హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nara Lokesh: నిలిచిపోయిన యువగళం పాదయాత్ర.. నేడు హైదరాబాద్‌కు లోకేశ్

Nara Lokesh: నిలిచిపోయిన యువగళం పాదయాత్ర.. నేడు హైదరాబాద్‌కు లోకేశ్

నారా లోకేశ్

నారా లోకేశ్

Nara Lokesh: తారకరత్న మరణాన్ని నందమూరి, నారా కుటుంబాలకు జీర్ణించుకోలేకపోతున్నాయి. చంద్రబాబునాయుడు, నారా లోకేష్ విషాదంలో మునిగిపోయారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టీడీపీ నేత నారా లోకేశ్‌ (Nara lokesh) యువగళం (Yuvagalam) పాదయాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. వరుసగా రెండవ రోజు కూడా విరామం ప్రకటించారు. మహాశివరాత్రి సందర్భంగా శనివారం శ్రీకాళహస్తిలో బస చేసిన నారా లోకేశ్.. యువగళం పాదయాత్రకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆదివారం నుంచి తిరిగి యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. కానీ శనివారం రాత్రి నందమూరి తారకరత్న మృ తి చెందడంతో ఆదివారం పాదయాత్రకు కూడా విరామం ప్రకటించారు. ఆదివారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం నుంచి లోకేశ్‌.. హైదరాబాద్‌ (Hyderabad) బయలుదేరి వెళ్లారు. హైదరాబాద్‌లో తారకరత్న అంత్యక్రియలు ముగిశాక.. ఆయన తిరిగి శ్రీకాళహస్తి చేరుకుంటారు. తారకరత్న అంత్యక్రియలు సోమవారం సాయంత్రం ముగిసే అవకాశముంది. ఈనేపథ్యంలో రేపు సాయంత్రం వరకు హైదరాబాద్‌లోనే ఉండనున్నారు లోకేశ్.

Taraka Ratna Passed Away: హీరోగా తారకరత్న వరల్డ్ రికార్డు.. ఒక రోజు 9 సినిమాల ప్రారంభోత్సవం..

తారకరత్న మరణాన్ని నందమూరి, నారా కుటుంబాలకు జీర్ణించుకోలేకపోతున్నాయి. చంద్రబాబునాయుడు, నారా లోకేష్ విషాదంలో మునిగిపోయారు. '' బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించ‌దు. నేనున్నానంటూ నా వెంట న‌డిచిన ఆ అడుగులు చ‌ప్పుడు ఆగిపోయింది. నంద‌మూరి తార‌క‌ర‌త్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువ‌తేజం తార‌క‌ర‌త్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీర‌ని లోటు. నిష్క‌ల్మ‌ష‌మైన నీ ప్రేమ‌, స్నేహ బంధం.. మ‌న బంధుత్వం కంటే గొప్ప‌ది.'' అని భావోద్వేగానికి లోనయ్యారు లోకేశ్.

కాగా, తారకరత్నకు జనవరి 27న గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పాదయాత్రలో బాగానే కనిపించిన తారకరత్న.. కొద్దిదూరం నడిచిన తర్వాత అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు.అక్కడే ఉన్న యువగళం సైనికులు, భద్రతా సిబ్బంది ఆయన్ను హుటాహుటిన కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత... పట్టణంలోని పీఈఎస్‌ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. అదే రోజు అర్ధరాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు. గత 23 రోజులుగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం కన్నమూశారు తారకరత్న.

First published:

Tags: Andhra Pradesh, AP News, Local News, Nara Lokesh

ఉత్తమ కథలు