హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nara Lokesh: ఎడ్లబండిని భుజాన మోసిన నారా లోకేష్.. కాడెద్దులా మారడానికి కారణం అదే

Nara Lokesh: ఎడ్లబండిని భుజాన మోసిన నారా లోకేష్.. కాడెద్దులా మారడానికి కారణం అదే

కాడెద్దు మోసిన నారా లోకేష్

కాడెద్దు మోసిన నారా లోకేష్

Nara Lokesh: అధికార పార్టీపై విమర్శల దాడి పెంచిన నారా లోకేష్.. తాజాగా ఎడ్లబండిని భుజాన మోసారు.. ఇతర టీడీపీ నేతలతో కలిసి ఆయన ఎడ్లబండిని భుజాన మోసి.. అసెంబ్లీకి వెళ్లారు.. అయితే ఆయన ఇలా వెళ్లడానికి.. కారణం ఏంటో తెలుసా..?

 • News18 Telugu
 • Last Updated :
 • Guntur, India

  Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా సాగుతున్నాయి. అధికార వైసీపీ (YCP), ప్రధాన ప్రతిపక్షం టీడీపీ (TDP) మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అసెంబ్లీకి వెళ్లకపోయినా.. టీడీపీ నేతల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రోజుకో రూపంలో తెలుగు దేశం (Telugu Desam) నిరసనలు తెలుపుతోంది. ఓ వైపు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆందోళనలు చేస్తుంటే.. బయటన ఇతన టీడీపీ నేతలు.. తెలుగు యువత, తెలుగు రైతుల పేరుతో ఇలా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక మూడో రోజు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో టిడిపి శాసనసభాపక్షం వినూత్న నిరసన చేపట్టింది. వ్యవసాయం, రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ''ఛలో అసెంబ్లీ'' పేరుతో ఆందోళన చేపట్టారు.

  ఈ నిరసన కార్య్రమ్రంలో భాగంగా మందడం నుండి అసెంబ్లీ ప్రాంగణం వరకు ఎడ్లబళ్లపై వెళ్లేందుకు నారా లోకేష్ తో సహా టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయత్నించారు. కానీ వారిని పోలీసులు అక్కడే అడ్డుకున్నారు. ఆ ఎడ్లబండ్లను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయినా టీడీపీ నిరసనలు ఆగలేదు. వెంటనే టిడిపి నాయకులు తుళ్ళూరు పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఎడ్లబండిని బయటకు తెచ్చారు. ఎడ్లకు బదులు టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బండిని లాగుతూ నిరసన తెలిపారు.

  అయితే ఎడ్లను అరెస్టు చేయడంపై నారా లోకేష్ మండిపడ్డారు. పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసిన లోకేష్ వారితో వాగ్వాదానికి దిగారు. అక్కడ నుంచి స్వయంగా లోకేష్, అచ్చెన్నాయుడు , రామానాయుడు, చినరాజప్ప, బుచ్చయ్య చౌదరితో పాటు ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బండిని మోసుకుంటూ అసెంబ్లీ ప్రధాన ద్వారం వరకు వెళ్లారు.

  ఎన్నికల ముందు రైతులకు పలు హామీలు ఇచ్చిన.. జగన్.. అధికారంలో వచ్చిన తరువాత రైతులను అన్ని విధాలా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి రైతాంగ వ్యతిరేక విధానాలను అనుసరిస్తోన్నారని, దీనికి నిరసనగా తాము ఈ ప్రదర్శన చేపట్టామని పేర్కొన్నారు. అమరావతి ప్రాంత రైతులను వైఎస్ జగన్ అణచి వేస్తోన్నారని ధ్వజమెత్తారు. వేలాది ఎకరాలను నాశనం చేశారని ఆరోపించారు.

  ఇదీ చదవండి : పోలవరం ప్రాజెక్టు ఈ దుస్థితికి చంద్రబాబే కారణం.. కేంద్రం నుంచి డబ్బులు రావడం లేదన్న సీఎం జగన్

  అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు. రైతు ద్రోహి జగన్, మోటార్లకు మీటర్లు - రైతుల మెడకు ఉరితాళ్లు అంటూ నినదించారు. ఎమ్మెల్సీలు నారా లోకేష్, బీటెక్ రవి, శాసన సభలో ప్రతిపక్ష ఉప నాయకుడు కింజరాపు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. కాడి మోస్తూ ర్యాలీగా అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Nara Lokesh, TDP

  ఉత్తమ కథలు