విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై విచారణ మొదలుపెట్టిన ఎన్జీటీ(నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్) ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. ముందుగా జిల్లా కలెక్టర్ దగ్గర కంపెనీ రూ. 50 కోట్లు డిపాజిట్ చేయాలని కోరింది. ఈ ఘటనపై ఇప్పటికే ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో పాటు సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, కేంద్ర పర్యావరణ శాఖకు ఎన్జీటీ నోటీసులు జారీ చేసింది. ఘటనపై పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఘటనపై విచారణకు ఎన్జీటీ ఐదుగురు సభ్యులతో కూడిన నిజనిర్ధారణ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు.
ప్రమాదం జరిగిన తీరు, ఘటనకు బాధ్యులైన వ్యక్తులు, జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంతో పాటు పర్యావరణానికి జరిగిన నష్టంపై ఈ కమిటీ నివేదిక రూపొందించనుంది. బాధితులకు ఏ విధంగా పరిహారం అందించాలనే దానిపై కూడా ఈ నివేదికలో సూచనలు చేయనున్నారు. ఈ ఘటన కారణంగా ఇప్పటివరకు 11 మంది చనిపోగా... అనేక మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.