Home /News /andhra-pradesh /

ఏపీ మంత్రికి నారా లోకేశ్ లేఖ... ఎందుకంటే..

ఏపీ మంత్రికి నారా లోకేశ్ లేఖ... ఎందుకంటే..

ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ టీడీపీ నినాదమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేశ్ అన్నారు. న్యాయస్థానాల్లో ప్రజల ఆకాంక్షలకు న్యాయం జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజా రాజధాని అమరావతిని పరిరక్షించుకుని తీరుతామని తెలిపారు.

సిఆర్‌డిఎ గ్రామాల్లోని పారిశుధ్య కార్మికులకు గత 4-5 నెలలుగా జీతాలు ఇవ్వకపోవటం ఆవేదన కలిగించే అంశమని నారా లోకేశ్ అన్నారు.

    పారిశుద్ధ్య కార్మికులకు తక్షణమే వేతనాలు చెల్లించాలంటూ మంత్రి బొత్స సత్యనారాయణకు టీడీపీ నేత, మాజీమంత్రి నారా లోకేశ్ లేఖ రాశారు. కరోనా నివారణకు జరుగుతున్న పోరాటంలో పారిశుధ్య కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కఠినమైన సమయాల్లో కూడా చిత్తశుద్ధితో తమ విధులను నిర్వర్తిస్తున్నారని వ్యాఖ్యానించారు. పారిశుధ్య కార్మికుడికి వ్యక్తిగత రక్షణ కిట్లను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని నారా లోకేశ్ ఆరోపించారు. ఇప్పటికీ వారు తమ విధులకు హాజరవుతున్నారని...చాలా సార్లు వారి సాధారణ పని గంటలను పొడిగిస్తున్నారని అన్నారు.

    సిఆర్‌డిఎ గ్రామాల్లోని పారిశుధ్య కార్మికులకు గత 4-5 నెలలుగా జీతాలు ఇవ్వకపోవటం ఆవేదన కలిగించే అంశమని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు ప్రభుత్వానికి అనేక అభ్యర్ధనలు చేసినా పట్టించుకోలేదని నారా లోకేశ్ తన లేఖలో ప్రస్తావించారు. సంక్షోభ సమయంలోనూ సమ్మెలో కూర్చోవడం వారి చివరి అస్త్రంగా మారిందని అన్నారు.వారికి తక్షణమే జీతాలు చెల్లించేలా చూడాలని కోరారు. సిఆర్‌డిఎ ప్రాంతంలోని పారిశుధ్య కార్మికుల బకాయిలన్నీ వెంటనే చెల్లించాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Botsa satyanarayana, Nara Lokesh, Tdp, Ysrcp

    తదుపరి వార్తలు