హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఎల్జీ పాలిమర్స్ కేసులో ఎన్జీటీ కీలక ఆదేశాలు

ఎల్జీ పాలిమర్స్ కేసులో ఎన్జీటీ కీలక ఆదేశాలు

గ్యాస్ లీకేజీ ఘటన కేసును సుమోటోగా తీసుకోవడంపై ఎల్జీ పాలిమర్స్ సంస్థ అభ్యంతరం చెప్పడంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

గ్యాస్ లీకేజీ ఘటన కేసును సుమోటోగా తీసుకోవడంపై ఎల్జీ పాలిమర్స్ సంస్థ అభ్యంతరం చెప్పడంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

గ్యాస్ లీకేజీ ఘటన కేసును సుమోటోగా తీసుకోవడంపై ఎల్జీ పాలిమర్స్ సంస్థ అభ్యంతరం చెప్పడంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

  ఎల్జీ పాలిమర్స్ కేసులో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కీలక ఆదేశాలు ఇచ్చింది. కలెక్టర్ వద్ద ఉంచిన రూ. 50 కోట్లు పర్యావరణ పునరుద్ధరణ, బాధితులకు పరిహారం కోసం వినియోగించాలని ఎన్జీటి స్పష్టం చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఒకొక్కరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి విశాఖ కలెక్టర్ సహా మరో ఇద్దరితో పర్యావరణ పునరుద్దర ప్రణాళిక కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు లిఖితపూర్వకంగా ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చింది. రెండు నెలల్లో కమిటీ పునరుద్ధర ప్రణాళిక ఇవ్వాలని పేర్కొంది. కేంద్ర పర్యావరణ శాఖ ఈ కమిటీకి నోడల్ ఏజెన్సీగా వ్యవహరించాలని స్పష్టం చేసింది.

  పరిహారం ఎంత ఇవ్వాలన్నది నిర్ణయించడానికి మరో కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, నీరి సంస్థ నుంచి ప్రతినిధులు ఉండనున్నారు. కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి రెండు వారాల్లో ఈ కమిటీ ఏర్పాటు చేయాలని ఎన్జీటీ ఆదేశించింది. రెండు నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. అనుమతులు లేకుండా సంస్థ నడవడం ద్వారా చట్టాలు వైఫల్యం చెందడానికి కారణమైన వ్యక్తులను గుర్తించి రాష్ట్ర సీఎస్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. తీసుకున్న చర్యలతో రెండు నెలల్లో ఎన్జీటీకి నివేదిక సమర్పించాలని కోరింది. ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా కంపెనీ తిరిగి ప్రారంభం కాకుడదని ఆదేశించింది.

  చట్టబద్ధమైన అనుమతులు వచ్చాక ఎన్జీటీయే సంస్థ తిరిగి ప్రారంభించడానికి అనుమతి ఇస్తుందని తెలిపింది. ప్రమాదక రసాయనాలతో కూడిన ప్లాంట్లలో భవిష్యత్ లో పర్యావరణ నిబంధనలు తనిఖీ చేయడానికి, నిరోధించడానికి కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆ కమిటీ తనిఖీలు చేసి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని సూచించింది. సుమోటోగా కేసు తీసుకోవడంపై ఎల్జీ పాలిమర్స్ సంస్థ అభ్యంతరం చెప్పడంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

  సుమోటోగా కేసు తీసుకునే అధికారం జాతీయ హరిత ట్రైబ్యూనల్ కు ఉందని స్పష్టం చేసింది. పర్యావరణానికి హాని కలిగి చర్యలు జరిగినప్పుడు ఎన్జీటీ చేతులు కట్టుకొని కూర్చోదని ఘాటు వ్యాఖ్యనించింది. విచక్షణాధికారాలకు లోబడే సుమోటో గా కేసు తీసుకున్నట్లు స్పష్టం చేసిన ఎన్జీటీ. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే ఎన్జీటీ తీర్పులను ఇస్తుందని ఎన్జీటీ వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించిన విచారణను నవంబర్ 3కి తదుపరి విచారణ వాయిదా వేసింది.

  First published:

  Tags: Andhra Pradesh, Lg polymers

  ఉత్తమ కథలు