హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nara Lokesh: ఎవరి ట్రాప్ లో పడొద్దంటూ సూచన.. చిరంజీవి, బాలకృష్ణకు నారా లోకేష్ శుభాకాంక్షలు

Nara Lokesh: ఎవరి ట్రాప్ లో పడొద్దంటూ సూచన.. చిరంజీవి, బాలకృష్ణకు నారా లోకేష్ శుభాకాంక్షలు

 వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్యపై లోకేష్ స్పందన

వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్యపై లోకేష్ స్పందన

Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. టాలీవుడ్ స్టార్స్ బాలయ్య, చిరులకు కీలక సూచన చేశారు.. మీరు ఎవరి ట్రాప్ లోనూ పడొద్దని సూచించారు.. రెండు పెద్ద సినిమాలో సంక్రాంతి బరిలో దిగుతున్న వారిద్దరికి శుభాకాంక్షలు తెలిపారు.. ఇంకా ఆయన ఏమన్నారంటే..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Nara Lokesh: మెగాస్టర్ చిరంజీవి (Megastar Chiranjeevi) కి వైసీపీ గ్యాప్ పెరుగుతోంది. తాజా పరిస్థితులు చూస్తే అలేనే అనిపిస్తోంది. మంత్రి రోజా (Minister Roja) సైతం చిరంజీవిపై విమర్శలు చేయడం.. దానికి నాగబాబు (Nagababu) స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో రాజకీయ వేడెక్కింది. తాజాగా రోజా వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి సైతం ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. రోజాను ఎక్కడా తిట్టకపోయినా.. తనకు సంస్కారం ఉంది అంటూ.. రోజా సైలెంట్ కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు ఇటీవల మాట్లాడిన ఆయన.. తన తమ్ముడిని తిడుతూ.. తనను వాళ్ల ఫంక్షన్లకు పిలుస్తారని.. కానీ అలా వెళ్లినప్పుడు తనకు బాధ కలుగుతుంది అన్నారు. ఈ వ్యాఖ్యలు కూడా వైసీపీ నేతల గురించి చెప్పినవే.. ఇలా రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరుగుతున్నట్టు సంకేతాలు అందుతున్న సమయంలో.. వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆ దూరం నిజమనే భావన కలిగిచింది. ఎందుకంటే అనుమతికి చివరి నిమిషం వరకు వేచి చూసేలా చేసింది ప్రభుత్వం.. అంతేకాదు ఫంక్షన్ ను బీచ్ రోడ్ లో ఏర్పాటు చేయాలని భావిస్తే.. దాన్ని ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ కు మార్చారు.

ఇదే సమయంలో మెగా క్యాంప్ కు దగ్గర అవుతోంది టీడీపీ . ఇప్పటికే పవన్ తో పొత్తు దాదాపు ఖరారైనట్టే.. ఈ నేపథ్యంలో చిరంజీవిని మరింత ఓన్ చేసుకునే ప్రయత్నం చేశారు నారా లోకేష్ .. తాజాగా ఇద్దరు సినిమాలు రిలీజ్ అవుతున్న సందర్భంగా ఇటు మెగాస్టార్ చిరంజీవికి.. అటు మామయ్య నందమూరి బాలయ్యకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెబుతూనే.. కొన్ని కీలక సూచనలు చేశారు.

చిరంజీవి , బాలకృష్ణ ఇద్దరూ ఎవరి ట్రాప్‌లోపడొద్దంటూ ట్వీట్‌ చేశారు. గాడ్ అఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ , బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సంక్రాంతి కానుక ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వీరసింహారెడ్డి’ గురువారం (జనవరి 12, 2023) విడుదల కానుంది. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ‘వీరసింహారెడ్డి’ ఆల్బమ్ హిట్ అయ్యింది.

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి కాంబోలో రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చదవండి : ఎవరి ట్రాప్ లో పడొద్దంటూ సూచన.. చిరంజీవి, బాలకృష్ణకు నారా లోకేష్ శుభాకాంక్షలు

ఈ రెండు సినిమాలను ఉద్దేశిస్తూ.. చిరంజీవి, బాలకృష్ణకు శుభాకాంక్షలు చెబుతూ లోకేష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. బాలకృష్ణ మూవీ వీర సింహారెడ్డి, చిరంజీవి సినిమా వాల్తేర్ వీరయ్య సినిమాలు విజయవంతం కావాలని లోకేష్ ఆకాంక్షించారు. కోట్లాది ప్రేక్షకులతో పాటు తాను కూడా సినిమా చూడటానికి ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నానని లోకేష్ పేర్కొన్నారు. అయితే సినిమాల ముసుగులో హీరోల కులాలతో గొడవలు చేయడానికి ఒక గ్యాంగ్ రెడీగా ఉందంటూ పేర్కొన్నారు. ఒక కులాన్ని అడ్డుపెట్టుకుని మరో కులంపై విష ప్రచారం చేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఇలాంటి ట్రాప్‌లో ఎవరు పడొద్దంటూ సూచించారు. అధికార పార్టీ కుతంత్రాలను తిప్పికొడదాం.. మన అందరిదీ ఒకటే కులం.. అని చాటి చెబుదాం అంటూ లోకేష్ కీలక సూచలు చేశారు.

First published:

Tags: Andhra Pradesh, Megstar chiranjeevi, Nandamuri balakrishna, Nara Lokesh, Valteru Veerayya Movie, Veera Simha Reddy

ఉత్తమ కథలు