NARA LOKESH SECURITY REDUCED TO Y CATEGORY TO X CATEGORY AK
టీడీపీకి మరో షాక్... లోకేశ్ భద్రత కుదింపు
ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ టీడీపీ నినాదమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేశ్ అన్నారు. న్యాయస్థానాల్లో ప్రజల ఆకాంక్షలకు న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజా రాజధాని అమరావతిని పరిరక్షించుకుని తీరుతామని తెలిపారు.
నారా లోకేశ్ భద్రతను కుదిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మాజీమంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భద్రతను ఏపీ ప్రభుత్వం కుదించింది. గతంలో జడ్ కేటగిరి నుంచి వై ప్లస్‌కి లోకేశ్ భద్రత కుదించిన ప్రభుత్వం... తాజాగా వై ప్లస్ కేటగిరి నుంచి ఎక్స్ కేటగిరీకి మార్చింది.8 నెలల్లో నారా లోకేశ్ భద్రతను కుదించడం ఇది రెండోసారి. ఉద్దేశ్యపూర్వకంగానే నారా లోకేశ్ భద్రత కుదిస్తున్నారంటూ టీడీపీ ఆరోపిస్తోంది. గత జూన్ నెలలో జెడ్ కేటగిరీ భద్రత ఉన్న లోకేశ్ భద్రత తగ్గించి 2+2 గన్మెన్లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిన చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రతను పూర్తిగా తొలగించారు. తాజాగా లోకేశ్ భద్రతను మరోసారి కుదించారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.