Home /News /andhra-pradesh /

అచ్చెన్నాయుడి కుటుంబ సభ్యులకు లోకేష్ పరామర్శ.. మేమున్నాం..

అచ్చెన్నాయుడి కుటుంబ సభ్యులకు లోకేష్ పరామర్శ.. మేమున్నాం..

అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న నారా లోకేష్

అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న నారా లోకేష్

చంద్రబాబునాయుడు హయాంలో ఈఎస్ఐ మందుల కొనుగోళ్లకు సంబంధించి రూ.150 కోట్ల అవినీతి జరిగిందని విజిలెన్స్ నివేదిక ఇవ్వడంతో శ్రీకాకుళం జిల్లాలోని అచ్చెన్నాయుడు సొంత ఇంటిలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

    ESI స్కామ్‌లో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి కుటుంబ సభ్యులను నారా లోకేష్ పరామర్శించారు. పార్టీ తరపున అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడకు వెళ్లిన లోకేష్‌కు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అక్కడ ఎర్రన్నాయుడి విగ్రహానికి లోకేష్ పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం అచ్చెన్నాయుడు నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడారు. అచ్చెన్న గురించి ఆందోళన పడవద్దని.. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో లోకేష్ వెంట ఏపీ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహణ్ నాయుడు ఉన్నారు.


    చంద్రబాబునాయుడు హయాంలో ఈఎస్ఐ మందుల కొనుగోళ్లకు సంబంధించి రూ.150 కోట్ల అవినీతి జరిగిందని విజిలెన్స్ నివేదిక ఇవ్వడంతో శ్రీకాకుళం జిల్లాలోని అచ్చెన్నాయుడు సొంత ఇంటిలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం గుంటూరు తరలించారు. ఏసీబీ కోర్టులో హాజరుపరచడంతో 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అయితే అచ్చెన్నాయుడుకు అనారోగ్యం కారణంగా గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలోనే ఆయన్ను విచారిస్తున్నారు. గురువారం 3 గంటల పాటు విచారించిన ఏసీబీ అధికారులు.. శుక్రవారం కూడా విచారిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు అచ్చెన్నాయుడిని ప్రశ్నించనున్నారు.
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Nara Lokesh, Tdp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు