ఇప్పుడేం చెబుతారు ? విశాఖ ప్రమాదంపై నారా లోకేష్

ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం తరువాత జరిగిన సాయినార్ కెమికల్స్, ఇప్పుడు జరిగిన రాంకీ ప్రమాదాలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని నారా లోకేష్ ప్రశ్నించారు.

news18-telugu
Updated: July 14, 2020, 11:51 AM IST
ఇప్పుడేం చెబుతారు ? విశాఖ ప్రమాదంపై నారా లోకేష్
నారా లోకేష్ (File)
  • Share this:
విశాఖ రాంకీ ఫార్మా సిటీలో జరిగిన అగ్ని ప్రమాదంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన సీనియర్ కెమిస్ట్ శ్రీనివాసరావు మృతి పట్ల లోకేష్ సంతాపం తెలిపారు. విశాఖలో వరుస ప్రమాద ఘటనలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తరువాత అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని గతంలో ప్రభుత్వం చెప్పిందని... ఇక మీదట ప్రమాదలు జరగవు అని ప్రభుత్వం, మంత్రులు ప్రకటనలు చేశారని ఆయన గుర్తు చేశారు.

అయితే ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం తరువాత జరిగిన సాయినార్ కెమికల్స్, ఇప్పుడు జరిగిన రాంకీ ప్రమాదాలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని నారా లోకేష్ ప్రశ్నించారు. రాంకీ ఎస్ఈజెడ్ లో 15 రోజుల వ్యవధిలోనే రెండు ప్రమాదాలు జరిగాయని...ఈ ఘటన పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Published by: Kishore Akkaladevi
First published: July 14, 2020, 11:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading