Nara Lokesh: ఆ నిర్ణయం సరికాదు.. కేంద్రమంత్రికి నారా లోకేశ్ లేఖ

Nara Lokesh News: ఇటీవల హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం స్థాయిని బ్రాంచ్ కార్యాలయంగా కుదించినప్పటికీ మంత్రి కిషన్ రెడ్డి జోక్యంతో తిరిగి ప్రాంతీయ కార్యాలయంగా కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని లోకేశ్ అన్నారు

news18-telugu
Updated: September 28, 2020, 4:07 PM IST
Nara Lokesh: ఆ నిర్ణయం సరికాదు.. కేంద్రమంత్రికి నారా లోకేశ్ లేఖ
నారా లోకేశ్ (ఫైల్ ఫోటో)
  • Share this:
జాతీయ చేనేత అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌డిసి) ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడ కేంద్రంగా కొనసాగించాలoటూ కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. తెలంగాణ ఎన్‌హెచ్‌డిసి కంటే ఎక్కువ టర్నోవర్,ఎక్కువ నేత కుటుంబాలు ఆధారపడిన విజయవాడ ప్రాంతీయ కార్యాలయం స్థాయిని ఇప్పుడు బ్రాంచ్ కార్యాలయంగా కుదించడం మంచి నిర్ణయం కాదని అన్నారు. చేనేత కుటుంబాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో దక్షిణ భారతదేశంలో ఏపీ 2వ స్థానంలో ఉందని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో 3 లక్షలకు పైగా నేత కార్మికులు ఉన్నారని వివరించారు.

ఎన్‌హెచ్‌డిసి విజయవాడలో బ్రాంచ్ కార్యాలయం స్థాపించిన నాటి నుంచి చేనేత ఆదాయంలో స్థిరమైన పెరుగుదల ఉందని తెలిపారు. ఇందుకు అనుగుణంగా బ్రాంచ్ కార్యాలయం ప్రాంతీయ కార్యాలయంగా అభివృద్ధి చెందిందని ప్రస్తావించు. ఇది హైదరాబాద్‌లోని ప్రాంతీయ కార్యాలయంతో సంబంధం లేకుండా మార్కెట్ సామర్థ్యాన్ని బట్టి నూలు సరఫరాలో చేనేత కార్మికులకు ఎంతో ప్రయోజనం చేకూర్చిందని వెల్లడించారు. 200కి పైగా చేనేత సహకార సంస్థలు మరియు అనుబంధ సంస్థలకు లబ్ది చేకూర్చిందని అన్నారు. తెలంగాణ ఎన్‌హెచ్‌డిసి టర్నోవర్ రూ.16కోట్ల వరకు ఉంటే విజయవాడ ప్రాంతీయ కార్యాలయం టర్నోవర్ రూ.80కోట్ల వరకు ఉందని లేఖలో ప్రస్తావించారు.

nara lokesh letter to smiri irani, Nara lokesh news, nhdc regional office, Vijayawada news, ap news, tdp news, స్మృతి ఇరానీకి నారా లోకేశ్ లేఖ, ఎన్‌హెచ్‌డీసీ ప్రాంతీయ కార్యాలయం, విజయవాడ న్యూస్, టీడీపీ న్యూస్, ఏపీ న్యూస్
స్మృతి ఇరానీ (File Photo)


ఇటీవల హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం స్థాయిని బ్రాంచ్ కార్యాలయంగా కుదించినప్పటికీ మంత్రి కిషన్ రెడ్డి జోక్యంతో తిరిగి ప్రాంతీయ కార్యాలయంగా కొనసాగించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని లోకేశ్ అన్నారు. విజయవాడ ప్రాంతీయ కార్యాలయం స్థాయిని పునరుద్ధరించాలని కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి విజ్ఞప్తి చేశారు. విజయవాడ కార్యాలయం స్థాయి తగ్గించినందున సహకార సంఘాలు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ, నూలు డిపో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గత ఆరు నెలల్లో, కరోనా మహమ్మారి ఖాదీ,చేనేత రంగాన్ని నాశనం చేసిందని.. ఉత్పత్తులు అమ్ముడుపోక తీవ్ర నష్టాల్లో ఉన్నారని లోకేశ్ అన్నారు. వారికి కొత్త పని లేకుండా పోయిందని.. ఎన్‌హెచ్‌డిసి తాజా నిర్ణయం నేతన్నలు కోలుకునే అవకాశాలను మరింత దెబ్బతీస్తోందని లేఖలోపేర్కొన్నారు.

హైదరాబాద్ కార్యాలయం విషయంలో త్వరితగతిన ఎలా అయితే నిర్ణయం తీసుకున్నారో అలానే విజయవాడ ఎన్‌హెచ్‌డిసి కార్యాలయాన్ని తక్షణమే ప్రాంతీయ కార్యాలయంగా గుర్తించాలని కోరుతున్నానని అన్నారు. దీని వలన నేతన్నలు వారి అవసరాలకు హైదరాబాద్ కార్యాలయంపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని లోకేశ్ అన్నారు. .సమయం వృధా కాకుండా వృత్తిని లాభదాయకంగా కొనసాగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
Published by: Kishore Akkaladevi
First published: September 28, 2020, 4:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading