హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nara Lokesh : ఆ దర్శకుడి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకున్న నారా లోకేష్.. కానీ అలా మిస్ అయింది..

Nara Lokesh : ఆ దర్శకుడి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకున్న నారా లోకేష్.. కానీ అలా మిస్ అయింది..

నారా లోకేష్ (File/Photo)

నారా లోకేష్ (File/Photo)

Nara Lokesh As Hero : ఆ దర్శకుడి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకున్న నారా లోకేష్.. కానీ హీరో అవ్వాలనుకున్న నారా లోకేష్ కల అలా మిస్ అయింది. వివరాల్లోకి వెళితే..

Nara Lokesh : ఆ దర్శకుడి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇవ్వాలనుకున్న నారా లోకేష్.. కానీ హీరో అవ్వాలనుకున్న నారా లోకేష్ కల అలా మిస్ అయింది. వివరాల్లోకి వెళితే.. నారా లోకేష్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏకైక తనయుడు. అంతేకాదు తెలుగు దేశం వ్యవస్థాపకులు.. ఏపీ మాజీ సీఎం నందమూరి తారకరామారావు మనవడు. అంతేకాదు నందమూరి నట సింహా బాలకృష్ణకు స్వయానా మేనల్లుడు. ఆ తర్వాత బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణిని నారా లోకేష్ పెళ్లి చేసుకొని బాలయ్య ఇంటల్లుడైన సంగతి తెలిసిందే కదా. సినిమాలు, రాజకీయాలు కలగలసిన కుటుంబం కాబట్టి.. స్వతహాగా నారా లోకేష్ అడుగులు సినిమాల వైపు మళ్లాయి. అందులో భాగంగా  హీరో అవ్వాలనున్నారు. మన దగ్గర సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది.

సినిమాల్లో  నటించిన ఎమ్జీఆర్, ఎన్టీఆర్, జయలలిత వంటి వారు ఏకంగా ముఖ్యమంత్రి పీఠాలు అధిరోహించారు. అలాగే రాజకీయాల్లో ఉన్న దేవగౌడ ప్యామిలీ నుంచి నిఖిల్ గౌడ, కరుణానిధి కుటుంబం నుంచి ఉదయనిధి స్టాలిన్ హీరోలుగా లక్ పరీక్షించుకున్నారు. వీళ్లందరి కంటే ముందు నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. అప్పట్లో దానికి సంబంధించిన పోస్టర్స్ కూడా కొన్ని పత్రికల్లో హల్‌చల్ చేసాయి.

తేజ దర్శకత్వంలో నారా లోకేష్ సినీ ఎంట్రీ

అంతేకాదు నటనలో, డాన్సుల్లో శిక్షణ తీసుకున్నారు. అంతేకాదు తేజ దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘జయం’ సినిమాను నారా లోకేష్ హీరోగా తెరకెక్కిద్దామనుకున్నారు. అంతేకాదు తేజ దర్శకత్వంలో నారా లోకేష్ అంటూ పోస్టర్స్ కూడా విడుదల చేశారు. అదే సమయంలో ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు తారకరత్న కూడా హీరోలుగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. మరోవైపు బాలయ్య .. కొంత మంది జ్యోతిష్కులతో  లోకేష్ జాతకం చూపించడం..  వాళ్లు లోకేస్  హీరోగా సక్సెస్ అందుకోవడం అంత తేలికకాదని  చెప్పడం. పైగా సినిమాల్లో ఫెయిల్ అయితే.. ఆ ఇంపాక్ట్ రాజకీయాలపై పడుతుందని చంద్రబాబు తన తనయుడు లోకేష్ సినీ ఎంట్రీపై బ్రేకులు వేసేలా చేసాయి. ఒకవేళ లోకేష్ సినీ ఎంట్రీ ఇస్తే ఎలా ఉండేదో కానీ..  ఆ తర్వాత రాజకీయాల్లో కొనసాగారు. అంతేకాదు తండ్రి చంద్రబాబు క్యాబినేట్‌లో మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే కదా. ిక నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదిగితే.. కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా పర్వాలేదనిపిస్తున్నారు. అదే సమయంలో ఒకేసారి తొమ్మిది సినిమాలను స్టార్ట్ చేసినా తారకరత్న.. హీరోగా మాత్రం సక్సెస్ అందుకోలేకపోయిన సంగతి తెలిసిందే కదా.

ఇవి కూడా చదవండి..

Dasari Arun Kumar : దాసరి రెండో కుమారుడు అరుణ్ పై అట్రాసిటీ కేసు..

Chiranjeevi : లూసీఫర్, వేదాలం కాకుండా... చిరంజీవి ఖాతాలో మరో సూపర్ హిట్ రీమేక్..


Vanitha Vijaykumar : చిరంజీవి ఫ్యామిలీతో వనిత విజయకుమార్ అనుబంధం.. ఆలీతో సరదగా సంచలన వ్యాఖ్యలు..


Bigg Boss 5 Telugu: కళ్ల ముందు భారీ రెమ్యునరేషన్ .. ఐనా బిగ్‌బాస్ ఆఫర్ రిజెక్ట్ చేసిన ఫేమస్ సింగర్, యాంకర్..


Tollywood Family Multistarers: టాలీవుడ్ ఫ్యామిలీ మల్టీస్టారర్స్.. మెగా, నందమూరి ఫ్యామిలీ నుంచి అక్కినేని, దగ్గుబాటి వరకు..

First published:

Tags: Andhra Pradesh, Nara Lokesh, Tollywood