్రమైన నివేదిక ఇవ్వాలని కోరాం. మహిళా రైతుల పరిరక్షణకు జాతీయ మహిళా కమిషన్ కృషి చేస్తుంది. వారితో పోలీసులు ప్రవర్తించిన విధానం ఏమాత్రం సమర్థనీయం కాదు.’ అని జాతీయ మహిళా కమిషన్ గౌరవ చైర్ పర్సన్ రేఖా శర్మ ఓ ప్రకటనలో తెలిపారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.