Home /News /andhra-pradesh /

NARA LOKESH TWEETS ABOUT DEVA KATTA SAI DHARAM TEJ REPUBLIC MOVIE SU

Nara Lokesh - Republic Movie: రిపబ్లిక్ మూవీపై నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్.. దేవ కట్టా రియాక్షన్ ఇదే..

రిపబ్లిక్ మూవీపై నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్..

రిపబ్లిక్ మూవీపై నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్..

అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రిపబ్లిక్ మూవీ మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా రిపబ్లిక్ మూవీ గురించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) ట్విట్టర్‌లో స్పందించారు.

    సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) హీరోగా దేవకట్ట (Deva Katta) దర్శకత్వంలో తెరకెక్కిన రిపబ్లిక్ చిత్రం (Republic Movie) అక్టోబర్ 1వ తేదీన థియోటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. పలువురు సినీ సెలబ్రిటీలు సినిమా బాగుందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే తాజాగా రిపబ్లిక్ మూవీ గురించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) ట్విట్టర్‌లో స్పందించారు. రిపబ్లిక్ సినిమా గురించి మంచి రివ్యూలు వింటున్నానంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.. త్వరలోనే సినిమా చూస్తానని చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని లోకేశ్ ఆకాంక్షించారు.

    ‘రిపబ్లిక్ మూవీ గురించి చాలా మంది రివ్యూలు వింటున్నాను. దేవకట్ట, సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని తర్వలోనే చూస్తాను. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాను’అని లోకేష్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై స్పందించిన దేవకట్ట.. లోకేష్‌కు థాంక్యూ చెప్పారు. రిపబ్లిక్ సినిమా చూసిన తర్వాత ఆయన భావాలను పంచుకోవాలని కోరారు.

    Sai Tej Republic movie review: ‘రిపబ్లిక్’ మూవీ రివ్యూ.. అవినీతి సమాజంపై సాయి ధరమ్ తేజ్ సంధించిన ప్రశ్న..

    ఇక, ‘ప్రస్థానం’ లాంటి సినిమా తర్వాత దేవా కట్టా నుంచి మళ్లీ ఆ స్థాయి సినిమా రాలేదు. మధ్యలో కొన్ని సినిమాలు చేసినా కూడా కనీసం వచ్చినట్లు కూడా ప్రేక్షకులకు తెలియదు. ఇలాంటి సమయంలో వరస విజయాలతో జోరు మీదున్న సాయి ధరమ్ తేజ్‌తో ఈయన చేసిన ప్రయత్నం రిపబ్లిక్. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ కలెక్టర్‌గా నటించారు. ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్య కృష్ణలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రం విడుదలకు కొద్ది రోజుల ముందు హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్‌ జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.







    అయితే రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అథితిగా విచ్చేసిన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన ప్రసంగంలో సినిమా ఇండస్ట్రీ సమస్యలపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గురించి ప్రస్తావిస్తూ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీనికి వైసీపీ నేతలు ఘాటైన వ్యాఖ్యలు , పవన్ కూడా తనదైన శైలిలో ట్విట్టర్‌లో పోస్ట్‌లు చేయడం గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్ మారాయి.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Deva Katta, Nara Lokesh, Republic Movie, Sai Dharam Tej

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు