విశాఖలో జగన్‌కు బ్రేక్ వార్తలపై నేవీ క్లారిటీ...

విశాఖ రుషికొండలో ఉన్న మిలీనియం టవర్స్ లో సీఎం క్యాంప్ ఆఫీస్‌పై నేవీ అభ్యంతరం తెలిపిందని వస్తున్న వార్తలను తూర్పు నావికాదళం ఖండించింది.

news18-telugu
Updated: February 22, 2020, 8:11 PM IST
విశాఖలో జగన్‌కు బ్రేక్ వార్తలపై నేవీ క్లారిటీ...
నేవీ డే సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి
  • Share this:
విశాఖ రుషికొండలో ఉన్న మిలీనియం టవర్స్ లో సీఎం క్యాంప్ ఆఫీస్‌పై నేవీ అభ్యంతరం తెలిపిందని వస్తున్న వార్తలను తూర్పు నావికాదళం ఖండించింది. అటువంటి అభ్యంతరాలు ఏమి వ్యక్తం చేయలేదని నేవీ వివరణ ఇచ్చింది. ‘మిలీనియం టవర్స్‌లో సచివాలయం పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ప్రతిపాదన రాలేదు. అందుకు మేం అభ్యంతరం కూడా తెలపలేదు. ఆ పేరుతో మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం.’ అని కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.

రక్షణ శాఖ జారీ చేసిన ప్రకటన


ఈ రోజు డెక్కన్ క్రానికల్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. విశాఖలోని రుషికొండ వద్ద మిలీనియం టవర్స్ ఉన్నాయి. దానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో INS కళింగ ఉంది. తూర్పు నావికాదళానికి కేంద్రమైన విశాఖలో ఈ ఐఎన్ఎస్ కళింగ కీలక స్థావరం. 734 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఉన్న ఈ ఐఎన్ఎస్ కళింగలో అత్యాధునిక ఆయుధాలను తయారు చేస్తోంది. సాంకేతికంగా అత్యున్నత స్థాయిగల మిసైల్స్‌కు ఈ ప్రాంగణం ఆధారం. అలాంటి కీలక ప్రాంతానికి దగ్గరగా ఉన్న మిలీనియం టవర్స్ వద్ద జనసంచారాన్ని పెంచుకుంటూ పోతే అది భద్రతా పరమైన సమస్యలకు దారి తీస్తుందంటూ నేవీ అభ్యంతరాన్ని లేవనెత్తినట్టు పేర్కొంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: February 22, 2020, 8:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading