వారిని ఆదుకోండి.. సీఎం జగన్‌కు లోకేశ్ లేఖ

ట్రేడర్లంతా సిండికేట్‌గా ఏర్పడి ధరలు తగ్గించేశారనే ఫిర్యాదు రైతుల నుంచి వ్యక్తమవుతోందని నారా లోకేశ్ అన్నారు.

news18-telugu
Updated: May 22, 2020, 10:54 PM IST
వారిని ఆదుకోండి.. సీఎం జగన్‌కు లోకేశ్ లేఖ
నారా లోకేష్, వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
పొగాకు రైతులను కరోనా ఆర్థికంగా దెబ్బతీస్తోందని నారా లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పొగాకు రైతులు గత ఏడాది కిలో 170 రూపాయల చొప్పున అమ్ముకున్నారని, ఇప్పుడు అది 130 నుంచి 150 రూపాయలకే విక్రయించాల్సి వస్తోందని తెలిపారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. పొగాకు వేలం సరిగా జరగడం లేదని ఆయన అన్నారు. ఈ-వేలంలో అతి తక్కువ ధర పలకటం వంటి పరిణామాలు రైతులను తీవ్రంగా దెబ్బతీశాయని లోకేష్ వ్యాఖ్యానించారు. సీజన్‌లో తమ ఉత్పత్తిని అమ్ముకోలేక రైతులు 40 రోజుల పాటు నిల్వ చేసుకున్నారని చెప్పారు.

ఇప్పుడు నాణ్యత తగ్గిందనే సాకు చూపుతుండటంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు పొగాకు బార్న్‌పై దాదాపు 3 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందని లోకేష్ అన్నారు. ట్రేడర్లంతా సిండికేట్‌గా ఏర్పడి ధరలు తగ్గించేశారనే ఫిర్యాదు రైతుల నుంచి వ్యక్తమవుతోందని తన లేఖలో పేర్కొన్నారు. పొగాకు రైతులతో ఒక ప్రతినిధుల బృందాన్ని ఢిల్లీకి పంపాలని, కేంద్రంతో పొగాకు రైతుల సమస్యను చర్చించి వారికి న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.రైతుల అవసరాన్ని అవకాశంగా చేసుకుంటున్న వారిపట్ల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లోకేష్ సూచించారు.
First published: May 22, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading