Home /News /andhra-pradesh /

NARA LOKESH SLAMS AP CM JAGAN MOHAN REDDY ON GRAMA VOLUNTEER CORRUPTION MK

సీఎం జగన్ ఒక స్కామ్ స్టార్...గ్రామ వాలంటీర్ల నియామకాలపై లోకేష్ ఆరోపణలు...

నారా లోకేష్ (ఫైల్)

నారా లోకేష్ (ఫైల్)

గ్రామ వాలంటీర్ల స్కీమ్‌ అనేది కుట్ర అని దాని అసలు సంగతి బయటపడిందని, లోకేష్ తన ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. వైసీపీ సోషల్ మీడియా వర్కర్ల సమావేశాన్ని ఉద్దేశించి ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ప్రసంగం ఉంది.

    ఏపీ గ్రామ వాలంటీర్ల స్కీమ్‌పై తెలుగు దేశం నేత, మాజీ మంత్రి నారా లోకేష్ సంచలనాత్మక ట్వీట్స్ చేశారు. ఏపీ సీఎం జగన్‌ను స్కామ్ స్టార్‌ అంటూ తన ట్వీట్ లో ఆయన విమర్శించారు. ముఖ్యంగా గ్రామ వాలంటీర్ల స్కీమ్‌ అనేది కుట్ర అని దాని అసలు సంగతి బయటపడిందని, లోకేష్ తన ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో వైసీపీ సోషల్ మీడియా వర్కర్ల సమావేశాన్ని ఉద్దేశించి ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ప్రసంగం ఉంది. అందులో వైసీపీకి పనిచేసిన సోషల్ మీడియా వర్కర్లకు ప్రభుత్వం నుంచి పరోక్షంగా సహాయం అందిస్తామనే అర్థం వచ్చేలా విజయసాయి కామెంట్స్ ఉన్నాయని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లోకేష్ ఈ పోస్ట్ చేశాడు. గ్రామ వాలంటీర్ల స్కామ్‌తో జగన్ రూ.12 కోట్ల ప్రజాధన దోపిడీకి తెరలేపారని లోకేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ముఖ్యంగా వాలంటీర్ల నియామకంలో వైసీపీ కార్యకర్తకే పెద్ద పీట వేసినట్లు లోకేష్ విమర్శించారు.

    Published by:Krishna Adithya
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Nara Lokesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు